Home » News » Bjp Mla Raja Singh Takes On Owaisi Brothers
News

Raja Singh : రాజా సింగ్ హ‌ల్‌చ‌ల్.. ఒవైసీ అరుపులకు ఎవరు భయపడరు

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: April 7, 2025, 12:00 pm
Advertisement

Raja Singh : శ్రీ రామ నవమి ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని గోషామహల్‌ నియోజకవర్గం ధూల్‌పేట్‌లో నిర్వహించిన శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ ఆధ్వర్యంలో జరిగిన శోభాయాత్రకి పెద్ద ఎత్తున భ‌క్తులు హాజ‌ర‌య్యారు. డీజే స్టెప్పులకు భక్తులు ఉర్రూతలూగించేలా డ్యాన్స్‌లు చేశారు. ఈ సందర్భంగా జై శ్రీరామ్‌ నినాదాలతో పాతబస్తీ దద్దరిల్లింది.

Advertisement

Raja Singh : రాజా సింగ్ హ‌ల్‌చ‌ల్.. ఒవైసీ అరుపులకు ఎవరు భయపడరు

Raja Singh రాజాసింగ్ కామెంట్స్..

పార్లమెంట్‌లో వక్ఫ్ బిల్ పాస్ అయిందని ఒవైసీ బ్రదర్స్ గగ్గోలు పెడుతున్నారని గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యంగ్యంగా అన్నారు. ఆ బ్రదర్స్ అరుపులకు ఇక్కడ ఎవరు భయపడరని ఆయన పేర్కొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం గోషామహాల్‌లో ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. త్వరలో మోదీ.. భారత్‌ను హిందు రాష్ట్రంగా చేసే దిశగా కృషి చేస్తున్నారని చెప్పారు.

Advertisement

మనమంతా ఐక్యంగా ప్రధాని మోదీకి అండగా నిలవాలని ఈ సందర్భగా ప్రజలకు ఆయన పిలుపు నిచ్చారు. ముస్లింలను మోసం చేస్తున్న వ్యక్తి ఒవైసీ అని ఆయన అభివర్ణించారు. ఒక వైపు మోడీ, మరో వైపు యోగి ఇద్దరి వైపు దేశం మొత్తం చూస్తుందన్నారు. రామ్ మందిర్ నిర్మాణం జరగదని ఓవైసీ భావించారని రాజా సింగ్ చెప్పారు. కానీ శ్రీరామనవమి రోజు జనసంద్రాని చూసి ఒవైసీ కంగుతిన్నాడని పేర్కొన్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి