Home » Entertainment » Anchor Suma Has Been Suffering From A Disease
Entertainment

Suma Kanakala : యాంకర్ సుమకు ఆ డిసీజ్.. ఏళ్లుగా దానిని భరించి ఆమె ఏం కోల్పోయిందో తెలుసా?

Authored By
mallesh
The Telugu News | Published on: October 11, 2021, 5:20 pm
Advertisement

Suma Kanakala : మలయాళి అమ్మాయి అయినప్పటికీ తెలుగు భాషను స్పష్టంగా పలకడంలో యాంకర్ సుమ దిట్ట అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బుల్లితెరపైన బోలెడన్ని ప్రోగ్రామ్స్‌కు యాంకరింగ్ చేస్తూనే సినిమా ఫంక్షన్స్‌కు యాంకరింగ్ చేస్తుంది సుమ. తనదైన శైలి వాగ్దాటితో సెలబ్రిటీలను మెప్పిస్తూ పంచ్‌లు కూడా వేస్తుంటుంది. యాంకర్ సుమ తెలుగు స్పష్టంగా పలికే తీరును అప్పట్లో భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు మెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

Advertisement

Anchor Suma Has Been Suffering From A Disease

Suma Kanakala : జబ్బును అంగీకరించి లైఫ్ లీడ్ చేస్తున్నానంటున్న సుమ..

టాలీవుడ్ లో నెంబర్ వన్ యాంకర్‌గా దూసుకుపోతున్న సుమ నటుడు రాజీవ్ కనకాలను మ్యారేజ్ చేసుకుంది. సుమ వెండితెరపై ఒక చిత్రంలో కనిపించినప్పటికీ బుల్లితెరకే పరిమితమయింది. యాంకర్‌గానే సుమ రాణిస్తోంది. ఎందరినో నవ్విస్తూ ఎప్పటికప్పుడు టైమింగ్ పట్టుకుని భాషపై పట్టు సాధించి సరదాగా ఆట పట్టించే గత కొంత కాలం నుంచి అనగా ఏళ్లుగా ఓ డిసీజ్‌తో బాధపడుతోంది. ఆ వ్యాధి గురించి సుమ ఇటీవల బయటపెట్టింది. తన యూట్యూబ్ చానల్‌లో ఆ వ్యాధి విషయం షేర్ చేసింది సుమ. గత కొద్ది కాలం అనగా ఏళ్లు అవుతుందట. అప్పటి నుంచి తాను ఒక రకమైన స్కిన్ డిసీజ్‌తో బాధపడుతున్నానని సుమ తెలిపింది.

Advertisement

Anchor Suma Has Been Suffering From A Disease

కీలాయిడ్ టెండెన్సీ అనే రేర్ స్కిన్ డిసీజ్ ఇష్యూస్‌తో తాను సతమతమవుతున్నట్లు సుమ పేర్కొంది. కీలాయిండ్ టెండెన్సీ అనగా స్కిన్‌పై ఒక చోట గాయం అయితే ఆ గాయం మరింత పెద్దదిగా మారి చుట్టుపక్కల అంతటా వ్యాపిస్తుంది. అలా వౌండ్ బాగా పెద్దదిగా అయ్యే చాన్సెస్ కూడా ఉంటాయి. ఈ గాయాన్ని తగ్గించుకునేందుకు తాను ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ నయం కాలేదని చెప్పింది. ఈ క్రమంలోనే తాను తగ్గని జబ్బును గురించి ఆలోచించకుండా తనతోనే అంటిపెట్టుకుని ఉండటం అలవాటు చేసుకున్నానని, అలా స్కీన్ డిసీజ్‌ను అంగీకరించానని, అందుకే తాను ఎంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నానని చెప్పింది యాంకర్ సుమ. స్కిన్ పైన ఆ డిసీజ్ వల్ల గాయాలు అయినట్లు వివరించింది సుమ.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి