Viral Video : వినూత్నంగా ప్రీ వెడ్డింగ్ షూట్.. జిమ్‌లో ఎక్సర్‌సైజెస్ చేస్తూ ఫోజులిస్తున్న వధువు..
Viral Video : ఇటీవల కాలంలో పెళ్లికి ముందర ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడం చాలా కామన్ అయిపోయింది. యువతీ యువకులందరూ అలా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవాలని అనుకుంటున్నారు. దాంతో ఈ ట్రెండ్ బాగా నడుస్తోంది. కాగా, ఓ వధువు డిఫరెంట్ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసింది. ఏం చేసిందంటే..వినూత్న ఆలోచనలో భాగంగా నవ వధువు జిమ్‌లో డంబుల్స్ మోస్తూ ఫొటోలకు ఫోజిచ్చింది. బ్యాక్ గ్రౌండ్‌లో బాలీవుడ్ హిందీ సాంగ్ ప్లే అవుతుండగా, సదరు యువతి పెళ్లికి సంబంధించిన చీర కట్టులోనే జిమ్‌లో రకరకాల ఎక్సర్‌సైజెస్ చేస్తోంది.
Viral Video : జిమ్‌లో అంత బరువున్న డంబుల్స్ మోస్తున్న నవ వధువు..
viral video bride doing diffrent pre wedding shoot video got viral
ఇకపోతే ఫొటోగ్రాఫర్లు సదరు యువతి ఎక్సర్ సైజెస్ చేస్తుండగా ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. ఈ వీడియోను రూపిన్ షర్మ అనే ఐపీఎస్ ఆఫీసర్ ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా, సోషల్ మీడియాలో అది తెగ వైరలవుతోంది. ‘ప్రీ వెడ్డింగ్ షూట్.. ఆజ్ రాత్ హిమ్మత్ కా..’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోను చూసి నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.సదరు వైరల్ వీడియోలో యువతి జిమ్‌లో రకరకాల ఎక్సర్‌సైజెస్ చేస్తూ తన కండలను చూపిస్తోంది. కాగా, ఇలా చేయడం ఎందుకు అని నెటిజన్లు అడుగుతున్నారు.
ఇలా చేయడం వలన యూజ్ ఏంటని కొందరు నెటిజన్లు అడుగుతున్నారు. పెళ్లి వస్త్రాల్లో కుందనపు బొమ్మలా ఉన్న వధువు ఇలా మగరాయుడిలా జిమ్‌లో ఎక్సర్ సైజెస్ చేయడం ఏంటి.. కండలు పెంచి వధువు ఏం చేస్తుందంటూ కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. మొత్తంగా నాగలాండ్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ రూపిన్ షర్మ షేర్ చేసిన సదరు వీడియో నెట్టింట బాగా వైరలవుతోంది.
