Home » News » Good News For Ration Card Holders 3
News

Ration Card : రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ .. ప్రతి వ్యక్తికి 18 కిలోల సన్నబియ్యం .. ఎప్పటినుంచంటే ..!

Authored By
Suma
The Telugu News | Published on: March 5, 2026, 10:40 am
Advertisement

Ration Card : తెలంగాణ రాష్ట్రంలోని కోటి మందికి పైగా ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాబోయే వేసవి కాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది. పేద ప్రజలు ప్రతి నెలా రేషన్ దుకాణాల వద్ద క్యూలో నిలబడి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ముందస్తు చర్యగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి ఏప్రిల్ నెలలోనే పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర పౌర సరఫరాల శాఖ దేశంలోని అన్ని రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మార్చి మొదటి వారంలోనే ఎండలు తీవ్రంగా మొదలవడంతో ప్రజలు బయటకు రావడం కూడా కష్టమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేషన్ దుకాణాల వద్ద గుంపులు ఏర్పడి ప్రజలు ఎక్కువసేపు వేచి ఉండకూడదనే ఉద్దేశంతో ముందుగానే మూడు నెలల బియ్యాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం వల్ల తెలంగాణలో ఉన్న సుమారు ఒక కోటి మూడు లక్షల ఆహార భద్రత కార్డుదారులకు పెద్ద ఉపశమనం లభించనుంది.

Advertisement

Ration Card : రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ .. ప్రతి వ్యక్తికి 18 కిలోల సన్నబియ్యం .. ఎప్పటినుంచంటే ..!

Ration Card : ప్రతి వ్యక్తికి 18 కిలోల సన్నబియ్యం

తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న రేషన్ విధానం దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా నిలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రేషన్ పంపిణీ వ్యవస్థలో పలు మార్పులు చేపట్టింది. ముఖ్యంగా ప్రతి కార్డులో నమోదైన వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కేంద్రం సూచన మేరకు మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తే ఒక్కో వ్యక్తికి మొత్తం 18 కిలోల బియ్యం లభిస్తుంది. ఉదాహరణకు ఒక కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే వారికి సుమారు 72 కిలోల బియ్యం ఒకే సారి అందుతుంది. దీంతో వేసవి కాలంలో ఇతర ప్రాంతాలకు వెళ్లేవారికి లేదా తీవ్ర ఎండల వల్ల బయటకు రావడం కష్టమయ్యే వారికి పెద్ద ఊరట లభిస్తుంది. కుటుంబాలకు ముందుగానే ధాన్యం నిల్వ ఉండటంతో ఆహార భద్రతపై భరోసా పెరుగుతుంది.

Advertisement

Ration Card : నిల్వలు, రవాణాపై అధికారుల సమీక్ష

మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలంటే భారీ స్థాయిలో నిల్వలు మరియు రవాణా సదుపాయాలు అవసరం అవుతాయి. అందుకే తెలంగాణ పౌర సరఫరాల శాఖ ప్రస్తుతం పరిస్థితులను సమీక్షిస్తోంది. రాష్ట్రంలోని గోదాముల్లో సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయా, రేషన్ దుకాణాలకు ఎలా పంపిణీ చేయాలి, రవాణా ఖర్చులు ఎలా తగ్గించాలి వంటి అంశాలపై అధికారులు చర్చిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా అవసరమైన బియ్యం పరిమాణాన్ని అంచనా వేస్తూ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రవాణా వ్యవస్థను వేగవంతం చేసి, పంపిణీ ప్రక్రియలో ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రేషన్ డీలర్లకు కూడా ముందుగానే సమాచారం ఇచ్చి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచనలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Ration Card : గత అనుభవాల నుంచి పాఠాలు

గత ఏడాది వర్షాకాలంలో కూడా మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసిన అనుభవం ఉంది. అయితే ఆ సమయంలో కొన్ని సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా రేషన్ దుకాణాల్లో మూడు నెలల బియ్యాన్ని నిల్వ చేయడానికి సరిపడా స్థలం లేకపోవడం డీలర్లకు ఇబ్బందిగా మారింది. మరోవైపు బయోమెట్రిక్ విధానంలో మూడు నెలల కోటా పొందాలంటే లబ్ధిదారులు ఈ-పోస్ యంత్రంపై మూడు సార్లు వేలిముద్రలు ఇవ్వాల్సి రావడం వల్ల సమయం ఎక్కువ పట్టింది. సర్వర్ సమస్యలు తలెత్తినప్పుడు ఒక్కో కార్డు ప్రక్రియ పూర్తవ్వడానికి 15 నుంచి 20 నిమిషాలు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో రేషన్ దుకాణాల వద్ద రద్దీ ఏర్పడింది. ఈసారి అలాంటి సమస్యలు రాకుండా ముందుగానే సాంకేతిక మార్పులు చేయాలని అధికారులు భావిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, ప్రత్యామ్నాయ విధానాలు అమలు చేసే అవకాశాలు పరిశీలిస్తున్నారు.

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి