Home » News » Chicken Shops Across Telangana To Be Closed From April 1
News

Chicken Shops : నాన్‌వెజ్ ప్రియులకు షాక్ .. ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపుల బంద్..?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: March 25, 2026, 6:30 pm
Advertisement

Chicken Shops : తెలంగాణ రాష్ట్రంలో చికెన్ వ్యాపారం సంక్షోభంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. పౌల్ట్రీ కంపెనీల విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న చికెన్ షాప్ యజమానులు ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా షాపులు మూసివేయాలని నిర్ణయం తీసుకునే దిశగా సాగుతున్నారు. తమకు లభిస్తున్న లాభాల మార్జిన్ సరిపోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నేతలు పౌల్ట్రీ కంపెనీల వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో చికెన్ ధరలు రోజురోజుకీ పెరుగుతున్నప్పటికీ వ్యాపారులకు ఇచ్చే మార్జిన్ మాత్రం తగ్గించడం అన్యాయమని అంటున్నారు. కంపెనీలు తమ లాభాలను పెంచుకునేందుకు చిన్న వ్యాపారులను నష్టపరుస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు.

Advertisement

Chicken Shops : నాన్‌వెజ్ ప్రియులకు షాక్ .. ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపుల బంద్..?

చికెన్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు అధిక ధరలు చెల్లిస్తున్నా దాని ప్రయోజనం వ్యాపారులకు అందడం లేదని వారు చెబుతున్నారు. రవాణా ఖర్చులు, కార్మిక వ్యయం, విద్యుత్ బిల్లులు పెరిగినా, కంపెనీలు ఇచ్చే మార్జిన్ మాత్రం తగ్గించడం వల్ల వ్యాపారాలు నష్టాల్లోకి వెళ్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పౌల్ట్రీ కంపెనీలు తమ విధానాన్ని మార్చి మార్జిన్ పెంచకపోతే రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో ధర్నాలు చేపడతామని వ్యాపారులు హెచ్చరించారు. అవసరమైతే నిరవధికంగా చికెన్ షాపులు మూసివేసే దిశగా కూడా ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ పరిస్థితి కొనసాగితే వినియోగదారులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి