Home » News » Ktr Said Key Leaders Not To Respond On Kavitha Comments
News

Kavitha : క‌విత విష‌యంలో కేసీఆర్ సీరియ‌స్.. ఆమెని ఒంట‌రి చేయ‌బోతున్నారా ?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: May 26, 2025 12:00 pm
Advertisement

Kavitha : కేసీఆర్ KCR కూతురు కవిత లేఖ ఒక‌టి ఇటీవ‌ల బయటకు రావడంతో దీనిపై పెద్ద చ‌ర్చే న‌డిచింది. KCR కేసిఆర్ తో భేటీ అయిన తర్వాత పార్టీ శ్రేణులకు ముఖ్య నాయకులకు అంతర్గతంగా కవిత వ్యవహారం పైన ఎవరు స్పందించవద్దని కేటీఆర్ సమాచారం ఇచ్చారు. కేసీఆర్‌తో భేటీలో కవిత రాసిన లేఖ, అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత చేసిన వ్యాఖ్యలు తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.

Advertisement

Kavitha : క‌విత విష‌యంలో కేసీఆర్ సీరియ‌స్.. ఆమెని ఒంట‌రి చేయ‌బోతున్నారా ?

Kavitha : క‌విత ఇలా బుక్ అయింది..

పార్టీలో అంతర్గతంగా చర్చించవలసిన అంశాలు ఇప్పటికే బహిర్గతం అయ్యాయని, జరిగిన పరిణామాలపై ఎవరు బహిరంగంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని, టీవీ చర్చలలో మాట్లాడకూడదని ఆయన కీలక ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక కెసిఆర్ తో సమావేశమైన తర్వాత కేటీఆర్ ఇదే విషయాన్ని పార్టీ ముఖ్య నాయకులకు అంతర్గతంగా సమాచారం అందించి కవిత వ్యాఖ్యల పైన స్పందించవ‌ద్ద‌ని అన్న‌ట్టు తెలుస్తుంది.

Advertisement

ఇక ఈ తాజా నిర్ణయంతో కవితను కెసిఆర్ మాట్లాడడానికి పిలిచే అవకాశం లేదని, ఆమె వేదన వ‌ర్ణ‌నాతీతం అంటున్నారు. ఆమె ఒంట‌రి కానుంద‌నే టాక్ కూడా వినిపిస్తుంది. ఇక కవిత ఒంటరి పోరాటం చేయాల్సిందే నిన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో క‌విత త్వ‌ర‌లో వేరే పార్టీ పెట్ట‌నుంద‌నే చ‌ర్చ కూడా న‌డుస్తుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి