Home » News » Wi Vs Zim T20 World Cup 2026 West Indies 107 Run Win Over Zimbabwe
News

WI vs ZIM T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్: వెస్టిండీస్ ఊచకోత.. జింబాబ్వేపై 107 పరుగుల భారీ విజయం.. భారత్ కు షాక్..!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: February 24, 2026 6:44 am
Advertisement

WI vs ZIM T20 World Cup 2026 ముంబైలోని వాంఖడే స్టేడియం మరోసారి సిక్సర్ల వర్షానికి వేదికైంది. టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్‌-8లో భాగంగా జరిగిన కీలక పోరులో వెస్టిండీస్ బ్యాటర్లు సింహగర్జన చేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇది టీ20 వరల్డ్ కప్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు కావడం గమనార్హం.

Advertisement

WI vs ZIM T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్: వెస్టిండీస్ ఊచకోత.. జింబాబ్వేపై 107 పరుగుల భారీ విజయం.. హెట్మెయర్ మెరుపు బ్యాటింగ్

WI vs ZIM T20 World Cup 2026 హెట్మెయర్ విధ్వంసం – ఫాస్టెస్ట్ ఫిఫ్టీ

వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో షిమ్రాన్ హెట్మెయర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, టీ20 వరల్డ్ కప్‌లో విండీస్ తరపున వేగవంతమైన అర్ధశతకం బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మొత్తం 34 బంతులు ఎదుర్కొన్న హెట్మెయర్ 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 85 పరుగులు చేసి జింబాబ్వే బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ (59) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.

Advertisement

కుప్పకూలిన జింబాబ్వే బ్యాటింగ్

255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. విండీస్ స్పిన్నర్లు అకీల్ హోసేన్, గుడకేష్ మోతీలు జింబాబ్వే బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. వరుస వికెట్లు కోల్పోవడంతో జింబాబ్వే కోలుకోలేకపోయింది. బ్రాడ్ ఈవాన్స్ (43) పోరాడినప్పటికీ, మిగిలిన వారు విఫలం కావడంతో జింబాబ్వే 17.4 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయింది.

బౌలింగ్‌లో మోతీ మాయాజాలం

వెస్టిండీస్ బౌలర్లలో గుడకేష్ మోతీ 4 వికెట్లతో సత్తా చాటగా, అకీల్ హోసేన్ 3 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో వెస్టిండీస్ తన నెట్ రన్ రేట్ NRRను భారీగా మెరుగుపరుచుకుని పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికాను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరింది. టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ ఫేవరెట్ జట్టుగా దూసుకుపోతోంది.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి