
Venu Swamy : మాజీ సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లకుండా తప్పించుకోలేడు.. జ్యోతిష్యుడు వేణు స్వామి...!
Venu Swamy : జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు…వేణు స్వామి మొదట తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ బాగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. అలాగే వేణు స్వామి చెప్పిన కొందరి సెలబ్రిటీల జాతకాలు చెప్పినట్లుగానే జరగడంతో చాలామంది వేణు స్వామిని నమ్మడం మొదలుపెట్టారు. ఆ విధంగా వేణు స్వామి సోషల్ మీడియాతో పాటు సినీ ఇండస్ట్రీలో రాజకీయ వర్గాలలో సైతం చాలా ఫేమస్ అయ్యారు. ఈ క్రమంలోనే పలు రకాల ఇంటర్వ్యూలో పాల్గొంటున్న వేణు స్వామి రాజకీయ నాయకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇక ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ పలు రాజకీయ నేతల జాతకాలను చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అవుతారని వేణు స్వామి తెలియజేశారు. ఇక వేణు స్వామి చెప్పినట్లుగానే ఇటీవల కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ కావడం జరిగింది.
గత శనివారం కలవకుంట్ల కవిత ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడి అధికారులు ఆమెను అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. ఇది ఇలా ఉంటే అదే ఇంటర్వ్యూలో వేణు స్వామి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ది మరియు టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ది ఒకటే జాతకమని వేణు స్వామి తెలియజేశారు. ఇక వీరిద్దరి జాతకం ప్రకారం కచ్చితంగా జైలు జీవితం గడపాల్సి ఉంటుందని వేణు స్వామి స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయాన్ని వేణు స్వామి ముందే చెప్పడం జరిగింది.
అయితే చంద్రబాబు నాయుడు జాతకం కెసిఆర్ జాతకం ఒకే విధంగా ఉండటంతో కెసిఆర్ కూడా కచ్చితంగా జైలు జీవితం గడపాల్సి ఉంటుందని ఆయన తెలియజేశారు. అయితే కేసీఆర్ ఇప్పటివరకు క్లీన్ రాజకీయాలు చేశారు కదా ఎలా అరెస్ట్ అవుతారు ఏవిధంగా అరెస్టు అవుతారు అని యాంకర్ వేణు స్వామిని అడుగగా….ఎలా ఏంటి అనేది నేను చెప్పలేను కానీ కేసీఆర్ కచ్చితంగా జైలు జీవితం గడపాల్సి ఉంటుందని వేణు స్వామి స్పష్టం చేశారు. దీంతో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. అయితే ఇప్పటికే వేణు స్వామి చెప్పిన మాదిరిగా ఇద్దరు రాజకీయ నాయకులు జైలుకు వెళ్లడం జరిగింది. మరి ఇప్పుడు కేసీఆర్ కూడా జైలుకు వెళ్లే పరిస్థితులు వస్తాయా అనేది వేచి చూడాల్సిందే.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.