
Hydra : ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లకి తేడా ఏంటి.. హైడ్రా వాటిని కూల్చడానికి కారణాలు ఏంటి ?
Hydra : రేవంత్ సర్కార్ తగ్గేదే లే అంటుంది. అక్రమాలు చేసిన వారిని వదిలేదేలే అంటుంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించమని తేల్చి చెబుతోంది. అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తామని ప్రకటించింది. ఆ మేరకు చర్యలు తీసుకుంటుంది. అక్రమ నిర్మాణాల లిస్ట్‌ను హైడ్రా అధికారులు సిద్ధం చేశారు. మాదాపూర్‌లో ఉన్న ఎన్ కన్వెన్షన్‌లో కొంతభాగం ఆక్రమించిందే. దాంతో ఆ నిర్మాణాలను అధికారులు కూల్చి వేస్తున్నారు.హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలను కాంగ్రెస్ ప్రభుత్వం తొలగిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా) ను ఏర్పాటు చేసింది.
రీసెంట్‌గా హైడ్రా అధికారులు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేశారు. చెరువును ఆక్రమించి కట్టారని, ఆమేరకు కట్టడాలను నేలమట్టం చేసింది. మొత్తం 10 ఎకరాల్లో 2015లో ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగింది. ఇందులో 1.12 ఎకరాలు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయి. 2 ఎకరాలు బఫర్ జోన్‌ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఇదే అంశంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. దాంతో హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే ఎఫ్‌టీఎల్ అంటే.. చెరువు లేదంటే జలాశయంలో పూర్తిస్థాయి నిల్వ సామర్థ్య పరిధిని ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) అంటారు. వర్షాకాలంలో నీటితో నిండితే లేదంటే వరద నీటితో నిండితే ఎఫ్‌టీఎల్ నిర్ధారిస్తారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో పట్టా భూములు ఉన్నా సరే.. నీళ్లు లేని సమయంలో వ్యవసాయం చేసుకోవచ్చు. నీరు ఉంటే ఆ భూములను వదిలేయాల్సి ఉంటుంది. ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టొద్దనే కఠిన నిబంధన ఉంది.
Hydra : ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లకి తేడా ఏంటి.. హైడ్రా వాటిని కూల్చడానికి కారణాలు ఏంటి ?
బఫర్ జోన్ అంటే.. నది పరీవాహక ప్రాంతంలోకి వరదనీరు సక్రమంగా వస్తూనే.. కలుషితం కాకుండా ఉండాలి. ప్రతి నీటి వనరును, విస్తీర్ణం ఆధారంగా బఫర్‌జోన్‌గా నిర్ధారిస్తారు. 25 హెక్టార్లు, అంతకుమించి విస్తీర్ణంలో ఉన్న చెరువు, జలాశయాలు బఫర్‌జోన్ నిర్ధారణకు 30 మీటర్లను ప్రామాణికంగా తీసుకుంటారు. జంట జలాశయాల పరిధి చుట్టూ ఎఫ్‌టీఎల్‌ను ఆనుకొని 30 మీటర్లు (వంద ఫీట్లు) బఫర్‌జోన్‌గా ఉంది. ఇక్కడ సాగు సంబంధిత కార్యకలాపాలు మాత్రమే చేపట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణాలు చేపట్టొద్దని నిబంధనల్లో స్పష్టంగా ఉంది. నాగార్జున ఎన్ కన్వెక్షన్‌లో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ రెండు ఉన్నాయి. ఆ క్రమంలోనే హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.