Congress Job Calendar : ప్రశ్నార్థకంగా మారిన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్..?
Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ట్రాన్స్‌కో, ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్ వంటి విద్యుత్ సంస్థల్లో అక్టోబర్ 2024లో నోటిఫికేషన్‌లు విడుదల చేస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు. గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ నోటిఫికేషన్ కూడా అదే విధంగా కేవలం హామీగానే మిగిలిపోయింది…
Congress Job Calendar : ప్రశ్నార్థకంగా మారిన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్..?
Congress Job Calendar : ప్రకటనకు పరిమితమైన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్
గ్రూప్-1 ప్రిలిమినరీ, ఫారెస్ట్ ఉద్యోగాలు, గెజిటెడ్ స్కేల్ ఆఫీసర్లు, డీఎస్సీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లకు సంబంధించి ఎప్పటికప్పుడు నెలల సమయాలను పేర్కొంటూ ప్రభుత్వమే అధికారికంగా ప్రకటనలు చేసినప్పటికీ, వాటిలో ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా వెలువడకపోవడం యువతలో తీవ్ర నిరాశను కలిగిస్తోంది. ఉద్యోగ ఆశతో ఉన్న లక్షల మంది నిరుద్యోగులు ఈ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, ఇది జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్‌లెస్ క్యాలెండర్, దగా క్యాలెండర్‌గా మారిందని ఆయన ఆరోపించారు. అసెంబ్లీలో అధికారికంగా హామీలు ఇచ్చిన పార్టీ అయినా కూడా మాట నిలబెట్టుకోలేదని, యువత ఆశలతో ఆడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు తప్పక విచారిస్తారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
