
BRS : బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్‌గా మారుతుందా.. ముహూర్తం అప్పుడే..!
BRS : బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) మళ్లీ టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి)గా మారుతుందా? అంటే అవును అంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆవిర్భవించిన ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్‌కు రెండుసార్లు తెలంగాణ ప్రజలు అధికారం కట్టబెట్టారు. కానీ, బీఆర్‌ఎస్‌గా పేరు మార్చిన తర్వాత తెలంగాణలో అధికారం కోల్పోవడం, రోజురోజుకూ పార్టీ గ్రాఫ్ పడిపోతున్న నేపథ్యంలో పేరు మార్పుపై అధిష్ఠానం కసరత్తు చేస్తుంది.
BRS : బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్‌గా మారుతుందా.. ముహూర్తం అప్పుడే..!
2014లో అలాగే 2018లో కూడా రెండు సార్లు తెలంగాణాలో అధికారం దక్కించుకుంది టీఆర్ఎస్. అయితే 2018లో రెండోసారి అధికారం దక్కాక కేసీఆర్ ఆలోచనలు జాతీయ రాజకీయాల మీదకు మళ్ళాయి. దాంతో ఆయన టీఆర్ఎస్ ని కాస్తా బీఆర్ఎస్ గా మార్చారు. అంటే భారత రాష్ట్ర సమితి అన్న మాట. టీఆర్ఎస్‌ని 2022 డిసెంబర్ 9న బీఆర్ఎస్ గా మార్చారు. అప్పటి నుండి కష్టాలు ఎక్కువయ్యాయి. 2023 డిసెంబర్ లో జరిగిన తెలంగాణా శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని ఓడించి కాంగ్రెస్ కి పట్టం కట్టారు. ఇక 2024 మేలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో కూడా బీఅర్ఎస్ కి ఉన్న ఎనిమిది ఎంపీ సీట్లను కూడా పక్కన పెట్టి జీరో నంబర్ ఇచ్చేశారు.
గత పదిహేను నెలలుగా ప్రతిపక్ష పాత్రలో బీఆర్ఎస్ చేయాల్సింది చేస్తున్నా రావాల్సిన మైలేజ్ రావడం లేదు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వద్దు టీఆర్ఎస్ ముద్దు అన్నది ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన నుంచే మొదలైంది. ఈ ఏడాది ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పాతికేళ్ళ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ రోజు తెలంగాణ సెంటిమెంట్ ని తిరిగి పార్టీ పేరులోకి తెస్తూ టీఆర్ఎస్ గా మారుస్తారనే టాక్ నడుస్తుంది.
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
This website uses cookies.