Home » News » This Is The Reason Behind Tejeshwar Mrde
News

Surveyor Tejeshwar : వీడి మోజులో పడే కట్టుకున్న బంగారం లాంటి భర్తను చంపిన ఐశ్వర్య..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: June 24, 2025 7:21 pm
Advertisement

Surveyor Tejeshwar : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న గంటా తేజేశ్వర్ హత్య కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఫిబ్రవరిలో ఐశ్వర్యతో ఎగజ్మెంట్ కాగా, మే 18న వీరిద్దరి వివాహం జరిగింది. అయితే అప్పటికే ఐశ్వర్యకు బ్యాంకు ఉద్యోగి తిరుమలరావుతో వివాహేతర సంబంధం కొనసాగుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. తేజేశ్వర్‌ తల్లిదండ్రులు ఈ సంబంధంపై అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ, అతను ప్రేమలో నమ్మకంతో ఐశ్వర్యను పెళ్లాడాడు. పెళ్లైన 29 రోజుల్లో 15 రోజులు ఐశ్వర్య కర్నూలులో గడిపినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

Advertisement

Surveyor Tejeshwar : వీడి మోజులో పడే కట్టుకున్న బంగారం లాంటి భర్తను చంపిన ఐశ్వర్య..!

Surveyor Tejeshwar : వీడి మోజులో పడే బంగారం లాంటి భర్త ను చంపుకున్న నీచురాలు

తేజేశ్వర్‌ను హత్య చేయాలన్న కుతంత్రంతో ఐశ్వర్య తిరుమలరావుతో కలిసి ప్లాన్ వేసింది. భూమి సర్వే పేరుతో అతనిని కారులో తీసుకెళ్లి, మారణాయుధాలతో హత్య చేశారు. అనంతరం ఆయుధాలు, ఫోన్, ల్యాప్‌టాప్‌ను నదిలో పడేసి, మృతదేహాన్ని అడవిలో పడేశారు. నిందితులు అతని బైక్‌కు జీపీఎస్ ట్రాకర్ అమర్చి లొకేషన్‌ను సుపారీ గ్యాంగ్‌కు అందించారని సమాచారం. నాలుగు నెలల్లో ఐశ్వర్య, తిరుమలరావు మధ్య 2,000కు పైగా ఫోన్ కాల్స్, వందలాది మెసేజులు జరిపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

Advertisement

తేజేశ్వర్ హత్య కేసులో ప్రధాన నిందితులైన ఐశ్వర్య, తిరుమలరావుతో పాటు ఆమె తల్లి సుజాత, హంతకులుగా వ్యవహరించిన సుపారీ గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మరో సంచలన విషయం వెల్లడైంది. ఐశ్వర్య తల్లి సుజాతతో కూడా తిరుమలరావుకు సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఈ కేసులో ఇంకా అనేక మలుపులు వెలుగులోకి వచ్చే అవకాశముంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి