Home » Entertainment » Krithi Shetty Picks Viral
Entertainment

krithi Shetty.. రెడ్ సారీలో మెరిసిపోతున్న కృతి శెట్టి.. పిక్స్ వైర‌ల్‌

Authored By
mallesh
The Telugu News | Published on: November 11, 2021, 3:55 pm
Advertisement

krithi Shetty.. క్రితి శెట్టి.. చేసింది ఒకే సినిమా అయినా తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది ఈ ముద్దుగుమ్మ. అతి చిన్న వయస్సులోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కలువ కన్నుల సుందరీ ఏకంగా వరుసబెట్టి సినిమాలు చేస్తోంది. ‘ఉప్పెన’సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుబెట్టిన క్రితిశెట్టి తొలిసినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. మెగా కుటుంబం హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్‌కు జోడిగా క్రితి శెట్టి నటించగా.. ఇద్దరికీ ఇదే డెబ్యూ సినిమా కావడం విశేషం.

Advertisement

krithi shetty picks viral

 

Advertisement

krithi Shetty.. బేబ‌మ్మ‌గా పాపుల‌ర్‌

దర్శకుడు సుకుమార్ వద్ద సహాయకుడిగా పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. హీరోహీరోయిన్లకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాలో సంగీత (బేబమ్మ) క్యారెక్టర్ చేసిన క్రితి ముఖ్యంగా కుర్రకారు మనసు దోచేసింది. ‘నువ్వంటే అదో మాదిరి ఇష్టం బేబమ్మ’అనే డైలాగ్‌కు ఆడియెన్స్ కనెక్ట్ అయ్యారు. ఇక క్రితి శెట్టి కూడా తన అందచందాలను బాగానే ఆరబోసింది. వర్షంలో ఈ అమ్మడు తడుస్తూ చేసే పర్ఫామెన్స్ కు ఆడియెన్స్ ఫిదా అయ్యారు.

Advertisement

krithi shetty picks viral

 

కృతి పుట్టిపెరిగింది మహారాష్ట్రలో అయినా 18ఏళ్ల వయస్సులోనే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ క్యూట్ గర్ల్ హీరో నాని సరసన శ్యామ్ సింగరాయ్ మూవీలో చేస్తుంది. ఇంకొక ఐదారు సినిమాలను కూడా లైన్లో పెట్టింది. తాజాగా క్రితి ఎరుపు రంగు చీరలో దిగిన లేటెస్ట్ ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెడలో పచ్చల హారం వేసుకుని అచ్చం తెలుగింటి పదహారణాల అమ్మాయిలా ఉందటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి..

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి