Guppedantha Manasu 16 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 16 నవంబర్ 2023, గురువారం ఎపిసోడ్ 922 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు నేను వంట వండుతా అని చెప్పి అన్ని సామాన్లు ఎక్కడ ఉన్నాయో చూస్తుంటాడు రిషి. మీకు ఎందుకు సార్ ఈ బాధ అంటుంది వసుధార. చింతపండు కోసం వెతుకుతుంటే పైన ఉన్న బియ్యం ఇద్దరి తల మీద పడతాయి. దీంతో మన పెళ్లికి ఎలాగూ అక్షింతలు వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు దేవుడు మనకు అలా చేశాడు అంటుంది వసుధార. నువ్వు ఏదైనా పాజిటివ్ గా తీసుకుంటావా వసుధార అంటాడు రిషి. అవును సార్.. అలా అయితేనే మన జీవితం సాఫీగా ముందుకు సాగుతుంది అంటుంది వసుధార. ఉండు.. ఒక ఫోటో తీస్తా అని చెప్పి రిషి ఫోటో తీస్తాడు. మరోవైపు అనుపమ.. మహీంద్రా, రిషిని కలిసిందనే విషయం దేవయాని.. శైలేంద్రకు చెబుతుంది. ఆ అనుపమ చాలా డేంజర్ అని అంటుంది దేవయాని. మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కువగా టెన్షన్ తీసుకోకు. నేనున్నాను కదా అంటాడు శైలేంద్ర. నువ్వు అలాగే అంటావు. పీకల మీదికి వచ్చాక నువ్వు ఏం చేస్తావు అంటుంది దేవయాని. దీంతో ఇప్పుడు నువ్వేమంటావు. మనకు తెలియకుండా వాళ్లు ఏదో చేస్తున్నారనే కదా. ఈ క్షణం నుంచి వాళ్లు ఏం చేస్తున్నా కూడా నాకు తెలుస్తుంది. అక్కడ ఏం జరగాలన్నా నాకు తెలుస్తుంది. తెలిసి తీరాల్సిందే అంటాడు శైలేంద్ర.
ఇంతలో ఫణీంద్ర వచ్చి శైలేంద్ర చెంప చెళ్లుమనిపిస్తాడు. దీంతో దేవయాని, శైలేంద్ర షాక్ అవుతారు. ఏం తెలిసి తీరాలి. ఏం జరిగినా నీకు తెలియాలా? ఎవ్వరూ నీకు తెలియకుండా ఎక్కడికీ వెళ్లకూడదా? ఏ పని చేయకూడదా? అంటూ ఫణీంద్ర సీరియస్ అవుతాడు. ఏం లేదండి.. మామూలుగానే మాట్లాడుకుంటున్నాం అంటుంది దేవయాని. ఎప్పుడు చూసినా సీక్రెట్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదో కుట్రలు పన్నుతున్నట్టు.. మీకు ఇక వేరే పని పాట లేదా? ధరణి అంటూ పిలుస్తాడు ఫణీంద్ర. నీకు ఏం చెప్పానమ్మా.. వీళ్లిద్దరూ మాట్లాడుకోకుండా చూడమని చెప్పాను కదా అంటాడు. వీళ్లిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటే ఏం జరుగుతుందో అని నాకు చాలా భయంగా ఉంది. నీకు చెప్పాను కదా. నువ్వు ఏం చేస్తున్నావు అంటే.. నా ప్రయత్నం నేను చేస్తున్నా మామయ్య గారు. ఒక చోట కాకపోతే మరో చోట కలిసి మాట్లాడుకుంటున్నారు. నేను ఏం చేయను అంటుంది ధరణి. గుర్రాన్ని చెరువు దాక తీసుకెళ్లగలం కానీ.. నీళ్లు అయితే తాగించలేం కదా మామయ్య గారు అంటుంది ధరణి. దీంతో వీళ్లు గుర్రాలు కాదు.. గాడిదలు అంటాడు ఫణీంద్ర. పెద్ద దానివి అయి ఉండి మంచి చెప్పాలి కానీ.. వాడికి చెడు చెబుతున్నట్టుగా ఉంది. అసలు ఈ ఇంట్లో జరిగే అన్ని అనర్థాలకు నువ్వే కారణం అనిపిస్తోంది నాకు అంటాడు ఫణీంద్ర. మహీంద్ర వెళ్లడం వెనుక నువ్వే ఉన్నావు. కొంపదీసి జగతి చావు వెనుక కూడా మీ ఇద్దరి హస్తం ఏదైనా ఉందా అంటాడు ఫణీంద్రా. దీంతో ఏంటి డాడ్ అంత మాట అన్నారు అంటాడు శైలేంద్ర. నీ లైఫ్ కరెక్ట్ గా సెట్ చేసుకో. అవన్నీ వదిలేసి ఏదేదో వెదవ పని చేస్తుంటావు అంటూ శైలేంద్రకు క్లాస్ పీకుతాడు శైలేంద్ర.
అసలు నీకు పెళ్లి అయి ఎన్నేళ్లు అయిందిరా.. అంటే లెక్క పెడుతూ ఉంటాడు శైలేంద్ర. ఇదిరా.. నీ పరిస్థితి. భార్యతో సరదాగా ఉండాలి అంటాడు. వాళ్లకు కొన్ని అచ్చటా ముచ్చటా ఉంటాయి. భర్తతో కలిసి బయటికి వెళ్లాలని చిన్న చిన్న ముచ్చట్లు ఉంటాయి. భర్తతో గడిపే కొంత సమయమే వాళ్లు సంతోషంగా ఫీల్ అవుతారు. వాళ్లు లైఫ్ కు ఒక్క ఐదు నిమిషాలు సంతోషంగా గడిపినా చాలు. అవన్నీ నీకేం తెలియవు అంటాడు ఫణీంద్ర. అసలు భార్య అంటే ఏమనుకుంటున్నావురా. పెళ్లి అయి ఇన్నాళ్లు అయంది. ఇప్పటి వరకు పిల్లా, జల్లా లేదు. నీ ప్రవర్తనలో మార్పు రాకపోతే నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మళ్లీ ఫారెన్ తిరిగి వెళ్లిపో. దేవయాని నీకు మళ్లీ మళ్లీ చెబుతున్నాను. జాగ్రత్తగా ఉండు అంటాడు ఫణీంద్రా. వామ్మో.. మీ నాన్న ఏంటి ఇంత మాట అన్నాడు. జగతి చావు విషయంలో మన హస్తం ఉందంటున్నాడు. ఈయన మన మీద పడ్డారేంటి అంటుంది దేవయాని. నువ్వేం టెన్షన్ పడకు మామ్. వీటన్నింటికీ నా దగ్గర సొల్యూషన్ ఉంది అంటాడు శైలేంద్ర.
మరోవైపు అనుపమ.. మహీంద్రాకు ఫోన్ చేస్తుంది. కానీ.. కాల్ కట్ చేస్తాడు మహీంద్రా. కట్ చేస్తున్నాడు ఏంటి అని మళ్లీ ఫోన్ చేస్తుంది. ఏంటి అనుపమ మళ్లీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని అడుగుతాడు మహీంద్రా. ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది. తను ఎక్కడుంది, ఎలా ఉంది అని నేను అడిగినప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేదు అంటే.. చెప్పాలనిపించలేదు అంటాడు మహీంద్రా. చెప్పలేకపోయాను అంటాడు. ఏంటి అనుపమ ఇది.. నీ జర్నలిస్ట్ మైండ్ తో ఇప్పుడు నన్ను ఇంటరాగేషన్ చేస్తున్నావా అంటాడు మహీంద్రా. నేను దోషిని కాదు. విక్టిమ్ ను అంటాడు. సరే మహీంద్రా.. నాకు నీ సమాధానం కావాలి అంటుంది అనుపమ. జగతి చనిపోయినా మీరు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు అని అడుగుతుంది. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వే కావచ్చు కానీ.. ఈ విషయంలో నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను అంటాడు మహీంద్రా.
జగతి లేదనే విషయమే నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నా గుండె ముక్కలు అయిపోతుంది. నువ్వు పదే పదే జగతి, జగతి అంటూ నా ప్రాణం తీస్తున్నావు. జగతి నా ప్రాణం అని తెలుసు కదా అనుపమ. నా ప్రాణం నన్ను వదిలి వెళ్లిపోయింది. ఇంకా నీకు ఏం చెప్పాలి చెప్పు అంటాడు. జగతిని ఎవరు చంపారో నీకు తెలుసుకోవాలని లేదా అని అడుగుతుంది అనుపమ. జగతి బతికి ఉన్నన్ని రోజులు నువ్వు తనకు దూరంగానే ఉన్నావు కదా. ఇప్పుడు తను చనిపోయిన తర్వాత గుర్తొస్తుందా అని అడుగుతుంది అనుపమ. జగతి గురించి మాట్లాడటానికి అయితే నువ్వు నాకు ఇంకోసారి ఫోన్ చేయకు అంటాడు మహీంద్రా.
మీ ఇద్దరిని ఒక్కటి చేసింది ఎవరో నీకు గుర్తు లేదా అంటుంది అనుపమ. గట్టిగా కోపంతో అరుస్తాడు మహీంద్రా. దీంతో రిషి, వసు అక్కడికి వచ్చి చూస్తారు. మళ్లీ అనుపమ గారే ఫోన్ చేశారు అంటుంది వసుధార. ఇన్ని రోజులు ఆవిడకు అమ్మ చనిపోయిన విషయం తెలియదు. ఇప్పుడు ఆ విషయం తెలిసింది కదా అంటాడు రిషి.
జగతికి సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవాలని, బయలుదేరాలని అనుకుంటుంది అనుపమ. దీంతో బ్యాగ్ సర్దుకొని బయలుదేరుతుంది అనుపమ. తనను చూసి విశ్వం షాక్ అవుతాడు. నేను తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి అంటుంది అనుపమ. వెళ్తున్నాను అంటుంది. నువ్వు ఏదో ఒకరోజు నా దగ్గరికి వస్తావని కోటి ఆశలతో ఎదురు చూశాను. ఏళ్లు గడిచినా నువ్వు రాలేదు. ఇక నువ్వు రావని అనుకుంటున్న సమయంలో ఇంటికి వచ్చావు. నిన్ను చూసిన ఆ క్షణం నాకు ఎంతో సంతోషం వేసింది అంటాడు విశ్వం.
మళ్లీ వెళ్తా అంటున్నావు అంటాడు. ఇలా చేయడం నీకు న్యాయంగా ఉందా అంటే.. డాడ్ మీరు బాధపడకండి అంటుంది అనుపమ. విశ్వం ఆరోగ్యం బాగోలేదు. మీరు మళ్లీ వెళ్లిపోతే విశ్వం మీమీద బెంగ పెట్టుకుంటాడు. నా మాట వినండి అత్తయ్య అంటుంది ఏంజెల్. దీంతో సారీ డాడ్.. నేను నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల నేను దూరంగా ఉండాల్సి వచ్చింది. దాని వల్ల మిమ్మల్ని బాధపెట్టాను. నేను బాధపడ్డాను. ఇక నుంచి అలా జరగదు అంటుంది అనుపమ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.