Home » Entertainment » Samantha Interesting Post Ininstagram
Entertainment

Samantha : ఆ రాత్రి ప్రీతమ్ జుకల్కర్ స్టైలింగ్ చేసిన డ్రెస్ ధరించిన సమంత.. ఇన్ స్టాలో పోస్టు..!

Authored By
mallesh
The Telugu News | Published on: November 16, 2021, 1:00 pm
Advertisement

Samantha : బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన తర్వాత తన కెరీర్‌పై ఫుల్ ఫోకస్ చేసింది. పాన్ ఇండియా ప్రాజెక్టు ‘శాకుంతలం’, కోలీవుడ్ ఫిల్మ్ ‘కాతు వాకుల రెండు కాదల్’ పూర్తి చేసిన సమంత ప్రజెంట్ హిందీ ప్రాజెక్ట్స్‌పైన కాన్సంట్రేట్ చేసింది. ఈ క్రమంలోనే స్పెషల్ నెంబర్ సాంగ్‌కు కూడా ఓకే చెప్పేసింది.

Advertisement

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’లో డ్యాన్స్ నెంబర్ చేయబోతున్నది. ఈ విషయమై మూవీ యూనిట్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. ఈ సంగతులు అలా ఉంచితే ఇన్ స్టా గ్రామ్ వేదికగా సమంత ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టింది.ఇన్ స్టా గ్రామ్ వేదికగా సమంత ఇంట్రెస్టింగ్ ఫొటో షేర్ చేసింది. సదరు ఫొటోకు ‘ఎబౌట్ లాస్ట్ నైట్’ అనే క్యాప్షన్ ఇవ్వడంతో పాటు స్టైలింగ్ క్రెడిట్ ప్రీతమ్ జుకల్కర్‌కు ఇచ్చింది.

samantha interesting post ininstagram

Advertisement

Samantha : ఆ రాత్రి అలా ఉన్నానని తెలిపిన సమంత..

ఫ్యాషన్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ స్టైలింగ్ చేసిన వైట్ కలర్ డ్రెస్‌లో చురకత్తుల్లాంటి చూపులతో సమంత మత్తెక్కిస్తోంది. టాప్ టు బాటమ్ వైట్ కలర్ డ్రెస్‌లో సమంత గ్లామరస్‌గా కనబడుతోంది. ఇక ఈ ఫొటో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘సేమ్ యాజ్ వన్ బై 2, యూ ఆర్ ఆల్వేస్ గ్లామరస్, గాడ్ డ్యామ్న్’ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి