Home » News » Big Breaking News Telangana Government Good News On Ration Cards
News

Ration cards : బిగ్‌ బ్రేకింగ్ న్యూస్ .. రేషన్ కార్డులపై శుభవార్త తెలిపిన ప్రభుత్వం…!

Authored By
Suma
The Telugu News | Updated on: February 12, 2026 2:20 pm
Advertisement

Ration cards : రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఎటువంటి విరామం లేకుండా నిరంతరం కొనసాగుతోందని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా పారదర్శక విధానంతో కొత్త కార్డులు మంజూరు చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రేషన్ కార్డు లేక ఇబ్బందులు పడుతున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉందని ప్రభుత్వం తెలిపింది.

Advertisement

Ration cards : బిగ్‌ బ్రేకింగ్ న్యూస్ .. రేషన్ కార్డులపై శుభవార్త తెలిపిన ప్రభుత్వం .. ఇక పై ఈ ప్రక్రియ నిరంతరం ..!

Ration cards : ‘మీ సేవ’ కేంద్రాల్లో ఎప్పుడైనా దరఖాస్తు

రేషన్ కార్డు లేని అర్హులైన వ్యక్తులు తమ సమీపంలోని ‘మీ సేవ’ కేంద్రాలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వివరించారు. అవసరమైన పత్రాలు సమర్పించి అర్హత ప్రమాణాలు పూర్తి చేసిన వారికీ వేగంగా కార్డులు మంజూరు చేయబడుతున్నాయని తెలిపారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం జరుగుతోందని చెప్పారు. అంతేకాకుండా ఇప్పటికే ఉన్న పాత రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చుకునే అవకాశమూ కల్పించబడిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కుటుంబంలో కొత్తగా చేరిన సభ్యులు లేదా ఇప్పటివరకు చేర్చని వారి వివరాలను నమోదు చేసుకునేందుకు కూడా ‘మీ సేవ’ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఈ ప్రక్రియను సరళతరం చేయడంతో ప్రజలకు సౌకర్యం కలుగుతోందని పేర్కొంది.

Advertisement

Ration cards : గత ఏడాదిలో 14.40 లక్షల కొత్త కార్డులు

గత ఏడాది కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 14.40 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇది రేషన్ కార్డు అవసరమైన కుటుంబాలకు ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తోందో తెలియజేస్తోందని అధికారులు పేర్కొన్నారు. దరఖాస్తుల పరిశీలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అర్హత ప్రమాణాలను కచ్చితంగా అమలు చేస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఆహార భద్రత పథకాల లబ్ధి అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎటువంటి అవకతవకలకు తావులేకుండా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి సాంకేతిక సదుపాయాలను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు.

Ration cards : మొత్తం కార్డుల సంఖ్య 1.04 కోట్లకు పైగా

ఇకపోతే.. 2026 జనవరి నాటికి రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 1,04,35,848కు చేరిందని ప్రభుత్వం వెల్లడించింది. ఇది రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కుటుంబాలు ప్రభుత్వ ఆహార భద్రత పథకాల కింద లబ్ధి పొందుతున్నాయని సూచిస్తోంది. కొత్తగా అర్హత సాధించిన కుటుంబాలను గుర్తించి వారికి కూడా కార్డులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రేషన్ కార్డు అనేది కేవలం ఆహార ధాన్యాల సరఫరాకే కాకుండా పలు సంక్షేమ పథకాల అమలులో కీలక పత్రంగా పనిచేస్తోందని అధికారులు గుర్తు చేశారు. అందువల్ల అర్హత కలిగిన ప్రతి కుటుంబం తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ భవిష్యత్తులో కూడా నిరంతరంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది.

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి