Home » News » Cm Revanth Key Orders On Ration Cards
News

New Ration Cards : మీరు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారా ? .. అయితే శుభవార్తే .. ఇక నుంచి ఎప్పుడైనా.. సీఎం కీలక ఆదేశాలు ..!

Authored By
Suma
The Telugu News | Published on: March 1, 2026, 1:00 pm
Advertisement

New Ration Cards : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డుల జారీ నిలిచిపోవడంతో అనేక అర్హులైన పేద కుటుంబాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నుంచి దూరమయ్యాయి. ముఖ్యంగా బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు, ఆరోగ్య పథకాలు, విద్యుత్ రాయితీలు వంటి సేవలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం ప్రారంభించింది. అయితే ఇప్పటికీ కొందరు అర్హులు వివిధ కారణాల వల్ల తమ కార్డులను పొందలేదని అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని, ఎవరూ లబ్ధి నుంచి దూరం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

New Ration Cards : మీరు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారా ? .. అయితే శుభవార్తే .. ఇక నుంచి ఎప్పుడైనా.. సీఎం కీలక ఆదేశాలు ..!

New Ration Cards : ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’కు శ్రీకారం

రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువ కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు మొత్తం 99 రోజుల పాటు ఈ ప్రణాళిక అమలులో ఉండనుంది. అన్ని శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం స్పష్టం చేశారు. జూన్ 2న జరుపుకునే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని 4 కోట్ల ప్రజల పండుగగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జరుగుతున్న 99 రోజుల ప్రణాళికను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, ప్రతి శాఖ తన బాధ్యతలను కచ్చితంగా నిర్వర్తించాలని ఆదేశించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు స్పష్టమైన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు అమలు చేయాలని సూచించారు.

Advertisement

New Ration Cards : సాంకేతికతతో సంక్షేమ పథకాల బలోపేతం

దేశ అభివృద్ధి పథంలో తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టాలంటే పరిపాలనలో పారదర్శకత, వేగం అవసరమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అందుకోసం ఆధునాతన సాంకేతికతను సమర్థంగా వినియోగించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా అందేలా ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసి సేవలు పొందే విధానాలను బలోపేతం చేయాలని సూచించారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం, రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ వంటి పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరాలని స్పష్టం చేశారు. సొంత స్థలం ఉన్నా ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రయోజనం కల్పించాలని ఆదేశించారు. అలాగే రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల ప్రక్రియ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని తెలిపారు. ప్రభుత్వ విద్యను ప్రక్షాళన చేయడానికి వంద మండలాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ప్రైవేటు పాఠశాలలకు సమానంగా నాణ్యమైన విద్య అందించాలన్నదే లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సంక్షేమం, అభివృద్ధి, పారదర్శక పరిపాలన అనే మూడు సూత్రాలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని సీఎం పిలుపునిచ్చారు.

 

Advertisement

 

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి