Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల రసవత్తరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాలను సైతం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీఆర్ఎస్ పార్టీ నాయకుల పై రేవంత్ రెడ్డి పలు రకాల ఆరోపణ చేస్తూ కనిపిస్తున్నారు. అయితే ఇప్పటికే పలుచోట్ల ఎన్నికల ప్రచారాలను చేసిన రేవంత్ రెడ్డి తాజాగా మరో కార్యక్రమంలో మాట్లాడుతూ కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కేటీఆర్ పలు సందర్భాల్లో కారు రిపేర్ కి వచ్చిందని చెబుతున్నాడు. పిలగా కార్ రిపేరుకు రాలేదు , ఇంజన్ చెడింది ఇక తూకానికి వేయడమే తిరిగి వచ్చేది లేదంటూ రేవంత్ రెడ్డి ఏద్దెవా చేశారు. తూకానికి అమ్మటం తప్ప చేసేదేం లేదంటూ చెప్పుకొచ్చారు. నీ కారు మాత్రమే కాదు నీ అయ్య ఆరోగ్యం కూడా అణువు చెడింది. ఏడో తారీఖు నాడు ప్రమాణస్వీకారం ఉంటే దానికంటే ముందే నీ అయ్య కేసీఆర్ బోర్లా పడ్డాడు. ఇప్పటికి నడవలేక పోతుండు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలందరూ కారుని బండకేసి కొట్టి 100 మీటర్ల గొయ్యి తీసి పాతిపెట్టిండ్రు అంటూ రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. అయినా కూడా పంకణాలు కొడుతూ పిట్టలదొర కేసీఆర్ నా కింద 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు చిటిక కొడితే వస్తారని మాట్లాడుతుండు.
చిటికె కాదు కొండపైకెక్కి డప్పు కొట్టు నీ దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఉండరంటూ తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్లమందలు ,తోడేళ్ల లాగా వచ్చి పట్టుకెళ్దాం అనుకుంటే , ఇక్కడ కాపల ఉంది రేవంత్ రెడ్డి అంటూ నన్ను దాటిపోవడం నీ తరం కాదంటూ చెప్పుకోచ్చారు. రేవంత్ రెడ్డికి తన వాళ్లని కంచె వేసి ఎలా కాపాడుకోవాలో బాగా తెలుసు అంటూ ఈ సందర్భంగా తెలియజేశారు. దీంతో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపం లో తెలియజేయండి.
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
This website uses cookies.