Categories: NewsTV Shows

Guppedantha Manasu 14 Dec Today Episode : రిషి కోసం ఎండీ సీటు వదులుకోవడానికి వసుధార సిద్ధం.. వద్దని వారించిన మహీంద్రా.. ఇంతలో మరో ట్విస్ట్ ఏంటంటే?

Advertisement
Published by
Advertisement

Guppedantha Manasu 14 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 14 డిసెంబర్ 2023, గురువారం ఎపిసోడ్ 946 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను సాటిస్ఫై అవలేకపోతున్నాను అంటే.. ప్లీజ్ సార్ మీకు దండం పెడతా అని చేతులు జోడించి అడుగుతుంది వసుధార. దీంతో ఇప్పుడు సాటిస్ఫై అయ్యా అంటాడు శైలేంద్ర. మరోసారి అడుగు అంటే.. ప్లీజ్ సార్ దయచేసి రిషి సార్ ఎక్కడున్నారో చెప్పండి అని అడుగుతుంది వసుధార. చెప్తా.. అన్నీ చెప్తా. రిషి సార్ ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారు. టైమ్ కి తింటున్నారా? లేదా? అన్ని విషయాలు చెబుతాను అంటాడు శైలేంద్ర. దీంతో అసలు మీకు ఏం కావాలి అని అడుగుతుంది వసుధార. దీంతో ఏం కావాలో నీకు తెలుసు కదా. నాకు ఎండీ సీటు కావాలి అని అంటాడు శైలేంద్ర. దీంతో అది నువ్వు చచ్చినా జరగదు అంటుంది వసుధార. మా పిన్ని కూడా అలాగే చేసింది. చివరకు లేకుండా పోయింది. రేపు నీకేమైనా అయితే. లేదంటే రిషికి ఏమైనా అయితే అంటే.. మీ మైండ్ లోకి అలాంటి ఆలోచనలను రానివ్వకండి. అలాంటి ఆలోచనలు వస్తే మీకంటే ముందే ఆ ఆలోచనలను చంపేస్తాను అంటుంది వసుధార. దీంతో నేను చెప్పాల్సింది చెప్పాను.. ఆ తర్వాత నీ ఇష్టం. భర్త కోసం ఎన్నో త్యాగాలు చేసిన వాళ్లు ఉన్నారు. నువ్వు కూడా అలాగే ఎండీ సీటు వదిలేసుకో. నీ భర్త కోసం, నీ భర్త ప్రాణాల కోసం నువ్వు కూడా చరిత్రలో నిలిచిపోతావు. ఎందుకు అనవసరంగా ప్రాణాల మీదికి తెచ్చుకుంటావు చెప్పు. నేను ఆనాడే చెప్పాను. ఎండీ పదవి కోసం ఎంత దూరం అయినా వెళ్తాను అని. ప్రాణాలు తీయడం నాకు ఇష్టం లేదు కానీ.. అలా చేయాల్సి వస్తోంది. చాలా సార్లు ఓపిక పట్టాను కూడా. కానీ.. ఓపిక నశించింది అంటాడు శైలేంద్ర.

Advertisement

పిన్ని చనిపోయిన తర్వాత అయినా ఆ సీటు నాకు వస్తుంది అనుకున్నా కానీ.. నీ మొగుడు ఆ సీటు నీకు ఇచ్చాడు. ఆ సీటు వదులుకో అంటే నువ్వే పులులు, సింహాలు అంటూ ఏదేదో డైలాగ్ చెప్పావు. నేను హర్ట్ అయ్యా. అందుకే ఈ దారి ఎంచుకున్నా. నీకు మాటలు రావడం లేదని అర్థం అవుతోంది. కథ మొత్తం అర్థం అయింది కదా. నా భర్తను వదిలిపెట్టు అని ఈ ఏడుపులు, బతిమిలాడటాలు ఇవేమీ చేయకు. అందుకు నా మనసు కరగదు. భర్తనా.. ఎండీ సీటా.. అనేది నువ్వు బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో. ఎండీ సీటును నాకు అప్పగిస్తే నీ భర్త తిరిగి ప్రాణాలతో వస్తాడు. లేదంటే అర్థం చేసుకో అంటూ వసుధారను బెదిరిస్తాడు శైలేంద్ర. నువ్వు వేరే ఏదైనా ప్లాన్ చేస్తే నా గురించి తెలుసు కదా. ఆ సీటు కోసం ఎవ్వరినైనా అడ్డు తప్పిస్తాను. ఇంకో విషయం ఏంటంటే.. ఆ ఎండీ సీటు ఎంత త్వరగా నాకు అప్పగిస్తే అంత మంచిది నీకు. ఇక వెళ్లు అంటాడు శైలేంద్ర. దీంతో వసుధారకు ఏం చేయాలో అర్థం కాదు. అసలు ఆ రౌడీ ఎదవలు రిషి గాడిని ఎక్కడ పెట్టి ఉంటారు. ఆ విషయం నాకైనా చెప్తారా లేదా అని అనుకుంటాడు శైలేంద్ర.

Advertisement

Guppedantha Manasu 14 Dec Today Episode : రిషి సార్ ను నిజంగానే శైలేంద్ర బంధించాడా?

ఏది నిజం.. ఏది అబద్ధం. రిషి సార్ ను నిజంగానే శైలేంద్ర బంధించారా? అంటూ ఏడ్చుకుంటూ వెళ్తుంది వసుధార. ఏంటి ఈ పరీక్ష. రిషి సార్ ఎక్కడున్నారు మీరు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది వసుధార. ఇంటికి వస్తుంది. వసుధారను చూసి మహీంద్రా ఆశ్చర్యపోతాడు. ఏమైంది.. ఎందుకు అలా ఉన్నావు. ఏం జరిగింది అని అడుగుతాడు. వసుధార. నిన్నే అని అడుగుతాడు. దీంతో నాకు ఎండీ సీటు వద్దు మామయ్య అంటుంది వసుధార. అదేంటమ్మా అంటే నాకు ఆ పదవి అక్కర్లేదు మామయ్య అంటుంది వసుధార. ధరణిని వదిలిపెట్టి వెళ్లినప్పుడు ఏమైనా అయిందా అంటే.. ఎండీ సీటు వదిలిపెడితేనే రిషి సార్ ఎక్కడున్నారో తెలుస్తుంది మామయ్య అంటుంది. ఆ ఎండీ సీటు వద్దు అనుకుంటేనే రిషి సార్ క్షేమంగా ఉంటారు మామయ్య అంటుంది వసుధార. అలా అని నీకు ఎవరు చెప్పారు అంటే.. శైలేంద్ర అంటుంది వసుధార.

శైలేంద్ర ఎందుకు అలా చెప్పాడు. ఏ ఉద్దేశంతో చెప్పాడు అంటే ఖచ్చితంగా వాడు ఎండీ సీటు కోసమే అలా అన్నాడు. వాడికి రిషి ఎక్కడున్నాడో తెలుసు. వాడే రిషిని ఎక్కడో దాచిపెట్టాడు. అందుకే వసుధారతో అలా అన్నాడు అంటాడు మహీంద్రా. ఆ రోజు నాకు ఆ పదవి అప్పగిస్తూ ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. కాలేజీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని చెప్పారు. ఎంతో నమ్మకంతో నాకు ఆ పదవి అప్పగించారు. కానీ.. ఆయన నా పక్కన లేకుండా నా పక్కన ఏదున్నా నాకు అది గడ్డిపరకతో సమానం. అందుకే.. ఈ ఎండీ సీటును వదిలేద్దామని అనుకుంటున్నాను అంటుంది వసుధార.

శైలేంద్ర అలా అన్నంత మాత్రాన నువ్వు ఎండీ పదవి వదిలేస్తే ఇప్పుడు రిషి గురించి చెబుతాడని ఏంటి నమ్మకం. తొందరపడి నిర్ణయం తీసుకోకు. ఎటువంటి ముందడుగు వేయకు. ఇప్పుడు మనకు ఒక నిజం తెలిసింది. రిషి ఎవరి కంట్రోల్ లో ఉన్నాడని తెలిసింది కదా. అందరం కలిసి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో చూద్దాం అంటుంది అనుపమ.

మరోవైపు ధరణి.. కాఫీ ఇస్తుంది శైలేంద్రకు. ఏమైంది సైలెంట్ గా ఉన్నావు అని అడుగుతాడు. దీంతో ఏం లేదు అంటుంది ధరణి. మీ మీద నమ్మకం రావడం లేదు మారారంటే అని అంటుంది. నేను మారానని నీకు ఎలా చెప్పాలి అంటే నాకేం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అంటుంది ధరణి. వసుధార నీకు ఎక్కడ కలిసింది అని అడుగుతాడు. దీంతో ఇక్కడే కలిసింది అంటుంది ధరణి.

సరే.. తనకు నువ్వు ఏమైనా చెప్పావా అంటే ఏమైనా అంటే.. నాకు తెలిసిన నిజాలు నా గుండెల్లోనే సమాధి అవుతాయి అంటుంది. తను నిన్ను ఏమైనా అడిగిందా అంటే మీరు ఎక్కడున్నారు అని అడిగింది. నేను తీసుకొచ్చి చూపించాను అంటుంది ధరణి. సార్ లేకుండా నేను బతకలేను. సార్ కు చిన్న ఆపద వచ్చినా నేను తట్టుకోలేను అని అనుపమతో అంటుంది వసుధార. దీంతో మీ ఇద్దరిని ఒక్కటి చేస్తాను. నన్ను నమ్ము అని భరోసా ఇస్తుంది అనుపమ. మన భయాన్ని అలుసుగా తీసుకుంటున్నాడు. వాడిని దోషిగా ఎలా నిలబెట్టాలో నాకు తెలుసు అంటుంది అనుపమ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Pakistan : పాకిస్తాన్ కుక్క బుద్ధి చూసారా .. మళ్ళీ అడ్డంగా దొరికేసారు..!

Pakistan : పాకిస్థాన్ ప్రస్తుతం ఒక వింతైన మరియు క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రపంచ వేదికల మీద తాను గొప్ప దౌత్యవేత్తనని,…

5 hours ago

TVK Vijay : తమిళనాడు ఎన్నికల సర్వేల్లో విజయ్ పై షాకింగ్ రిజల్ట్స్..!

TVK Vijay : తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. సినిమా రంగానికి, రాజకీయాలకు అక్కడ విడదీయలేని అనుబంధం ఉంది. అయితే…

6 hours ago

Donald Trump : ఒప్పందం అమలు కాకపోతే మ్యాప్ లో ఆ దేశమే ఉండదన్న ట్రంప్..!

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై పెను సంచలనాన్ని…

7 hours ago

PM Modi : మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు..!

PM Modi : భారత రాజకీయ యవనికపై మహిళల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత కీలకమైన…

8 hours ago

Pawan Kalyan : పవన్ కల్యాణ్ పిఠాపురంకి కేంద్రం బంపర్ గుడ్ న్యూస్..!

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురం అభివృద్ధి…

9 hours ago

IPL 2026 : బాబోయ్‌ .. ఫిలిప్స్ నువ్వు మనిషివా? పక్షివా? .. నెటిజన్ల ప్రశంసలు వెల్లువ ..!

IPL 2026  : క్రికెట్‌లో ఫీల్డింగ్ అనేది మ్యాచ్ ఫలితాన్ని మార్చగల కీలక అంశం. అలాంటి ఫీల్డింగ్ నైపుణ్యంతో గ్లెన్…

11 hours ago

Vivo T5 Pro 5G : భారత మార్కెట్‌లో వివో టి5 ప్రో 5జి ధర లీక్ .. గీక్‌బెంచ్ ప్లాట్‌ఫామ్‌ ..కొత్త ఫీచర్లు ..!

Vivo T5 Pro 5G : భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వివో టి5 ప్రో 5జి…

12 hours ago

Chityala : చిట్యాల మార్కెట్ యార్డు అభివృద్ధికి శంకుస్థాపన

Chityala : చిట్యాల పట్టణ కేంద్రంలోని మార్కెట్ యార్డులో రూ.1.65 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నూతన నిర్మాణ పనులకు ప్రభుత్వ…

13 hours ago

Farmers : అన్నదాతలకు తీపి కబురు .. రూ.41,543 కోట్ల సబ్సిడీకి కేంద్ర ఆమోదం ..!

Farmers : దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరలు పెరుగుతున్న…

14 hours ago

Govt Jobs : నిరుద్యోగులకు ల‌క్కీ ఛాన్స్‌ .. రూ. 60 వేల జీతంతో ప్ర‌భుత్వ ఉద్యోగం .. వివరాలివే ..!

Govt Jobs : ప్రస్తుతం ఎక్కువ మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ప్రైవేట్ కంపెనీల్లోనే ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వ…

15 hours ago

Summer Holidays 2026 : విద్యార్ధులకు శుభవార్త .. బడులకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

Summer Holidays 2026 : రాష్ట్రవ్యాప్తంగా ఎండలు రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు మండిపడుతూ…

17 hours ago

Gold Silver Rates April 9th 2026 : బంగారం కొనేవారికి బిగ్ షాక్.. రాత్రికి రాత్రే రూ.4,000 పెరిగిన గోల్డ్ రేట్, ఏకంగా రూ.10,000 ఎగబాకిన వెండి!

Gold Silver Rates April 9th 2026 : పసిడి ప్రియులకు, ఆభరణాలు కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది…

18 hours ago