Categories: NewsTelangana

Revanth Reddy : రేవంత్ మ‌రికాస్త సీరియ‌స్‌గా దృష్టి సారించాల్సిందేనా?

Revanth Reddy : ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో స్వేచ్ఛ అన్న అంశంపై ఎల్ల‌ప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. మాజీ సీఎం కేసీఆర్ సర్కారునే తీసుకుంటే పదేళ్లు పాల‌నా వ్యవహారాల‌న్నీ కేంద్రీకృతంగా ఉండేవి. ఏ నిర్ణయమైనా కేసీఆర్ మాటే ఫైన‌ల్‌. లేదంటే షాడో సీఎంగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న కుమారుడు కేటీఆర్ మాటే శాస‌నంగా కొన‌సాగింది. చివరకు సీఎస్ సైతం వారి ఆదేశాలకు తగ్గట్లు నడుచుకోవటమే తప్పించి, సొంత నిర్ణయాలకు అవకాశమే లేకుండా ఉండే. సీఎస్ పరిస్థితే ఇలా ఉంటే సీనియర్ సివిల్ స‌ర్వీస్‌ అధికారుల సంగతిని చెప్ప‌న‌క్క‌ర‌లేదు. ఇగ ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వ పాల‌న విష‌యానికి వ‌స్తే స్వేచ్చ కాస్త ఎక్కువైంద‌నే అభిప్రాయాలు విన‌వ‌స్తున్నాయి. స‌హ‌జంగానే కాంగ్రెస్ నాయ‌కులు ప్ర‌భుత్వ విధానాల‌పై త‌మ అభిప్రాయాల‌ను బాహాటంగానే వెల్ల‌డిస్తుంటారు. రేవంత్ సర్కారు పాలనలోనూ అది నడుస్తోందన్న వాదన వినిపిస్తోంది. కేసీఆర్ పదేళ్ల సర్కారులో నిర్ణయం ఏదైనా.. అయితే గులాబీ బాస్‌ది.. లేదంటే జూనియర్ బాస్‌దే. కానీ రేవంత్ సర్కారులో అలాంటి పరిస్థితి లేదు. సీఎంకు చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకునే సీనియర్ అధికారులకు కొదవ లేకుండా పోతుంది. అలాంటి వారి విషయంలో చర్యలు తీసుకోవటానికి సీఎం రేవంత్ కు ఉండే పరిమితులు ఇబ్బంది మారుతున్న‌ట్లు స‌మాచారం.

Revanth Reddy : రేవంత్ మ‌రికాస్త సీరియ‌స్‌గా దృష్టి సారించాల్సిందేనా?

తాజాగా వెలుగు చూసిన ఉదంతమే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వర్సెస్ సీఎంఓ ఉండటమే దీనికి కారణం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో తీసుకున్న నిర్ణయాన్ని సీఎంఓ అధికారి రచ్చ చేయటం ఏమిటి అని ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మౌతున్నాయి. అధికారిక ఉత్తర్వుల్లో విషయం బయటకు వచ్చేలా చేయడ‌ దేనికి నిదర్శనం అని ప్రశ్నిస్తున్నారు. అసలేం జరిగిందంటే తెలంగాణలో ఎకో టూరిజంను డెవలప్ చేయటానికి వీలుగా విధానాల్ని డిసైడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.

దీని కోసం టూరిజం అధికారులు ఇతర రాష్ట్రాలు.. దేశాల్లో పర్యటించి ఎకో టూరిజం డెవలప్ మెంట్ కోసం వారు చేస్తున్న చర్యలపై అధ్యయనం చేయాలని డిసైడ్ చేశారు. ఇందుకోసం సీఎంవోలో అటవీ శాఖ బాధ్యతలు చూసే అధికారి (చంద్రశేఖర్ రెడ్డి)తో పాటు ఆ శాఖకు సంబంధించిన మరికొందరిని ఎంపిక చేశారు. వీరంతా ఐఎఫ్ఎస్ అధికారులే. వీరంతా కెన్యా, టాంజానియా దేశాల్లో పర్యటించి అక్కడ ఎకో టూరిజం మీద అధ్యయనం చేయాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. దీనికి సంబంధించి ఫిబ్రవరి 18న సీఎస్ శాంతకుమారి ఒక జీఓ జారీ చేవారు.

Revanth Reddy అధికారుల విదేశీ ప‌ర్య‌ట‌నతో వెలుగులోకి విభేదాలు

ఈ టూర్ కు అయ్యే ఖర్చును తెలంగాణ‌ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నుంచి తీసుకోవాలని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. ఫిబ్రవరి 20 నుంచి 27 వరకు ఆయా దేశాల్లో పర్యటించిన టీమ్‌ రాష్ట్రానికి తిరిగి వచ్చింది. అయితే తనకు చెప్పకుండా విదేశాలకు ఎలా వెళ్తారంటూ పీసీసీ ఎఫ్ డోబ్రియాల్ మెమో జారీ చేశారు. సీఎంవోలోని చంద్రశేఖర్ మినహా మిగిలిన వారంతా తన కింద పని చేసే వారని.. తనకు చెప్పకుండా విదేశాలకు ఎలా వెళతారంటూ వివరణ కోరుతూ మెమో జారీ చేయటం సంచలనంగా మారింది. అధికారులు విదేశాల్లో ఉండగానే ఈ మెమోలు జారీ చేయటం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి.. సీఎస్ అవగాహనతో తీసుకున్న నిర్ణయంపై ఇలా స్పందించటం ఏమిటి? అన్నది ఇప్పుడు చర్చగా మారింది. అధికారుల‌ ఇలాంటి రచ్చలపై సీఎం రేవంత్ రెడ్డి మరికాస్త సీరియ‌స్‌గా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Recent Posts

Brinjal | ఆరోగ్యానికి వరంగా వంకాయ..గుండె, మధుమేహం, క్యాన్సర్ రోగులకి అనేక లాభాలు

Brinjal | వంకాయను సాధారణంగా మనం కూరగాయగా చూస్తాం. కానీ, ఈ సాధారణంగా కనిపించే కూరగాయకు ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు…

28 minutes ago

Vastu Tips | వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు బొప్పాయి చెట్టు మంచిదా, కాదా.. పండితుల సూచన ఏంటి?

Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…

1 hour ago

Biryani | బిర్యానీలో బొద్దింక .. అరేబియన్ మండి రెస్టారెంట్‌లో చెదు అనుభవం!

Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…

16 hours ago

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ఫొటోపై దాఖలైన పిల్‌ను కొట్టేసిన హైకోర్టు .. రాజకీయ ఉద్దేశాలతో కోర్టుల్ని వాడకండంటూ హెచ్చరిక

Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…

17 hours ago

UPI | ఫోన్ పే, గూగుల్ పేలో దూకుడు.. ఒకే నెలలో 20 బిలియన్లు ట్రాన్సాక్షన్లు

UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…

17 hours ago

Trisha | సినిమాల పట్ల త్రిష ప్రేమను మరోసారి చాటిన టాటూ.. సైమా వేడుకలో హైలైట్

Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…

19 hours ago

Walking | రోజుకు 10 వేల అడుగులు నడక వ‌ల‌న‌ వచ్చే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…

20 hours ago

Cholesterol | ముఖంపై కనిపించే లక్షణాలు .. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందని సంకేతాలు!

Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…

21 hours ago