
KTR Kavitha : ఇది చాలు.. కవిత - కేటీఆర్ మధ్య ఎలాంటి వార్ జరుగుతుందో..!
KTR Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల తన తండ్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు రాసిన లేఖతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఆ లేఖలో ఆమె పార్టీ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేయడం, తన లేఖను కావాలని మీడియాకు లీక్ చేశారని ఆరోపించడంతో కలకలం రేగింది. అంతే కాదు “కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి” అనే వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్‌మీట్ నిర్వహించి ఈ అంశంపై పరోక్షంగా స్పందించారు.
KTR Kavitha : ఇది చాలు.. కవిత – కేటీఆర్ మధ్య ఎలాంటి వార్ జరుగుతుందో..!
కేటీఆర్ తన ప్రసంగంలో బీఆర్ఎస్ ఒక ప్రజాస్వామ్య పార్టీ అని, అందరికీ స్వేచ్ఛగా సూచనలు చేయగల అవకాశం ఉందని అన్నారు. కానీ కొన్ని అంశాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచి ఫలితాలు వస్తాయని స్పష్టం చేశారు. పార్టీ కార్యకలాపాల్లో పలు సందర్భాల్లో చర్చల ద్వారా నిర్ణయాలు తీసుకుంటామని, సలహాలు, సూచనలు స్వాగతిస్తామని చెప్పారు. కానీ పార్టీకి చెందిన కీలక అంశాలను బహిరంగంగా మాట్లాడకుండా, ఫోరమ్‌ల్లో లేదా నాయకత్వాన్ని కలసి చెప్పాలన్నదే తన అభిప్రాయమని తేల్చిచెప్పారు. ఈ వ్యాఖ్యల ద్వారా కవిత తీరుపై ఆయన అసంతృప్తిని పరోక్షంగా వ్యక్తపరిచినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటె.. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతల పేర్లు ఈడీ ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించబడటాన్ని కేటీఆర్ ప్రధానంగా హైలైట్ చేశారు. ముఖ్యంగా అప్పటి పీసీసీ, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పేరు ఈ కేసులో ఉన్నట్టు తెలిపారు. ఇది “సీటుకు రూటు కుంభకోణం” అని వ్యాఖ్యానిస్తూ, రేవంత్ పార్టీ అధ్యక్ష పదవి కోసం డబ్బులిచ్చారని అప్పటి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. అప్పట్లో ఆధారాల్లేవన్న మాటను ఇప్పుడు ఈడీ ఛార్జ్‌షీట్ ద్వారా నిజం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఈ పరిణామాలతో బీఆర్ఎస్ లోని అంతర్గత విభేదాలు, కాంగ్రెస్ పై విమర్శలు ఒకేసారి తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.