Home » News » Another Super Update From Whatsapp
News

Whatsapp : వాట్సాప్‌ నుంచి మరో సూపర్‌ అప్‌డేట్‌ .. యాప్‌ అవసరం లేకుండానే..!

Authored By
Suma
The Telugu News | Updated on: February 11, 2026 3:11 pm
Advertisement

Whatsapp : వాట్సాప్‌ తన యూజర్ల సౌకర్యం, భద్రతను దృష్టిలో పెట్టుకొని వరుసగా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే మెసేజింగ్‌ రంగంలో అగ్రగామిగా ఉన్న ఈ ప్లాట్‌ఫామ్‌ ఇప్పుడు వెబ్‌ యూజర్ల కోసం కీలక మార్పులను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం వాట్సాప్‌ వెబ్‌ ద్వారా కూడా వాయిస్‌, వీడియో కాల్స్‌ చేసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌ ప్రస్తుతం కొంతమంది బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Whatsapp : వాట్సాప్‌ నుంచి మరో సూపర్‌ అప్‌డేట్‌ .. యాప్‌ అవసరం లేకుండానే..!

Whatsapp : వెబ్‌లో వాయిస్‌, వీడియో కాల్స్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

ఇప్పటివరకు వాట్సాప్‌ వెబ్‌ (బ్రౌజర్‌) ద్వారా చాటింగ్‌, ఫైల్‌ షేరింగ్‌, స్టేటస్‌ అప్‌డేట్స్‌ వంటి సౌకర్యాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాయిస్‌, వీడియో కాల్స్‌ చేయాలంటే విండోస్‌ లేదా macOS డెస్క్‌టాప్‌ యాప్‌ను వినియోగించాల్సి వచ్చేది. అయితే త్వరలో ఈ పరిస్థితి మారనుంది. బ్రౌజర్‌ ద్వారానే వన్‌-టు-వన్‌ వాయిస్‌, వీడియో కాల్స్‌ చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ఈ అప్‌డేట్‌తో యూజర్లు ప్రత్యేకంగా డెస్క్‌టాప్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన అవసరం లేకుండా నేరుగా బ్రౌజర్‌లోనే కాల్స్‌ చేసుకోవచ్చు. ముఖ్యంగా కార్యాలయాల్లో లేదా పబ్లిక్‌ కంప్యూటర్లలో వెబ్‌ వెర్షన్‌ ఉపయోగించే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది. అయితే తొలి దశలో వ్యక్తిగత కాల్స్‌కే పరిమితమవుతుందనే సమాచారం ఉంది. గ్రూప్‌ కాలింగ్‌ ఫీచర్‌పై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు.

Advertisement

Whatsapp : భద్రతతో పాటు స్క్రీన్‌ షేరింగ్‌ సదుపాయం

వాట్సాప్‌ తన భద్రతా ప్రమాణాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తోంది. వెబ్‌లో అందుబాటులోకి రానున్న కాలింగ్‌ ఫీచర్‌కు కూడా ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ (E2E) సపోర్ట్‌ ఉంటుందని తెలుస్తోంది. అంటే యూజర్ల మధ్య జరిగే సంభాషణలు పూర్తిగా గోప్యంగా ఉండేలా భద్రత కల్పించనుంది. అంతేకాకుండా స్మార్ట్‌ఫోన్‌ యాప్‌లో ఇప్పటికే ఉన్న స్క్రీన్‌ షేరింగ్‌ ఆప్షన్‌ను కూడా వెబ్‌ కాల్స్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ ఫీచర్‌ అమలులోకి వస్తే ఆన్‌లైన్‌ మీటింగ్స్‌, ప్రెజెంటేషన్లు, సాంకేతిక సహాయం వంటి అవసరాలకు వెబ్‌ వాట్సాప్‌ మరింత ఉపయోగకరంగా మారనుంది. అధికారిక ప్రకటన వెలువడకపోయినా బీటా వెర్షన్‌ ఆధారంగా ఈ అప్‌డేట్‌ త్వరలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

Whatsapp : స్టేటస్‌లో కస్టమ్‌ లిస్టులు.. సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ కూడా?

వాట్సాప్‌ స్టేటస్‌ ఫీచర్‌ను మరింత వ్యక్తిగతీకరించేందుకు కూడా కంపెనీ పనిచేస్తోందని సమాచారం. భవిష్యత్తులో స్టేటస్‌ పోస్ట్‌ చేసే సమయంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌, సహోద్యోగులు వంటి వర్గాల వారీగా కస్టమ్‌ లిస్టులు సృష్టించుకునే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఎవరికెవరికీ స్టేటస్‌ కనిపించాలనేది యూజర్లు మరింత సులభంగా నియంత్రించగలుగుతారు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ అభివృద్ధి దశలో ఉంది. ఇదిలా ఉండగా వాట్సాప్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు లీకులు సూచిస్తున్నాయి. ఈ ప్లాన్‌లో ప్రీమియం స్టిక్కర్లు, మూడు కంటే ఎక్కువ చాట్స్‌ను పిన్‌ చేసుకునే సౌకర్యం, ప్రత్యేక యాప్‌ థీమ్‌లు వంటి అదనపు ఫీచర్లు ఉండొచ్చని సమాచారం. అయితే ఇవన్నీ ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నాయని తెలుస్తోంది. ఇక, యూజర్‌ అనుభవాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా వాట్సాప్‌ పలు కీలక మార్పులు తీసుకొస్తోంది. అధికారిక ప్రకటనలతో మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి అయ్యే అవకాశముంది.

Advertisement

 

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి