Categories: NewsTV Shows

Brahmamudi 8 Nov Today Episode : కావ్యను నమ్మని రాజ్.. ఎంత ఖర్చు పెట్టినా నాన్న బతకడు అని అన్న రుద్రాణి.. ఇద్రాదేవి సీరియస్.. ఇంతలో మరో ట్విస్ట్

Advertisement
Published by
Advertisement

Brahmamudi 8 Nov Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. బ్రహ్మముడి 8 నవంబర్ 2023, బుధవారం ఎపిసోడ్ 248 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వు మనస్ఫూర్తిగా కావ్యను భార్యగా అంగీకరించాలి అని రాజ్ తో అంటాడు సీతారామయ్య. నువ్వు కూడా నాలాగే ఈ ఇల్లు ముక్కలు కాకూడదని ఆలోచించావు అని కావ్యతో అంటాడు సీతారామయ్య. బావ ఈ అప్పగింతలు ఏంటి.. ముందు నువ్వు పదా, రెస్ట్ తీసుకొందువు కానీ అని అంటుంది ఇందిరాదేవి. మరోవైపు కనకం, మూర్తి ఇద్దరూ కావ్య గురించి టెన్షన్ పడతారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో అని కనకం టెన్షన్ పడుతుంది. దీంతో వెంటనే కావ్యకు ఫోన్ చేస్తుంది కనకం. ఏమైందమ్మా.. పెద్దాయన ఏమన్నారు అని అడుగుతుంది కనకం. ఏంటి కావ్య మాట్లాడవు. ఏమైనా అన్నారా? చెప్పవే. కావాలంటే నేను వచ్చి వాళ్ల కాళ్లు పట్టుకొని బతిమిలాడుతాను అంటుంది. దీంతో లేదమ్మా.. తాతయ్య మమ్మల్ని ఇక్కడే ఉండాలని చెప్పారు. అందరూ ఆ మాటకే కట్టుబడి ఉండాలని చెప్పారు. కానీ.. తాతయ్యకు క్యాన్సర్ అంట నాన్న అని చెబుతుంది కావ్య. దీంతో మూర్తి, కనకం షాక్ అవుతారు. ఇప్పుడు ఆఖరి స్టేజ్ లో ఉందని డాక్టర్ గారు చెప్పారట అంటుంది కావ్య. నాన్న.. నేను తర్వాత ఫోన్ చేస్తా. నా వల్ల అవడం లేదు.. అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది కావ్య. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన మన అమ్మాయిల జీవితాలను నిలబెట్టాడు. అలాంటి మనిషికి ఇలా అవ్వడం ఏంటి అని అంటుంది కనకం. పదా.. మనం వెళ్లి ఒకసారి కలిసి వద్దాం అని అంటాడు మూర్తి.

Advertisement

మరోవైపు అనామిక.. కళ్యాణ్ కు ఫోన్ చేస్తుంది. ఏంటి సార్.. నిన్నటి నుంచి అస్సలు కాల్ లేదు.. ఏం లేదు.. ఏమైపోయారు అంటే ఇంట్లో కాస్త బిజీగా ఉన్నా అంటాడు కళ్యాణ్. అందుకే నేనే నీకు కాల్ చేశా అంటుంది అనామిక. మా డాడీ మీతో మాట్లాడాలని అంటున్నాడు అంటే దేనికి అంటాడు కళ్యాణ్. ఎందుకు అంటే.. మాట్లాడుకున్నాం కానీ.. పెళ్లి గురించి ఇతర విషయాలు మాట్లాడుకోవాలి కదా అంటే.. ఇప్పుడు వద్దులే అంటాడు కళ్యాణ్. తాతయ్యకు క్యాన్సర్ అని తెలిసింది. తర్వాత మాట్లాడుదాం అంటాడు. దీంతో సరే అంటుంది అనామిక. మరోవైపు అపర్ణ.. సుభాష్ పై సీరియస్ అవుతుంది. ఇంత పెద్ద విషయాన్ని ఎందుకు దాచారు అని అడుగుతుంది. మామయ్య గారికి అలా అయిందంటే ఎలా తట్టుకుంటాం అంటుంది అపర్ణ. మీరు తట్టుకోలేరు కాబట్టే మీకు చెప్పకూడదని నేను, రాజ్ అనుకున్నాం అంటాడు సుభాష్. ఈ విషయం దాచి నాన్నను సంతోషంగా చూసుకోవాలని అనుకున్నాను అంతే అంటాడు సుభాష్. ఇంతలో కనకం, మూర్తి అక్కడికి వస్తారు. దీంతో వాళ్లను ఆగండి.. మళ్లీ ఎందుకు వచ్చారు అంటూ సీరియస్ అవుతుంది అపర్ణ.

Advertisement

Brahmamudi 8 Nov Today Episode : ముందు నువ్వు మారి.. ఇంట్లో వాళ్లను మార్చు అని అపర్ణపై సుభాస్ సీరియస్

అపర్ణ నువ్వు ఏం మాట్లాడుతున్నావు. నీకు కొంచెం అయినా సెన్స్ ఉందా అని అంటాడు సుభాష్. తప్పు మాదే. మేమే రాకూడని సమయంలో వచ్చాం. మేమే వెళ్లిపోతాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోబోతారు కనకం, మూర్తి. మీరు వెళ్లి మాట్లాడండి.. ఆగండి. ఇంత దూరం వచ్చారు. వెళ్లి నాన్న గారిని చూడండి అని అంటాడు సుభాష్. దీంతో వాళ్లు లోపలికి వెళ్తారు. ఇప్పుడే గొడవలు వద్దు అని చెప్పా. అయినా నువ్వు వాళ్లు రాగానే గొడవ పెట్టుకున్నావు. నువ్వు ముందు మారు. ఆ తర్వాత ఇంట్లో వాళ్లను మార్చేందుకు ప్రయత్నించు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు సుభాష్.

మూర్తి, కనకం ఇద్దరూ ఇంట్లోకి వెళ్లగానే కావ్య కనిపిస్తుంది. పెద్దాయనను చూడటానికి వచ్చాం అంటాడు మూర్తి. నేను మొత్తం విన్నా నాన్న అంటుంది కావ్య. సరే అమ్మ.. మేము పెద్దాయనతో మాట్లాడి వస్తాం అంటారు. మరోవైపు సీతారామయ్య, ఇంద్రాదేవి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. నా దగ్గర నిజం దాచి నన్ను బాధపెట్టి వెళ్లిపోదాం అని అనుకున్నావా బావ అంటుంది ఇంద్రాదేవి.

నువ్వు నన్ను వదిలి వెళ్లిపోతే ఇదే గదిలో ఏడుస్తూ ఒంటరిగా బతకాలి కదా అంటుంది ఇంద్రాదేవి. దీంతో అందరూ ఎప్పుడో ఒకప్పుడు వెళ్లిపోవాల్సిందే కదా అంటుంది ఇంద్రాదేవి. ఇంతలో కనకం, మూర్తి వస్తారు. వాళ్లను చూసి లోపలికి రండి అంటాడు సీతారామయ్య.

ఏంటి మావాడు మీకు కూడా ఫోన్ చేసి కంగారు పెట్టేశాడా? ఇప్పుడు ఏమైందని కంగారు పడుతున్నారు. మీ పిల్లలకు ఎలాంటి సమస్య రాదు. నేను మాటిస్తున్నాను అంటాడు మూర్తి. మీ కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన పోసుకోవడం తప్పితే మేము ఇంకేం చేయలేం అంటారు.

మీ కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి మా ఇంటికి పంపిన మరుక్షణం వాళ్లు ఈ ఇంటి పిల్లలు అని నేను ఆనాడే చెప్పాను అంటాడు సీతారామయ్య. దీంతో మేము వచ్చింది మీకోసం అంటారు. దీంతో నాకేంటి… గుండ్రాయిలా ఉన్నాను అంటాడు సీతారామయ్య.

మరోవైపు స్వప్న, రాహుల్ గొడవ పెట్టుకుంటారు. దానితో గొడవ ఎందుకు పెట్టుకుంటున్నావురా అని రుద్రాణి సీరియస్ అవుతుంది. నేను చెప్పేవరకు నోరు మూసుకొని ఉండు అంటుంది రుద్రాణి. నన్ను శత్రువులా చూడకండి అంటుంది కావ్య. తాతయ్య ఆరోగ్య పరిస్థితి ఇలా ఉందని నాకు తెలియదు అంటుంది కావ్య. దీంతో తెలిసి ఉంటే ఏం చేసేదానివి. నీ నాటకాన్ని ఇంకా బాగా ఆడేదానివి కదా అంటాడు రాజ్.

నా భర్త ప్రాణాలను మీరు నాకు కాపాడండి. నాకు దానం చేయండి. నేను సుమంగళిగా పోవాలని అనుకుంటున్నాను. ఎంత కష్టపడి అయినా.. ఎంత డబ్బు ఖర్చు పెట్టి అయినా నా బావను నేను కాపాడుకుంటా అంటుంది ఇంద్రాదేవి. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా వేస్ట్.. బతకడం కష్టం అంటుంది రుద్రాణి. దీంతో ఇంద్రాదేవికి కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

PM Modi : బెంగాల్‌లో మోడీ స్ట్రాటజీ .. సెంటిమెంట్‌తో సింపుల్ సర్‌ప్రైజ్ ..!

PM Modi : ఎన్నికల రాజకీయాల్లో అనుభవం కలిగిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు.…

5 minutes ago

Samantha : నేను తప్పు చేయలేదు .. చైతూతో పెళ్ళికి 100 శాతం న్యాయం చేశా .. విడాకులకు కారణం అదే .. ?

Samantha : అక్కినేని వారసుడు నాగచైతన్య, అగ్రనటి సమంత రూత్ ప్రభు ప్రేమకథ టాలీవుడ్‌లో ఒకప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచింది.…

2 hours ago

Airtel : మొబైల్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌ .. ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరల పెంపు ..!

Airtel : టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు చర్చకు దారి తీసింది. ప్రముఖ టెలికాం సంస్థ Airtel తన…

3 hours ago

CM Chandrababu : కుటుంబానికి రూ. 1.5 లక్షల రుణమాఫీ .. రైతులకు సీఎం బంపర్ ఆఫర్ ..!

CM Chandrababu : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పలు కీలక…

5 hours ago

Indiramma Illu : ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వ శుభవార్త .. వారందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు .. రూ.5 లక్షల సాయం ..!

Indiramma Illu : తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేయడానికి చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కీలక…

6 hours ago

Rythu Bharosa : రైతన్నలకు గుడ్‌న్యూస్ .. మరికొన్ని గంటల్లో ఖాతాల్లోకి నగదు ..!

Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల్లో ‘రైతు భరోసా’…

7 hours ago

Chicken skin : చికెన్ స్కిన్ తినడం ఆరోగ్యానికి అంత ప్రమాదకరమా? .. తింటే వచ్చే సమస్యలేంటి?..

Chicken skin : నాన్‌వెజ్ ప్రియుల్లో చాలామంది చికెన్‌ను చర్మంతో కలిపి తినడానికి ఆసక్తి చూపుతారు. ప్రత్యేకంగా ఫ్రైడ్ లేదా…

9 hours ago

Coconut Water : నీళ్లు ఎక్కువగా ఉన్న కొబ్బరిబోండాన్ని ఈజీగా గురించేందుకు సింపుల్‌ ట్రిక్స్‌..!

Coconut Water : వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు కొబ్బరి నీళ్లు ఉత్తమమైన సహజ పానీయం. ఇవి దాహాన్ని…

11 hours ago

Summer Diet : చియా సీడ్స్ vs ఫ్లాక్స్ సీడ్స్ .. వేసవి కాలంలో ఏవి తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం.. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ?

Summer Diet : వేసవి కాలం మొదలవగానే మన ఆహారపు అలవాట్లలో మార్పులు చేయడం అవసరం అవుతుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల…

12 hours ago

Tamil Nadu Elections : ఏపీ కంటే దారుణంగా తమిళనాడు నాయకులు .. ఎలక్షన్స్ వేళ బిగ్ ట్విస్ట్

Tamil Nadu Elections : తమిళనాడులో ఇప్పుడు ఎన్నికల వేడి మామూలుగా లేదు. అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని డీఎంకే, ఏఐడీఎంకే…

21 hours ago

Vijay Deverakonda : దేవరకొండ లైనప్ చూస్తే Goosebumps రా..!

Vijay Deverakonda  : సాధారణంగా టయర్ 2 హీరోలకు వరుసగా కొన్ని ఫ్లాపులు పడితే, నిర్మాతలు బడ్జెట్ తగ్గించేసి రిస్క్…

22 hours ago

Telangana : ఇదొక్కటీ జరిగితే KCR మళ్ళీ CM పక్కా..!

Telangana : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది. అదేంటంటే, కొంతకాలంగా ఫామ్ హౌస్ కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత…

1 day ago