
Serial Artist : సీరియల్స్‌లో సంప్రదాయబద్ధంగా.. బయట మాత్రం ఇలా.... ఎవరీమె...!
Serial Artist : సాధారణంగా సీరియల్స్‌లో కనిపించేవారందరు కూడా చాలా సంప్రదాయబద్ధంగా కనిపించడం కొన్ని సంవత్సరాలుగా వస్తుంది. బయట ఎలా ఉన్నా కూడా సీరియల్స్‌లో మాత్రం చాలా పద్దతిగా కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంటారు. గుప్పడెంత మనసు సీరియల్ నటి సీరియల్‌లో పద్దతిగా కనిపించిన బయట మాత్రం తెగ రచ్చ చేస్తూ అందరికి షాక్ ఇస్తుంటుంది.ఇప్పుడు ఈ అమ్మడు సీరియల్‌లోని తన పాత్రతో మెప్పిస్తూనే బయట సోషల్ మీడియాలో తన అందాలతో రచ్చ చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతూ ఉంటుంది. మరి ఈ భామ మరెవరో కాదు అమూల్య గౌడ.
కన్నడలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ భామ కన్నడలో గౌరి అనే సీరియల్, తెలుగులో గుండెనిండా గుడి గంటలు అనే సీరియల్ చేస్తోంది. అమూల్య గౌడ కన్నడ బిగ్ బాస్ లో పాల్గొన తన సత్తా చాటింది. తాను ఏ విషయంలో కూడా తీసిపోను అని నిరూపించుకుంది. కర్ణాటకలోని మైసూర్‌లో 1993 జనవరి 8న జన్మించిన అమూల్యా.. కన్నడలో ‘కమలి’ అనే సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటి కాకముందు ‘యారిగుంటు యారిగిల్ల’ అనే టీవీ రియాలిటీ షోలో కనిపించింది. 2014లో కన్నడ సీరియల్ ‘స్వాతి ముత్తు’తో నటిగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత.. ‘పునర్ వివాహ’, ‘ఆరామనే’ వంటి హిందీ/కన్నడ సీరియల్స్‌లో కూడా ఆమె నటించి మెప్పించింది.
Serial Artist : సీరియల్స్‌లో సంప్రదాయబద్ధంగా.. బయట మాత్రం ఇలా…. ఎవరీమె…!
అరమనేలో ‘హిత’ అనే నెగిటివ్ లీడ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే మన తెలుగు ‘కార్తీకదీపం’లానే కన్నడలో ‘కమలి’ అనే సీరియల్ చాలా పాపులర్. ఈ సీరియల్‌లో కమలిగా లీడ్ రోల్ చేసి.. 70 శాతంపైగా కన్నడ అభిమానుల్ని కూడగట్టుకుంది అమూల్య. ఈ అమ్మడికి ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 5.44 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. డాన్స్, రీల్స్, మేకోవర్ అంటూ చాలానే వీడియోస్ చేసి ఫ్యాన్స్, ఫాలోవర్స్ ని అలరిస్తూ ఉంటుంది. చీరలోను చాలా పద్దతిగా కనిపించే ఈ ముద్దుగుమ్మ ట్రెండీ డ్రెస్సులలోను తనదైన అందాలతో కుర్రాళ్ల మనస్సులు కొల్లగొడుతూ ఉంటుంది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.