
PM kisan : తెలంగాణ రైతులకు కాంగ్రెస్ సర్కార్ శుభవార్త... ఈసారి 13500 రైతుల ఖాతాల్లోకి ..!
pm kisan : ప్రధాని పీఎం కిసాన్ యోజన పథకాన్ని భారత ప్రభుత్వం 2019 లో ప్రారంభించడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా ఉన్న చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించడంతోపాటు వ్యవసాయ కార్యక్రమాలను కొనసాగించడం మరియు వారి జీవనోపాధిని మెరుగుపరచడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన 17వ విడత కోసం దేశవ్యాప్తంగా రైతులతోపాటు ఏపీ , తెలంగాణ రైతులకు కూడా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 16వ విడత డబ్బులు ఫిబ్రవరి 2024లో విడుదల కాగా ఈ పథకం ద్వారా రైతులు ప్రతి 4 నెలలకు ఒకసారి నిధులను పొందుతున్నారు. అలా ప్రతి విడతకు రూ.2000 చొప్పున ఏడాదికి 3 విడతలుగా రూ.6000 రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి.
ఇక పీఎం కిసాన్ డబ్బులు 17వ విడత మే 2024 చివరినాటికి లేదా జూన్ ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికార ప్రకటన విడుదల కాలేదు. కాని ఇప్పటివరకు పీఎం కిసాన్ 16 విడతలు విడుదలయ్యింది. ఇక 17వ విడత కోసం ఈ కేవైసీ పొందడం అవసరం అని తెలుస్తుంది.కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద రైతులకు సంవత్సరంలో 6000 జమ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి రూ.10,000 అందజేస్తుంది. అలాగే వానాకాలం సీజన్ లో రైతు భరోసా కింద కాంగ్రెస్ ప్రభుత్వం రూ.15000 అందించనుంది. అంటే సంవత్సరానికి రైతుల ఖాతాలో 21 వేలు జమ కానున్నాయన్నమాట.
PM kisan : తెలంగాణ రైతులకు కాంగ్రెస్ సర్కార్ శుభవార్త… ఈసారి 13500 రైతుల ఖాతాల్లోకి ..!
అయితే పీఎం కిసాన్ నిధులు జూన్ మొదటి వారంలో 2000 జమ అయిన తర్వాత వానాకాలం సీజన్ లో ఎకరానికి 7500 తెలంగాణ రైతుల ఖాతాలో జమ కానున్నాయి.అలా రైతు లకు ఒకేసారి 9500 పెట్టుబడి సాయం కింద , అందనున్నాయి.అయితే రాబోయే విడుదలకు సంబంధించిన సమాచారం కోసం రైతులు పీఎం కిసాన్ నిధి pmkisan.gov.in అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. ఇక వాటితో పాటుగా కేవైసీ ద్వారా డబ్బులు జమ కాని రైతులు ఈ విడతలో మొత్తం డబ్బులను పొందే అవకాశం ఉంది. కాబ్బటి ఈ కేవైసీని ఏ రైతులైతే పూర్తి చేశారో వారు మాత్రమే డబ్బును పొందుతారు. అంటే పీఎం కిసాన్ మొత్తం 6000 ఇక వాటితో పాటు రైతు భరోసా 7500 మొత్తాన్ని పొందవచ్చు.అంటే రూ.13,500 రైతుల అకౌంట్లో జమ కానున్నాయి.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.