Home » Entertainment » Nbk 108 Movie In Anil Ravipudi Aroused Interest
Entertainment

NBK 108 Movie : బాలకృష్ణ సినిమాలో ఆ హీరో.. మూవీపై ఆస‌క్తి పెంచిన అనిల్ రావిపుడి

Authored By
mallesh
The Telugu News | Published on: June 21, 2022, 9:30 pm
Advertisement

NBK 108 Movie : టాలీవుడ్ అగ్ర హీరో బాల‌య్య బాబు అఖండ బ్లాక్ బ‌స్ట‌ర్ తో మంచి ఫామ్ లో ఉన్నారు. ఇక ఎఫ్ 3 డైరెక్ట‌ర్ అనిల్ రావిపుడి బంప‌ర్ హిట్ అందుకున్నారు. ఇక ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో సినిమా అంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండ‌దు. కామెడీతో కూడిన మాస్ మ‌సాలా అందించేలా ఉంది ఈ కాంబినేష‌న్. కాగా నంద‌మూరి ఫ్యాన్స్ సినిమా అప్డేట్ కోసం ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్నారు. ఈ క్ర‌మంలో డైరెక్ట‌ర్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. తాజాగా అనిల్ రావిపుడి బాల‌య్య బాబు బ‌ర్త్ డే సంద‌ర్భంగా కీల‌క అప్డేట్ ఇస్తూ విషెస్ తెలియ‌జేశారు. అలాగే ఫ్యాన్స్ ని కూడా ఖుషీ చేశారు.

Advertisement

కాగా ఈ సినిమాను NBK108 వర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఆ కీల‌క అప్డేట్ ఏంటంటే బాల‌య్య బాబుతో పాటు హీరో రాజ‌శేఖ‌ర్ ని కూడా భాగం చేశార‌ట‌. ఇద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చే సీన్స్ సినిమాకు హైలైట్ అవుతాయ‌ని అందుకు అనుగుణంగా క‌థ సిద్దం చేస్తున్నుట్లు తెలుస్తోంది. ఇటీవల శేఖ‌ర్ మూవీతో ఆక‌ట్టుకున్న‌ రాజశేఖర్‌ను సంప్రదించగా ఆయన కూడా ఓకే చేసిన‌ట్లు స‌మాచారం. అనిల్ చెప్పిన కథ రాజశేఖర్ కి బాగా న‌చ్చేసిందంట‌. మూవీలో రాజశేఖర్ పాత్ర కీలకంగా ఉండ‌టంతో స్పెషల్‌గా రాజశేఖర్ కోసం కొన్ని సీన్స్ ప్లాన్ చేశారట డైరెక్టర్ అనిల్. అలాగే ఈ సినిమాకు బ్రో ఐ డోంట్ కేర్… అనే టైటిల్ ని అనుకుంటున్న‌ట్లు స‌మాచారం.

NBK 108 Movie In Anil Ravipudi Aroused Interest

Advertisement

NBK 108 Movie : బ‌ర్త్ డే సంద‌ర్బంగా కీల‌క అప్డేట్..

చిత్రంలో పెళ్లి సందడి.. ఫేమ్ శ్రీలీల బాలకృష్ణకు కూతురిగా న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఫుల్ కామెడీ చిత్రాల‌ను తీసే అనిల్ బాల‌య్య‌బాబు ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని కామెడీ జ‌త‌చేస్తూనే మాస్ ఎలివేష‌న్స్ ఉండేలా రాసుకుంటున్నార‌ట‌. ఇటీవల‌ ఎఫ్3 సినిమాతో ఫన్ కిక్కిచిన అనిల్ రావిపూడి బాలయ్య బాబుతో కొత్త సినిమా ప్రకటించడంతో నందమూరి అభిమానుల్లో నూతనోత్సాహం నింపింది. ఇప్పుడు రాజశేఖర్‌ని భాగం చేస్తున్నారని తెలుస్తుండటం సినిమాపై ఆసక్తి పెరిగింది. అయితే ప్రస్తుతం బాల‌య్య‌బాబు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టికే పోస్టర్స్, ఫస్ట్ హంట్ రిలీజ్ చేశారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి