Home » Entertainment » Ram Charan Joined In Aacharya Shooting
Entertainment

ఆచార్య సెట్ లో అడుగు పెట్టిన రాం చరణ్ .. సంబరాలు చేసుకుంటున్న మెగా ఫ్యాన్స్ ..!

Authored By
vamana sai
The Telugu News | Updated on: January 17, 2021, 12:48 pm
Advertisement

ఆచార్య సెట్ లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఎప్పుడెప్పుడు అడుగు పెడతాడా అని ఇన్నాళ్ళు మెగా ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఎట్టకేలకి ఆ సమయం వచ్చేసింది. తాజాగా రాం చరణ్ ఆచార్య సెట్ లో అడుగు పెట్టాడు. వాస్తవంగా ఈ నెల 20 నుంచి ఆచార్య షూటింగ్ లో జాయిన్ అవుతాడని చెప్పుకున్నారు. కాని అంతకంటే ముందే చరణ్ ఆచార్య షూటింగ్ లో జాయిన్ పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ ఉత్సాహంతో సంబరాలు చేసుకుంటున్నారట.

Advertisement

ram charan joined in aacharya shooting

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఆచార్య రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రెజీనా కసాండ్ర మెగాస్టార్ తో కలిసి స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసింది. మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆచార్య షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. రాం చరణ్ ఆర్ ఆర్ ఆర్ కి చిన్న బ్రేక్ ఇచ్చి ఆచార్య కోసం దాదాపు 25 రోజుల బల్క్ డేట్స్ ఇచ్చినట్టు సమాచారం.

Advertisement

ram charan joined in aacharya shooting

ఇక ఈ సినిమాలో చరణ్ పాత్ర నిడివి కూడా దర్శకుడు కొరటాల శివ పెంచినట్టు చెబుతున్నారు. చరణ్ – చిరంజీ కలిసి సినిమా మొత్తం కనిపిస్తారని చరణ్ ది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అని అంటున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ – మ్యాట్నీ మూవీస్ బ్యానర్స్ పై రాం చరణ్ – నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సమ్మర్ లో ఆచార్య సినిమా రిలీజ్ చేయబోతున్నారు. కాగా రాం చరణ్ ఆచార్య షూటింగ్ లో జాయిన్ అయిన సందర్భంగా మేకర్స్ అఫీషియల్ గా చరణ్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి