Home » Entertainment » Niharika Wrap Up Her Shoot Gor Web Series
Entertainment

Niharika : మొత్తానికి ఆ పని అయిపోయింది.. నిహారిక మామూల్ది కాదు!

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: April 8, 2021, 3:04 pm
Advertisement

Niharika : మెగా డాటర్ నిహారిక ఇప్పుడు ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉంటుందని అంతా భావించారు. కానీ రెట్టింపు వేగంతో దూసుకుపోతోంది. అయితే వెండితెరపై కనిపించుకున్నా కూడా వెబ్ సిరీస్‌లతో బిజీ కానుంది. మామూలుగానే నిహారిక వెబ్ సిరీస్‌లకు ఫేమస్. తెలుగులో వెబ్ సిరీస్‌లను ఫేమస్ చేసిందే నిహారిక. అలా ముద్దపప్పు ఆవకాయ్, నాన్న కూచి వంటి సిరీస్‌లతో మంచి గుర్తింపును తెచ్చుకుంది.

Advertisement

అంతే కాకుండా పలు వెబ్ సిరీస్‌లను నిర్మించింది కూడా. అలాంటి నిహారిక ఇప్పుడు పెళ్లి తరువాత ఓ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పింది. పగలు రాత్రి అని తేడా లేకుండా నిహారిక ఆ ప్రాజెక్ట్ కోసం కష్టపడుతోంది. ఒక్కోసారి రాత్రిళ్లు ఆలస్యంగా కూడా వెళ్లాల్సి వస్తోందట. అంతే కాకుండా లేట్ నైట్ షూటింగ్‌లు కూడా జరుగుతున్నాయిట. ఈ క్రమంలో అత్తింటి వాళ్లు కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది.

Niharika Konidela

Advertisement

Niharika : మొత్తానికి ఆ పని అయిపోయింది.. నిహారిక మామూల్ది కాదు

అయితే తాజాగా నిహారిక ఓ అప్డేట్ ఇచ్చింది. అనసూయ ప్రధాన పాత్రలో రాబోతోన్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి అయినట్టు తెలుస్తోంది. తన పాత్రకు సంబంధించిన షూటింగ్, మూవీ షూటింగ్ కూడా పూర్తి అయినట్టు నిహారిక పేర్కొంది. మొత్తానికి అనుకున్న సమయంలోపే తన షూటింగ్‌కు గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది. షూట్ వ్రాప్ అప్.. ప్యాక్ అప్ అంటూ గాల్లో ఎగిరిపోతోంది నిహారిక. ఈ మేరకు నిహారిక చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

 

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి