
Roja : రోజాతో అటాడేందుకు కూటమి సర్కార్ సిద్ధం..?
Roja : వైసీపీ నేతల అరెస్టుల పరంపరలో మరో మాజీ మంత్రి వంతు వచ్చిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ఫైర్‌బ్రాండ్, అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టుకు రంగం సిద్ధమవుతోందని ప్రభుత్వ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. ‘ఆడుదాం-ఆంధ్ర’ స్కాంలో రోజాను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ స్కాంపై ఫిర్యాదు అందుకున్న ప్రభుత్వం, విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ అధికారులు నిధుల దుర్వినియోగాన్ని నిర్ధారించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారని చెబుతున్నారు. దీంతో రోజాపై కేసు నమోదుకు ప్రభుత్వం ఆదేశించే అవకాశం ఉందని సమాచారం.
Roja : రోజాతో అటాడేందుకు కూటమి సర్కార్ సిద్ధం..?
గత ప్రభుత్వం ‘ఆడుదాం-ఆంధ్ర’ కార్యక్రమం కింద దాదాపు రూ. 119 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో దాదాపు రూ. 100 కోట్ల మేర అవినీతి జరిగిందని ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఆరోపణలపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. విజిలెన్స్ అధికారులు దీనిపై సుదీర్ఘ విచారణ జరిపి, అవకతవకలు నిజమేనని నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. క్రీడా పోటీలకు సంబంధించి పరికరాల కొనుగోలు, ముగింపు ఉత్సవాల పేరిట భారీగా అవినీతి జరిగిందని విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. 45 రోజుల్లోనే రూ. 119 కోట్లు ఖర్చు చేయడంపై కూటమి ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
ఈ నేపథ్యంలో నాటి క్రీడా మంత్రిగా ఉన్న రోజాపై అభియోగాలు మోపే అవకాశం ఉందని అంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజా అరెస్టుపై పలు రకాల ప్రచారాలు జరిగాయి. అనుచిత వ్యాఖ్యల కేసులు, టీటీడీ దర్శనాల విషయంలో విమర్శలు వంటి కారణాలతో ఆమెను అరెస్టు చేయవచ్చని ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఇప్పుడు ‘ఆడుదాం-ఆంధ్ర’ స్కాం విషయంలోనే ఆమెపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఎక్కువగా నమ్ముతున్నారు. ఈ స్కాంలో విజిలెన్స్ నివేదికలో ఎంత అవినీతిని గుర్తించారనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది.
OnePlus 11 5G : ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్న వారికి ఇది నిజంగా శుభవార్తే. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో మార్కెట్లో…
Ration Card : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకుంటున్న వేళ, రేషన్…
Peddi Box Office Collection Day 3 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం…
Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఈరోజు మంచి వార్త వచ్చింది. గత కొన్ని…
Eat Eggs in Summer : వేసవి కాలం మొదలవగానే మన ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా…
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు వేడి వేడి…
Today Horoscope 7th June 2026 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రోజు గ్రహాల సంచారం మన జీవితంపై…
Yamadonga : తెలుగు సినీ పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ‘యమదొంగ’ ఒకటి. యంగ్…
Police Jobs : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త…
Anasuya Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్‌గా, వెండితెరపై ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్…
Team India or Gujarat Titans : భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన…
School Holidays : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సంతోషకరమైన వార్త అందింది. ఇప్పటికే వేసవి సెలవులను ఆస్వాదిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం…
This website uses cookies.