MLA Rajaiah : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే టాపిక్. జానకీపురం సర్పంచ్ నవ్య వర్సెస్ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఈ ఎపిసోడ్ ఇప్పుడు ప్రారంభం అయింది కాదు.. చాలా రోజుల నుంచి సాగుతోంది. ఆ మధ్య నవ్య ప్రెస్ మీట్ పెట్టి మరీ రాజయ్య గురించి మొత్తం చెప్పుకొచ్చింది. దీంతో రాజయ్య నేరుగా తన వద్దకు వెళ్లి తప్పు అయింది.. ఇంకోసారి అలా జరగదు అని మీడియా ముందు వాపోయారు. అక్కడితో నవ్య ఎపిసోడ్ సుఖాంతం అయిందని అంతా అనుకున్నారు కానీ.. మళ్లీ ఆ వ్యవహారం మొదటికొచ్చింది.
సర్పంచ్ నవ్యకు డబ్బులు ఇవ్వాలని చూశారని, తనను చంపాలని కూడా చూశారని తాజాగా ఆమె ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తోంది. చివరకు తన భర్త కూడా ఎమ్మెల్యే వర్గంలో చేరిపోయారు. దీంతో తను ఒంటరి అయింది. తన భర్తకు డబ్బుల ఆశ చూపి తమవైపునకు తిప్పుకున్నారని.. తన భర్తకు విడాకులు ఇచ్చి అయినా సరే.. ఎమ్మెల్యేను అస్సలు వదలను అని మీడియా సాక్షిగా నవ్య పలుమార్లు సవాల్ విసిరింది. ఒంటరిగానే పోరాటం చేస్తున్న ఆమెకు మద్దతుగా తన అత్త, ఆడపడుచు నిలుచున్నారు.నన్ను టార్గెట్ చేసి ఊరికి ఎలాంటి నిధులు ఇవ్వడం లేదు. ఇప్పటికే చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఇవ్వలేదు. బకాయిలు చెల్లిస్తామని అప్పుడు మాటిచ్చారు. ఇప్పుడు నేను వాటి గురించి ప్రస్తావిస్తే బాండ్ పేపర్ మీద సంతకం పెట్టాలంటున్నారు.
అసలు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టడం ఏంటి. నా భర్త కూడా వాళ్ల వైపే ఉన్నారు. నేను ఒంటరిదాన్ని అయ్యాను. నా భర్తకు విడాకులు ఇవ్వడానికి కూడా నేను సిద్ధం.. అంటూ నవ్య ఆరోపణలు చేసింది. తాజాగా ఆమెకు తన అత్త మద్దతు ఇవ్వడంతో ఆమె కొండంత అండ వచ్చినట్టు అయింది. నా కోడలు ఎటువంటి తప్పు చేయలేదని, ఎమ్మెల్యే రాజయ్య, అనుచరులు వేధిస్తున్నారని ఆమె తెలిపారు. గ్రామం కోసం, గ్రామ అభివృద్ధి పనుల కోసం నా కోడలు తన ఒంటి మీద ఉన్న బంగారం కూడా అమ్ముకుందని ఆమె అత్త వాపోయారు. మరి చూద్దాం.. ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.