Home » News » Good News Chicken Prices Reduced
News

Chicken Price : బిగ్ బ్రేకింగ్ .. నాన్‌వెజ్ ప్రియులకు ఊరట : చికెన్, గుడ్ల ధరలు భారీగా తగ్గింపు

Authored By
Suma
The Telugu News | Updated on: February 5, 2026 11:18 am
Advertisement

Chicken Price : తెలుగు రాష్ట్రాల్లో Telugu states నాన్‌వెజ్ ప్రియులకు శుభవార్త. గత కొన్ని రోజులుగా చికెన్‌తో Chicken పాటు కోడిగుడ్ల ధరలు Egg prices గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఇటీవల వరకు సంక్రాంతి, మేడారం జాతర వంటి పెద్ద పండుగలు జాతరల కారణంగా చికెన్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. దీంతో కోళ్ల సరఫరా కంటే డిమాండ్ ఎక్కువగా ఉండి ధరలు ఆకాశాన్ని తాకాయి. అయితే పండుగల సీజన్ ముగియడంతో పరిస్థితి పూర్తిగా మారింది. ప్రస్తుతం ప్రత్యేక వేడుకలు లేకపోవడం వినియోగం తగ్గడంతో చికెన్ మార్కెట్ చల్లబడింది. డిమాండ్ తగ్గిన ప్రభావం నేరుగా ధరలపై పడటంతో సామాన్యులకు ఊరట కలుగుతోంది.

Advertisement

Chicken Price : బిగ్ బ్రేకింగ్ .. నాన్‌వెజ్ ప్రియులకు ఊరట : చికెన్, గుడ్ల ధరలు భారీగా తగ్గింపు

Chicken Price : పండుగల తర్వాత తగ్గిన డిమాండ్

గత నెలలో చికెన్ ధరలు Chicken Price చూస్తే వినియోగదారులకు consumers షాక్ ఇచ్చేలా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కిలో చికెన్ ధర రూ.300 నుంచి రూ.350 వరకు చేరింది. పండుగల సమయంలో కోళ్ల ఉత్పత్తి తక్కువగా ఉండటం, రవాణా ఖర్చులు పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. కానీ గత పది రోజులుగా మార్కెట్‌లో పూర్తిగా భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. కోళ్ల ఉత్పత్తి పెరగడం ఫారాల నుంచి సరఫరా మెరుగవడంతో ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. ప్రస్తుతం కిలో చికెన్ సగటున రూ.240 వరకు లభిస్తోంది. అంటే గత నెలతో పోలిస్తే దాదాపు రూ.100 వరకు తగ్గినట్టే. రిటైల్ మార్కెట్‌లో లైవ్ చికెన్ ధర రూ.140 చుట్టూ ఉండగా డ్రెస్‌డ్ చికెన్ రూ.220కి లభిస్తోంది. స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ.240 నుంచి రూ.250 మధ్య పలుకుతోంది. ప్రాంతాల్ని బట్టి స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ మొత్తం మీద ధరలు తగ్గాయనే చెప్పాలి. వ్యాపారులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉత్పత్తి మరింత పెరిగితే ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.

Advertisement

Chicken Price : గుడ్ల ధరలకూ గుడ్‌న్యూస్

చికెన్ మాత్రమే కాదు కోడిగుడ్ల ధరలు కూడా సామాన్యులకు ఊరటనిస్తున్నాయి Relief for common people. మొన్నటివరకు ఒక్కో గుడ్డు రూ.9 వరకు అమ్ముడుపోయింది. దాదాపు రెండు నెలల పాటు అదే ధర కొనసాగింది. కొన్ని ప్రాంతాల్లో గుడ్డు ధర రూ.10కి కూడా చేరింది. నాటుకోడి గుడ్లు అయితే ఒక్కటి రూ.20 వరకు పలికిన సందర్భాలున్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రస్తుతం ఒక్కో గుడ్డు రూ.6కే లభిస్తోంది. ఇది ప్రతి ఇంటి బడ్జెట్‌పై సానుకూల ప్రభావం చూపనుంది. ఎందుకంటే గుడ్లు రోజువారీ వినియోగంలో తప్పనిసరిగా ఉంటాయి. చికెన్‌తో పాటు గుడ్ల ధరలు కూడా తగ్గడంతో ఇంటి ఖర్చులు కొంత తగ్గనున్నాయి. ఇటీవల సంక్రాంతి సమయంలో బ్రాయిలర్ చికెన్ కేజీ రూ.350, మటన్ రూ.1500 వరకు చేరగా, నాటుకోడి చికెన్ ఏకంగా రూ.3000 వరకు పలికి రికార్డు సృష్టించింది. ఆ స్థితితో పోలిస్తే ఇప్పుడు మార్కెట్ పూర్తిగా వినియోగదారుల పక్షాన మారింది. నాన్‌వెజ్ ప్రియులు ఈ తగ్గిన ధరలను ఉపయోగించుకుని కాస్త ఊరటగా భోజనం చేసుకునే అవకాశం వచ్చింది.

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి