Home » News » Anthropic Ceo Says Software Engineering Disappear In 12 Months
News

Software Engineer Jobs : టెక్కీస్ అలర్ట్.. వచ్చే 6 నుంచి 12 నెలల్లో మాయం కానున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జాబ్స్ : ఆంత్రోపిక్ ఏఐ సీఈవో

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: February 6, 2026 5:50 pm
Advertisement

Software Engineer Jobs | సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నవారికి ఇది నిజంగా ఒక షాకింగ్ న్యూస్. రాబోయే 6 నుంచి 12 నెలల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ రంగం పూర్తిగా మాయం అయిపోయే అవకాశం ఉందని ప్రముఖ AI సంస్థ ఆంత్రోపిక్ Anthropic సీఈవో ఒక చర్చా కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అభివృద్ధి చెందుతున్న తీరును చూస్తుంటే, మనుషులు కోడింగ్ రాయాల్సిన అవసరం త్వరలోనే ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

Software Engineer Jobs : టెక్కీస్ అలర్ట్.. వచ్చే 6 నుంచి 12 నెలల్లో మాయం కానున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జాబ్స్ : ఆంత్రోపిక్ ఏఐ సీఈవో

Software Engineer Jobs  | మా ఇంజినీర్లు కూడా కోడ్ రాయడం లేదు

దావోస్ లో ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సులో ఆయన మాట్లాడుతూ, తన సంస్థలోని ఇంజినీర్లే ఇప్పుడు కోడింగ్ రాయడం లేదని వెల్లడించారు. “నా దగ్గర పని చేసే ఇంజినీర్లు ఇప్పుడు కోడ్ రాయడం లేదు. కేవలం AI మోడల్స్ రాసిన కోడ్‌ను ఎడిట్ చేస్తున్నారు, దాన్ని పర్యవేక్షిస్తున్నారు. కేవలం 6 నుంచి 12 నెలల వ్యవధిలోనే AI మోడల్స్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు చేసే పనులన్నీ మొదటి నుంచి చివరి వరకు చేయగలవు” అని ఆయన పేర్కొన్నారు.

Advertisement

కోడింగ్ అవసరం లేదా?

సాధారణంగా ఒక సాఫ్ట్‌వేర్ తయారు చేయాలంటే ఎంతో మంది ఇంజినీర్లు నెలల తరబడి కష్టపడి వేల లైన్ల కోడింగ్ రాయాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడు వస్తున్న అడ్వాన్స్‌డ్ AI మోడల్స్ కేవలం కొన్ని సెకన్లలోనే సంక్లిష్టమైన కోడింగ్‌ను అందిస్తున్నాయి. ఈ క్రమంలో భవిష్యత్తులో కేవలం కోడింగ్ తెలిసిన వ్యక్తుల కంటే, ఆ AI మోడల్స్‌ను ఎలా నియంత్రించాలి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన వారి అవసరమే ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి?

ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టెక్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీశాయి. ఇప్పటికే లేఆఫ్స్ తో సతమతమవుతున్న సాఫ్ట్‌వేర్ రంగానికి ఇది మరో దెబ్బ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, మరికొందరు నిపుణులు మాత్రం సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ మాయం అవ్వదని, కేవలం అది చేసే పద్ధతి మారుతుందని చెప్తున్నారు. ఇంజినీర్లు ఇకపై ‘కోడర్స్’ గా కాకుండా ‘సిస్టమ్ డిజైనర్స్’ గా మారాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు.

Advertisement

టెక్నాలజీ మారుతున్న వేగాన్ని బట్టి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తమ నైపుణ్యాలను నిరంతరం అప్‌గ్రేడ్ చేసుకోవడం తప్పనిసరి. కేవలం కోడింగ్ మీద మాత్రమే ఆధారపడకుండా, AI టూల్స్‌ను ఎలా సమర్థవంతంగా వాడాలో తెలుసుకోవడం ఇప్పుడు ప్రాధాన్యతగా మారింది. ఆంత్రోపిక్ చేసిన ఈ వ్యాఖ్యలు నిజమవుతాయా లేక AI కేవలం ఒక సహాయకారిగా మాత్రమే మిగిలిపోతుందా అనేది వేచి చూడాలి.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి