Home » Entertainment » Is Rrr Team Confusing Mega And Nandamuri Fans
Entertainment

RRR టీం కన్‌ఫ్యూజ్ చేస్తోందా.. మెగా-నంద మూరి అభిమానులకి షాకే ..?

Authored By
vamana sai
The Telugu News | Published on: January 20, 2021, 3:30 pm
Advertisement

RRR Movie ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని ప్రపంచం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎన్.టి.ఆర్, రాం చరణ్ పోరాట యోధులుగా తెరకెక్కుతుండడంతో ఒకవైపు మెగా అభిమానులు.. మరొక వైపు నందమూరి అభిమానులు ఆర్ ఆర్ ఆర్ నుంచి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా సంబరాలు చేసుకునేందుకు రెడీగా ఉన్నారు. దర్శక ధీరుడు రాజమౌళి కూడా అటు మెగా అభిమానులని ఇటు నందమూరి అభిమానులను ఏ మాత్రం డిసప్పాయింట్ చేయకుండా భారీ స్థాయిలో ఆర్ ఆర్ ఆర్ ని తెరకెక్కిస్తున్నాడు.

Advertisement

is rrr team confusing mega and nandamuri fans

ఇప్పటికే ఆర్ఆర్ఆర్ నుంచి భీం ఫర్ రామరాజు… రామరాజు ఫర్ భీం టీజర్స్ తో సినిమా రేంజ్ ఏంటో చూపించాడు. ఆ తర్వాత నుంచి ఆర్ ఆర్ ఆర్ నుంచి సాలీడ్ అప్‌డేట్ మాత్రం రాలేదు. అయితే తాజాగా ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభం అయినట్టు .. ఈ షెడ్యూల్ లో రాం చరణ్ – ఎన్.టి.ఆర్ జాయిన్ అయినట్టు పోస్టర్ రిలీజ్ చేసి వెల్లడించారు రాజమౌళి బృందం. ఈ పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఆర్ ఆర్ ఆర్ మీద అంచనాలు ఊహకందడం లేదు. బాహుబలి ఫ్రాంఛైజీ ని మించి కొత్త చరిత్ర సృష్టిస్తుందన్న ప్రచారం మొదలైంది.

Advertisement

రాజమౌళి నెల 26 భారీ సర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్నాడా..?

కాగా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ నుంచి ఈ నెల 26 భారీ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా రామరాజు – భీం లతో కూడుకున్న టీజర్ రిలీజ్ చేయబోతున్నట్టు .. ఈ టీజర్ కి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్టు న్యూస్ వైరల్ అవుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం అలాంటిదేమి ఉండకపోవచ్చునని చిన్న గ్లింప్స్ ని రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. దాంతో ఆర్ ఆర్ ఆర్ టీం ప్రేక్షకులను కన్‌ఫ్యూజ్ చేస్తున్నారా అన్న టాక్ మొదలైంది. మరి రాజమౌళి ప్లాన్ ఏంటన్నది 26 న మాత్రమే తెలిసే అవకాశం ఉందని సమాచారం.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి