Hyderabad : పాతబస్తీలో టెన్షన్ వాతావరణం.. హైదరాబాద్ లో 200 కు పైగా పాకిస్తానీయులు ఉన్నారట.. వామ్మో !
Hyderabad : జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా భద్రతా చర్యలు కఠినతరం అయ్యాయి. 26 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోయిన ఈ దారుణ ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ పౌరులకు సార్క్ వీసాలను రద్దు చేసినట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. అంతేకాకుండా, తాత్కాలిక వీసాలపై భారత్‌లో ఉన్న పాక్ పౌరులు 48 గంటల్లోగా దేశాన్ని విడిచి వెళ్లాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు.
Hyderabad : పాతబస్తీలో టెన్షన్ వాతావరణం.. హైదరాబాద్ లో 200 కు పైగా పాకిస్తానీయులు ఉన్నారట.. వామ్మో !
రాష్ట్రాలకు పంపిన పత్రికా ప్రకటనలో పాక్ పౌరుల వివరాలను పంపించామని, వీరిని వెంటనే గుర్తించి వెనక్కి పంపించాల్సిందిగా సూచించారు. కేంద్రం ఆదేశాల నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి వచ్చిన 208 మంది పాక్ పౌరుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. వీరంతా తాత్కాలిక వీసాలతో భారత్‌లోకి ప్రవేశించగా, ప్రస్తుతం స్పెషల్ బ్రాంచ్ అధికారులు వారి పాస్పోర్టు, బస వివరాలను పరిశీలిస్తున్నారు.
వీలైనంత త్వరగా వారిని గుర్తించి, పాక్‌కు తిరిగి పంపేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు దేశంలోని పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. జవాన్లు తక్షణమే తమ విభాగాలకు హాజరుకావాలని ఆదేశించారు. జమ్ముకాశ్మీర్ పరిస్థితులపై అన్ని భద్రతా విభాగాలు అత్యవసర సమావేశాలు నిర్వహించాయి.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.