Home » Entertainment » Rashmi Gautam New Photos In Saree Goes Viral
Entertainment

Rashmi Gautam : చీర కట్టులో మతిపోగొడుతున్న రష్మీ.. జీరో ఫిట్‌లో ఏముందిరా బాబు..!

Authored By
mallesh
The Telugu News | Published on: August 22, 2022, 4:40 pm
Advertisement

Rashmi Gautam : జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ బుల్లితెరను ప్రస్తుతం ఏలుతున్నది. మొన్నటివరకు రష్మీ మరో యాంకర్ నుంచి తీవ్రమైన పోటీ ఉన్నా ప్రస్తుతం అది లేకుండా పోయింది. దీంతో రష్మీ మరోసారి తన దూకుడును పెంచింది. కెరీర్ తొలినాళ్లలో సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసిన రష్మీ.. ప్రస్తుతం హీరోయిన్ అవకాశాలు పొందుతోంది. ఇలా సినిమా అవకాశాలు రావడానికి జబర్దస్త్ ప్రోగ్రాం కూడా ఒక కారణం. ఈ షో రష్మీకే కాకుండా చాలా మందికి లైఫ్ ఇచ్చింది.

Advertisement

Rashmi Gautam : అందాల ఆరబోతకు ఎప్పుడూ సిద్ధం..

రష్మీ గౌతమ్ తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. కామెడీ షోలో ఫుల్లుగా అందాలు ఆరబోయడంతో పాటు పంచులు వేయడం, అదిరిపోయే డ్యాన్సులు వేయడంలోనూ రష్మీ దిట్ట.. దీనికి తోడు కమెడియన్ సుధీర్‌తో ప్రేమాయణం నడిపించినట్టు అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి. వీరిద్దరూ ఒకనొక షోలో పెళ్లి కూడా చేసుకునే సన్నివేశాలను చిత్రీకరించారు.ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరిద్దరి మధ్య లవ్ ఉందని చాలా మంది అనుకున్నారు.

Rashmi Gautam New Photos In Saree Goes Viral

Advertisement

మొన్నటివరకు కూడా రష్మీ,సుధీర్ ప్రేమలో ఉన్నారని రకరకాల వార్తలు వచ్చాయి. వీరు కూడా తమ మధ్య ఏదో ఉందని జనాలు నమ్మేలా వీరి చేష్టలు ఉండేవి. సుధీర్ కామెడీ చేస్తూనే రష్మీని నా గురించి ఏమని ఆలోచించావ్ అని అడుగడం.. రష్మీ సిగ్గుపడటం వంటివి చేసేవి. ఇలా వీరిమధ్య సీక్రెట్‌గా ఏదో ఉందని భావించారు. అప్పట్లో జడ్జి రోజా సుధీర్ రష్మీ మీ పెళ్లి ఎప్పుడు అని అడుగడంతో అంతా నిజమేనని అనుకున్నారు.

ప్రస్తుతం సుధీర్ జబర్దస్త్ షో నుంచి దూరమయ్యాడు. రష్మీ మళ్లీ ఎక్స్ ట్రా జబర్దస్త్‌తో పాటు జబర్దస్త్ షో కూడా చేస్తుంది.సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మీ.. తాజాగా గ్రీన్ అండ్ వైట్ సారీలో పోస్టు చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. జీరో ఫిట్‌లో రష్మీ తన ఎద అందాలను చూపిస్తూ అస్సలు మాములుగా లేదు. వీటిని చూసి పిచ్చెక్కిపోతున్న నెటిజన్స్ ల తెగ కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి