Hydra : హైదరాబాద్లో చెరువులు, బఫర్ జోన్లు, ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న స్థలాలలో అక్రమ నిర్మాణాలను ప్రభుత్వ భూములలో ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. అయితే హైడ్రా కూల్చివేతలపై మొదట్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరిలోనూ అనేక అనుమానాలు కలిగాయి ఏవో ఒకటి రెండు రోజులు కూల్చివేతలంటూ హడావిడి చేసి బడా బాబుల వద్ద డబ్బులు దండుకునే చర్యగా పలువురు ప్రత్యర్థి పార్టీల నాయకులు హైడ్రా ఏర్పాటును విమర్శించారు.. సినీహీరో నాగార్జున చెందిన ఎన్ కన్వెన్షన్‌తో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చెందిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. నేడు కూడా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.
సినిమా సెలబ్రిటీలనే కాదు సొంతవాళ్ళను కూడా లెక్కచేయకుండా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ సాగుతున్న హైడ్రా కూల్చివేతలపర్వం నిదానంగా సెలబ్రిటీలను కూడా సెట్ చేసేస్తోంది. అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా పై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సినీ నటుడు మురళీమోహన్ కు చెందిన జయభేరి సంస్థకు చెందిన అక్రమనిర్మాణాలు తొలగించాలని హైడ్రా నోటీసులు ఇచ్చింది. అయితే తాను ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని చెప్పిన మురళీమోహన్ బఫర్ జోన్ లో మూడు అడుగుల మేర రేకుల షెడ్డు ఉన్నట్టు గుర్తించామని అధికారులు చెబుతున్నారని, అయితే దానిని తొలగించేందుకు హైడ్రా అధికారులు రావలసిన అవసరం ఏమీ లేదని, ఆ షెడ్డు తామే కూలుస్తామని స్పష్టం చేశారు.
హైడ్రా అధికారులు కూల్చివేతలు జరిపితే అనవసరంగా పరువు పోతుందని భావించి ఇప్పుడు హైడ్రా ఇస్తున్న ఆదేశాలకు జీ హుజూర్ అనడం తప్ప మరేమీ ప్రత్యామ్నాయం లేదని అంటున్నారు.ఇక ఇదిలా ఉంటే హైడ్రా పై మధ్య తరగతి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందని తెలుస్తుంది. ప్రజా వ్యతిరేకతతో హైడ్రా కాస్త వెనక్కి తగ్గిందని, ఇప్పటికే నివాసం ఉంటున్న గృహాలను కూల్చము. కొత్త నిర్మాణాలు మాత్రమే కూలుస్తున్నాం. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలు స్థలాలు ఇకపై కొనవద్దని హైడ్రా సూచన చేసినట్టుగా అర్ధమవుతుంది. మొత్తం మీద ఇక హైడ్రామాకు హైడ్రా చెక్ పెట్టనుందా? అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.