Home » Entertainment » Sri Reddy Sudhir The Tornado That Swarmed With Srireddy
Entertainment

Sri Reddy : శ్రీరెడ్డితో రచ్చ చేసిన సుడిగాలి సుధీర్.. ప్రియతో కలిసి మమూలుగా లేదుగా..!

Authored By
mallesh
The Telugu News | Published on: October 28, 2021, 6:40 pm
Advertisement

Sri Reddy : తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీరెడ్డి అనే పేరు ఓ సంచలనం.. ఇండస్డ్రీలో అవకాశాల కోసం కొత్త నటీనటులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. హీరోలు, నిర్మాతలు, దర్శకులు హీరోయిన్లను ఎలా ఇబ్బంది పెడతారు. కాస్టింగ్ కౌచ్ అనేది ఎంతలా ఉంటుందో ఈమె పలుమార్లు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా దివంగత నటుడు కత్తిమహేశ్‌తో గొడవ, పవన్ కళ్యాణ్ అమ్మగారిని బూతులు తిట్టి పలుమార్లు మెగా, పవర్ స్టార్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు శ్రీరెడ్డి. అంతటితో ఆగకుండా టైం దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్‌ను ఏదో ఒక విషయంలో విమర్శిస్తూనే ఉంటారు ఈ బోల్డ్ అందాల సుందరి.

Advertisement

Sri Reddy : సోష‌ల్ మీడియాలో ర‌చ్చ‌

Advertisement

ఒకానొక సమయంలో క్యాస్టింగ్ కౌచ్ తెలుగు చిత్ర పరిశమ్రలో వేళ్లూరుకపోయిందని ఈ విషయంపై ఇండస్ట్రీ పెద్దలు సమాధానం చెప్పాలని మా అసోసియేషన్ వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేసి అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. దీనిపై మీడియాలో కూడా పెద్ద చర్చకు తెరలేపింది శ్రీరెడ్డి. నోరు తెరిస్తే చాలు ఇండస్ట్రీలో ఎవరో ఒకరు పెద్దమనిషిపై బండబూతులు తిడుతూ ఈ భామ హైలెట్ అవుతూనే వచ్చారు. వపన్ ఫ్యాన్స్ కూడా ఈ విషయాన్ని స్పష్టంచేశారు. ఆమె ఫేమస్ కావడానికి మా హీరోను వాడుకుంటున్నారని పలుమార్లు కామెంట్స్ చేశారు. అయితే, అవన్నీ నిజం కాదని అవకాశాల పేరుతో చాలా మంది నన్ను వాడుకున్నారని, దీనికి సినీ పెద్దలు ఎవరూ సమాధానం చెప్పడం లేదని, తనకు అవకాశాలు రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

ఇదంతా ఒకవైపైతే జబద్దస్త్‌ షోతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ తాజాగా శ్రీరెడ్డితో కలిసి రచ్చ చేసినట్టు తెలుస్తోంది. వీరితో పాటే బుల్లితెర ఆర్టిస్ట్ ప్రియా వీరి రచ్చలో భాగమైనట్టు కనిపిస్తోంది. ఈ ముగ్గురు ఏదో ఒక ఈవెంట్‌లో కలుసుకుని రచ్చ చేశారని టాక్ వినిపిస్తోంది.అందుకు సాక్ష్యమే సుధీర్, శ్రీరెడ్డి క్లోజ్‌గా దిగిన ఫోటోలు. మధ్యలో ప్రియా కూడా ఉంది. ఈ ముగ్గురు ఎప్పుడు కలుసుకున్నారనేది తెలియడం లేదు. కొందరైతే ప్రియా బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చాక దిగారని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.ఇకపోతే శ్రీరెడ్డితో రాసుకుని పూసుకుని సుధీర్ ఫోటోలు దిగడాన్ని పవన్ ఫ్యాన్స్ తప్పుపడుతున్నారు. తాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని సుధీర్ పలుమార్లు చెప్పుకొచ్చాడు. అలాంటిది పవన్‌ను బండబూతులు తిట్టిన శ్రీరెడ్డితో అంత చనువు ఎంటని పవర్ స్టార్ ఫ్యాన్స్ గరం అవుతున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి