Home » News » Gold Silver Rates 21 Feb 2026 Saturday
News

Gold Silver Rates 21 Feb 2026 Today : పెళ్లిళ్ల సమయంలో మహిళలకు భారీ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: February 21, 2026, 9:30 am
Advertisement

Gold Silver Rates 21 Feb 2026 Today : గత కొద్దిరోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధరలు మళ్లీ పైకి కదులుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన పరిణామాల ప్రభావంతో భారతీయ మార్కెట్లో నేడు ఫిబ్రవరి 21, 2026 బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఒక్క రోజే గ్రాముపై సుమారు రూ.88 మేర ధర పెరగడంతో సామాన్యులకు పసిడి భారం కానుంది.

Advertisement

Gold Silver Rates 21 Feb 2026 Today : పెళ్లిళ్ల సమయంలో మహిళలకు భారీ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

Gold Silver Rates 21 Feb 2026 Today నేటి బంగారం ధరలు

దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పసిడి ధరలు పెరిగాయి. ముఖ్యంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.800 నుండి రూ.900 వరకు పెరగగా, 24 క్యారెట్ల (శుద్ధ బంగారం) ధర కూడా అదే స్థాయిలో పెరిగింది.

Advertisement

హైదరాబాద్‌లో : నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,44,260 గా ఉండగా, 24 క్యారెట్ల (శుద్ధ బంగారం) 10 గ్రాముల ధర రూ.1,57,380 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది.

విజయవాడ అండ్ విశాఖపట్నం: ఏపీలోని ప్రధాన నగరాల్లో కూడా హైదరాబాద్ తరహాలోనే ధరలు ఉన్నాయి.

Advertisement

ఢిల్లీ అండ్ ముంబై: దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,56,780 దాటగా, ముంబైలో రూ. 1,56,640 వద్ద ట్రేడ్ అవుతోంది

Gold Silver Rates 21 Feb 2026 Today వెండి ధరల వివరాలు

బంగారంతో పాటు వెండి ధరలు కూడా ప్రస్తుతం గరిష్ట స్థాయిల్లోనే కొనసాగుతున్నాయి. ఇటీవల భారీ రికవరీ తర్వాత నేడు వెండి ధరలు కొంత స్థిరంగా లేదా స్వల్ప తగ్గుదలతో ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి ధర సుమారు రూ.2,69,900 నుండి రూ.2,70,000 మధ్యలో కొనసాగుతోంది. అంతర్జాతీయంగా వెండికి ఉన్న డిమాండ్ దృష్ట్యా ధరల్లో ఈ తరహా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.

ధరలు పెరగడానికి కారణమేంటి?

అంతర్జాతీయంగా డాలర్ విలువలో మార్పులు, మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారంపై మొగ్గు చూపడం వల్ల ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో దేశీయంగా డిమాండ్ పెరగడం కూడా ఒక కారణం.

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు స్థానిక జ్యువెలరీ షాపుల్లో ధరలను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక్కడ పేర్కొన్న ధరలు జిఎస్టీ GST, మేకింగ్ ఛార్జీలకు Making Charges అదనంగా ఉంటాయని గమనించగలరు.

Advertisement

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి