Home » Entertainment » If Bamma Dances The Heroines Also Have To Rot
Entertainment

Viral Video: బామ్మా డ్యాన్స్ చేస్తే హీరోయిన్స్ కూడా కుళ్లుకోవాల్సిందే..

Authored By
mallesh
The Telugu News | Published on: April 30, 2022, 2:00 pm
Advertisement

Viral Video: డ్యాన్స్ చేయ‌డానికి వ‌య‌సుతో సంబంధం లేదు. బుడిబుడి అడుగులేసే చిన్నోడు కూడా డ్యాన్స్ చేస్తున్నాడు. అర‌వై ఏళ్ల పైడిన వారు కూడా త‌మ స్టెప్పుల‌తో అద‌ర‌గొడుతున్నారు. సాధారణంగా ఏ చిన్న ఫంక్ష‌న్ అయినా, మ్యారేజ్ అయినా డ్యాన్స్ చేయ‌కుండా వ‌ద‌ల‌రు. అమ్మాయిలైతే డ్యాన్స్ చేయ‌డానికే అందంగా ముస్తాబై వ‌స్తుంటారు. త‌మ అందం అభినయంతో డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటారు. ఎప్పుడూ డ్యాన్స్ చేయ‌ని వాళ్లు కూడా సోష‌ల్ మీడియా వ‌చ్చిన త‌ర్వాత రెచ్చిపోతున్నారు. కొంచెం కొత్త‌గా ట్రై చేసి ట్రెండింగ్ లో ఉంటున్నారు. క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నారు.

Advertisement

if-bamma-dances-the-heroines-also-have-to-rot

ఈ బామ్మ డ్యాన్స్ చేస్తే ఎవ‌రైనా ఫిదా అవ్వాల్సిందే.. ఆమె ఎనర్జీ లెవెల్స్ యంగ్ హీరోయిన్స్ కి తీసిపోకుండా ఉంటాయి. క‌ర్ర ప‌ట్టుకుని న‌డిచే వ‌య‌సులో ఏకండా ఎంతో ఆక్టీవ్ గా డ్యాన్స్ చేస్తోంది. డ్యాన్స్ అంటే ఏదో చేశామా అంటే చేశాం అన్న‌ట్లు కాదు. ప్రొఫెష‌నల్ డ్యాన్సర్స్ చేసిన‌ట్లు చేస్తోంది. ఆమే ఎన‌ర్జీకి తోటి మ‌హిళ‌లు కుళ్లు కోవాల్సిందే.. కేంలం డ్యాన్స్ ఏ కాదు.. చ‌క్క‌టి హావ‌భావాలు ప‌లికిస్తూ పాట‌కు త‌గ్గ‌ట్లుగా కాలు క‌దుపుతూ ర‌ఫ్పాడిస్తోంది.

Advertisement

ఆమె వ‌య‌సులో ఉన్నవారు చాలా మంది న‌డ‌వ‌డానికి ఇబ్బంది ప‌డుతుంటారు. కానీ బామ్మ అవ‌న్నీ లెక్క‌చేయ‌కుండా ఒక‌టి రెండు కాదు… ఏకంగా వంద‌ల సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ వంద‌ల వీడియోలు త‌న ఇన్ స్టా లో పోస్ట్ చేస్తోంది. ఈ వీడియోలు క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతుంటాయి. కామెంట్స్ , లైకులు వేల‌ల్లో వ‌చ్చిప‌డుతుంటాయి. బామ్మ ఎనర్జీని ప్ర‌శంసించ‌ని వారు ఉండారు. అంతలా ఉంటుంది మ‌రి ఈ బామ్మా డ్యాన్స్. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. మీరు కూడా చూసి ఆనందించండి…
https://www.instagram.com/reel/CcLLK0pu3Rz/?igshid=YmMyMTA2M2Y=

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి