Surveyor Tejeshwar : ఐదు సార్లు ప్లాన్ చేసిన భార్య.. తేజేశ్వర్ కేసులో బయటకువస్తున్న సంచలన విషయాలు..!
Surveyor Tejeshwar : తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో భర్తను సుపారీ గ్యాంగుతో హత్య చేయించేందుకు భార్య ఐశ్వర్య చేసిన కుతంత్రాలు ఒక్కొటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఐదుసార్లు హత్యాయత్నం నుంచి తప్పించుకున్న తేజేశ్వర్ చివరకు ఆరోసారి హంతకుల పాలయ్యాడు. ప్రైవేట్ సర్వేయర్‌గా పనిచేస్తున్న తేజేశ్వర్‌ను సర్వే పని ఉందంటూ కారులో ఎక్కించుకుని ముందే ప్రణాళిక వేసిన దుండగులు కత్తితో గొంతుకోసి హత్య చేసి, మృతదేహాన్ని తాళ్లతో కట్టి కాల్వలో పడేశారు…
Surveyor Tejeshwar : ఐదు సార్లు ప్లాన్ చేసిన భార్య.. తేజేశ్వర్ కేసులో బయటకువస్తున్న సంచలన విషయాలు..!
తేజేశ్వర్‌తో వివాహం అయినప్పటికీ, అతని భార్య బ్యాంకు మేనేజర్ తిరుమలరావుతో సంబంధం కొనసాగిస్తుండగా, భర్త అడ్డు అవుతాడని భావించిన ఆమె ఆయనను హతమార్చేందుకు కుట్ర పన్నింది. తేజేశ్వర్ బండిపై గోప్యంగా జీపీఎస్ ట్రాకర్ అమర్చి అతని లొకేషన్‌ను హంతకులకు అందించింది. తిరుమలరావు, ఐశ్వర్యతో కలిసి రూ.75 వేలు సుపారీ గ్యాంగుకు ఇచ్చి హత్యను నిర్వాహించారు. ఐశ్వర్య తండ్రి అంగీకరించకపోయిన తర్వాత మేనేజర్ తన భార్యకు “పిల్లలు లేరు కదా, ఆమెను పెళ్లి చేసుకుంటా” అని చెప్పినప్పటికీ ఆమె నిరాకరించింది. అయినప్పటికీ ఐశ్వర్యతో సంబంధాన్ని కొనసాగించాడు.
పోలీసులు ఇప్పటివరకు ఈ హత్యకేసులో ప్రధాన నిందితులైన బ్యాంకు మేనేజర్ తిరుమలరావుతో పాటు ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, హత్యకు పాల్పడిన మనోజ్, సహకరించిన ఇద్దరు, క్యాబ్ డ్రైవర్, మధ్యవర్తి వ్యక్తిని కలుపుకొని మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. తేజేశ్వర్ నిశ్చితార్థం రద్దైన తర్వాత కూడా ఐశ్వర్య మాటలు నమ్మి కుటుంబం వద్దన్నా కానీ వెళ్లి ఆమెను పెళ్లిచేసుకున్నాడు. కానీ ఆ విశ్వాసమే చివరికి ప్రాణాలమీదకి వచ్చింది.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.