Home » News » Revanth Reddy Sarkar Spent Rs 7700 Crores For Farmers In A Week
News

Farmer : రైతులకు గుడ్‌న్యూస్‌.. అకౌంట్‌లో 90,000..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: June 24, 2025, 4:00 pm
Advertisement

Farmer : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అనేక రకాలుగా అండగా నిలుస్తోంది. ముఖ్యంగా వానాకాలం సాగు ప్రారంభమైన ఈ సమయంలో “రైతు భరోసా” పథకం కింద నిధులను శరవేగంగా జమ చేస్తోంది. జూన్ 16న సీఎం రేవంత్ రెడ్డి రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొని రైతు భరోసా నిధుల విడుదలకు బటన్ నొక్కారు. కేవలం ఆరు రోజుల్లోనే రూ.7,700 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement

Farmer : రైతులకు గుడ్‌న్యూస్‌.. అకౌంట్‌లో 90,000..!

Farmer : వామ్మో వారం రోజుల్లో “రైతు భరోసా” కింద రూ.7 ,700 కోట్లు జమ చేసిన తెలంగాణ సర్కార్

ఈ పథకం కింద ప్రతి ఎకరాకు రూ.6,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది ప్రభుత్వం. ముఖ్యంగా జూన్ 23న 15 ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లో రూ.90,000 వరకు జమ చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ తాజాగా రూ.513 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇప్పటి వరకు మొత్తం రూ.8,284 కోట్లను రాష్ట్రవ్యాప్తంగా 67.01 లక్షల మంది రైతులకు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.

Advertisement

జూన్ 24తో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధుల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయనుంది. ఈ సందర్భంగా రైతుల్లో ఉత్సాహం నింపేందుకు అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ప్రత్యేకంగా “రైతు భరోసా సంబరాలు” నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు కోటి 39 లక్షల ఎకరాలకు పైగా భూములకు రైతు భరోసా సాయం అందిందని, ఇది దేశంలోనే అరుదైన ఘనత అని ఆయన అన్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి