
surekha does not like this in chiranjeevi
Chiranjeevi: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కష్టపడి స్వయంకృషితో ఎదిగిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్ సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతలా ఎదిగారంటే కేవలం ఆయన పట్టుదల, కృషి మెగాస్టార్ ను చేశాయి. తన డ్యాన్స్, నటన డైలాగులు చెప్పే విధానం అన్నింటికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. తెలుగులో తిరుగులేని మాస్ హీరోగా ఎదిగారు. చిరంజీవితో సినిమా చేయడానికి డైరెక్టర్లు కథతో రెడీగా ఉండేవారు. టీలీవుడ్లో ఎన్నో రికార్డులు, ఎన్నో అవార్డులు అందుకున్నారు.
if surekha wants she has to go even if she gets married chiranjeevi
సినిమాల్లోనే హీరో అని కాకుండే నిజజీవితంలో కూడా చిరంజీవి ఎంతో మందిని ఆదుకునేవారు. కొత్తవాళ్లను ఎంకరేజ్ చేసేవారు. హాస్యబ్రహ్మ బ్రహ్మానందంలోని టాలెంట్ గుర్తించి ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఎంతో మంది ఆర్టిస్టులకు ఆర్థిక సాయం చేశాడు. రక్తదానం, నేత్రదాన సంస్థలను ఏర్పాటు చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడారు.
యండమూరి వీరేంద్రనాథ్ రాసిన అనేక నవలలకు చిరంజీవి హీరో అయ్యాడు. నవలల ఆధారంగా ఛాలెంజ్, మరణ మృదంగం, అభిలాష, రాక్షసుడు, స్టూవస్టుపురం పోలీస్ స్టేషన్ వంటి చిత్రాలు వచ్చాయి. అలాగే చిరంజీవి దాదాపు అప్పటి హీరోయిన్స్ అందరితో నటించారు. కాగా చిరంజీవి విజయ శాంతి హిట్ పెయిర్ గా నిలిచారు. వీరిద్దరూ కలిసినటించిన 18 చిత్రాల్లో మెకానిక్ అల్లుడు తప్ప అన్నీ విజయాన్ని సాధించాయి.
ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య చిత్రంలో నటించారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండగా ఈ నెల 29న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. చిత్ర యూనిట్ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. స్వయంగా చిరంజీవి ఆచార్య ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. మెగా అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం. ఆచార్య చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి. అయితే ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లినాటి విశేషాలను గుర్తుచేసుకున్నారు.
అయితే చిరంజీవి హీరోగా ఎదుగుతున్న టైంలో అల్లు రామలింగయ్య ఓ సినిమా షూటింగ్ లో చూసి తన కూతురికి ఇస్తే బాగుంటుందిని అలోచించి ఫిక్స్ అయ్యాడు. తన భార్యతో చర్చించి చిరంజీవికి చెప్పి మెగస్టార్ ఫ్యామిలీని కూడా ఒప్పించి పెళ్లి చేశారు. సురేఖ కూడా చిరంజీవిని ఇష్టపడటంతోనే ఈ పెళ్లి జరిగినట్లు చెప్పారు. అయితే అప్పుడు తనకి పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని.. వారి ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత చిరంజీవి సుప్రిమ్ హీరో నుంచి మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగారు. సురేఖ బలంగా అనుకుంటే అది జరిగి తీరుతుందని మెగాస్టార్ చెప్పుకొచ్చాడు. అందుకేనేమో సురేఖ ఇష్టపడ్డ చిరంజీవిని పెళ్లి చేసుకోగలిగారు. అలాగే చరణ్ చిరంజీవి కలిసి నటించాలనేది కూడా సురేఖగారి కోరికేనట. ఆమె బలంగా అనుకుంది కనుకే జరిగిందని మెగాస్టార్ చమత్కరించారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.