Telangana Cabinet : తెలంగాణ లో కొత్త ప్రభుత్వం కొలువు దీరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే రేవంత్ టీం పరిపాలనపై కొంత విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 12న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు నిర్ణయించినట్లు సమాచారం. మంత్రివర్గంలో ఖాళీల భర్తీ తో పాటుగా శాఖల మార్పు పైన రేవంత్ కసరత్తు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో అధినాయకత్వంతో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది.రాష్ట్రంలో హైడ్రా వివాదం తో పాటుగా ప్రస్తుత పరిణామాల పైన ఆయన చర్చించినట్టు తెలుస్తుంది.
అలానే మంత్రివర్గ విస్తరణ…నామినేటెడ్ పెండింగ్ పదవుల భర్తీ పైన చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో తీసుకొనే వారి పేర్లు దాదాపు ఖరారయ్యాయి. ప్రస్తుతం మంత్రివర్గంలో ఆరుగురికి అవకాశం ఉంది. కొత్త వారికి అవకాశం ఇవ్వటంతో పాటుగా ప్రస్తుతం ఉన్న వారి శాఖల మార్పు ఖాయంగా కనిపిస్తోంది. మహిళకు హోం మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ప్రస్తుతం సీఎం రేవంత్ వద్ద ఉన్న హోం శాఖ సీతక్కకు కేటాయించటం దాదాపు ఖాయం..ఇక నిజామాబాద్ జిల్లా నుంచి ఒకరికి కేబినెట్‌లో స్థానం దక్కుతుందని తెలుస్తుండగా, సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
రంగారెడ్డి నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి పేరు ప్రచారంలో ఉంది. ఇక వాకాటి శ్రీహరికి మంత్రివర్గంలో స్థానం ఖాయమైందని తెలుస్తోంది. అదిలాబాద్ నుంచి వివేక్, ప్రేమ్ సాగర్ రావులో ఒకరికి మంత్రి పదవి దక్కనుందని అంటున్నారు. ఆరు స్థానాలు ఖాళీ ఉండగా..నాలుగు భర్తీ చేసి రెండు స్థానాలు ఖాళీగా ఉంచుతారని తెలుస్తోంది. మైనార్టీ, ఎస్టీల కోసం మరో బెర్తు ఖాళీగా ఉంచనున్నట్లు సమాచారం. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ కు పట్టు చిక్కలేదు. దీంతో, గ్రేటర్ ఎన్నికల్లోగా హైదరాబాద్ లో బలం పెంచుకునేలా కొత్త వ్యూహాల తో ముందుకు వెళ్లాలని రేవంత్ భావిస్తున్నారు. అందులో భాగంగా గ్రేటర్ నుంచి ఎవరికి మంత్రి పదవి ఇస్తారనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.