Home » News » Vijayashanti Vs Kcr In Kamareddy
News

KCR : అక్కడ కేసీఆర్ కి పోటీగా రాములమ్మని దింపుతున్న బీజేపీ..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: August 23, 2023 9:29 am
Advertisement

KCR  : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వాడివేడిగా ఉన్నాయి. వచ్చే ఎన్నికలకు కొద్ది టైమే ఉండటంతో ప్రధాన పార్టీలు అభ్యర్థుల విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆల్రెడీ బీఆర్ఎస్.. అధినేత కేసీఆర్.. తెలంగాణ భవన్ లో నిన్న వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల మొదటి లిస్టు విడుదల చేయడం జరిగింది. అయితే ఈ లిస్టులో కేసీఆర్.. గజ్వాల్ తో పాటు కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేయడానికి రెడీ కావడం జరిగింది.

Advertisement

కేసీఆర్ రెండుచోట్ల పోటీకి సిద్ధమవటం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే కేసీఆర్ కి పోటీగా బీజేపీ పార్టీ విజయశాంతినీ బరిలోకి దింపడానికి రెడీ అయినట్లు సమాచారం. విషయంలోకి వెళ్తే కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తూ ఉండటంతో అక్కడ బీజేపీ అభ్యర్థిగా రాములమ్మని పోటీ చేయించే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో మరికొద్ది నెలలో జరగబోయే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు సిద్దం చేస్తూ ఉన్నారు.

Vijayashanti Vs Kcr in Kamareddy

Advertisement

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటికే రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పార్టీ మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని ఉంది. ఈ క్రమంలో అభ్యర్థుల విషయంలో చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకుని ఆగస్టు 21 సోమవారం మొదటి లిస్టు ప్రకటించారు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి