Home » News » Guppedantha Manasu 6 December 2023 Wednesday Full Episode
News

Guppedantha Manasu 6 Dec Today Episode : రిషి ఎక్కడికి వెళ్లాడు? అతడికి ఏమైనా ప్రమాదం జరిగిందా? అనుపమ రిషి విషయంలో ఎందుకు టెన్షన్ పడుతోంది?

Authored By
Varun G
The Telugu News | Updated on: December 6, 2023 9:03 am
Advertisement

Guppedantha Manasu 6 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 6 డిసెంబర్ 2023, బుధవారం ఎపిసోడ్ 939 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దేవయాని నువ్వు ఇంటికి వెళ్లు అంటే.. ఎందుకు అండి అంటుంది. ఎందుకు ఏంటి.. ఉదయం వచ్చావు. నువ్వు, ధరణి ఇద్దరూ ఇంటికి వెళ్లి కాసేపు రెస్ట్ తీసుకోండి అంటే.. నేను ఇక్కడి నుంచి వెళ్తే శైలేంద్రను ఎవరు కాపాడుతారు. వద్దు ఇక్కడి నుంచి వెళ్లకూడదు అని అనుకుంటుంది దేవయాని. మహీంద్రా మీ వదిన ఉంటానని అంటోంది కదా.. నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో అంటాడు రవీంద్ర. వసుధారను కూడా తీసుకెళ్లు అంటాడు. అసలు రిషి ఎక్కడికి వెళ్లాడు అంటే.. అదే అర్థం కావడం లేదు అన్నయ్య. ఫోన్ కూడా కలవడం లేదు అంటాడు మహీంద్రా. ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పలేదా అంటే.. చెప్పలేదు అన్నయ్య అంటాడు మహీంద్రా. శైలేంద్రను కాపాడుకోవడానికే మీరు ఇక్కడ ఉంటున్నారనే విషయం మాకు తెలుసు అని మనసులో అనుకుంటాడు మహీంద్రా. కారులో వెళ్తూ రిషికి ఫోన్ చేస్తుంది వసుధార. కానీ.. ఫోన్ కలవదు. స్విచ్ ఆఫ్ వస్తుంది. దీంతో వసుధారకు ఏం చేయాలో అర్థం కాదు. జగతి మేడమ్ చావుకు కారణమైన వాళ్లను ఇంకా పట్టుకోలేకపోతున్నానని ఆయన టెన్షన్ పడుతున్నారు. ఆయన ఈ విషయంలో ఏం చేస్తున్నారు అనేది అర్థం కావడం లేదు అంటుంది వసుధార. తన అన్నయ్యే ఈ పని చేశారని బాధపడి ఉంటాడు. నువ్వేం కంగారు పడకు. రిషి వచ్చేస్తాడు అంటాడు మహీంద్రా.

Advertisement

మరోవైపు తమ ఇంటి వద్ద అనుపమ ఉంటుంది. నువ్వేంటి ఇక్కడ అంటే.. ఏం ఉండకూడదా అంటుంది అనుపమ. నిన్ను రావద్దని చెప్పాను కదా. ఎందుకు వచ్చావు అంటే.. నువ్వు రావద్దని చెప్పింది ఆసుపత్రికి కదా.. ఇంటికి కాదు కదా అంటుంది అనుపమ. ఇంతకీ శైలేంద్రకు ఎలా ఉంది అని అడుగుతుంది అనుపమ. దీంతో బాగానే ఉంది అంటాడు మహీంద్రా. ఇంట్లోకి పిలవరా అంటుంది అనుపమ. నాతో చాలా పాజిటివ్ గా ఉంటున్నావు వసుధార అని అనుపమ మెచ్చుకుంటుంది. అలా అని చెప్పి నువ్వు నచ్చావని కాదు.. కొన్ని విషయాల్లో నాకు ఎందుకో ఇంపల్సివ్ గా అనిపిస్తావు. ఆ ఎండీ సీటుకు నువ్వు కరెక్ట్ కాదనిపిస్తుంది అంటుంది అనుపమ. అందుకే నిన్ను రావద్దని అన్నాను అనుపమ అంటాడు. ఏమైనా తీసుకోండి కాఫీ, టీ అని అడుగుతుంది వసుధార. దీంతో అవసరం లేదు వసుధార. నేను ఇంకా గెస్ట్ ను కాదు. మీ ఇంటికి చాలాసార్లు వచ్చాను. మీరు అలసిపోయినట్టున్నారు. మీరు కూర్చోండి. నేనే కాఫీ చేసి తీసుకొస్తాను అంటుంది అనుపమ. ఆ తర్వాత ఇంకోసారి రిషి సార్ కి ఫోన్ చేస్తా అంటుంది వసుధార. కానీ కలవదు. దీంతో తనకు ఏం చేయాలో అర్థం కాదు.

Guppedantha Manasu 6 Dec Today Episode : ఎవరు మీ మీద దాడి చేసి ఉంటారు అని శైలేంద్రతో అన్న ధరణి

మరోవైపు ధరణి.. శైలేంద్ర దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ధరణి.. ఈ కన్నీళ్లు అని అడుగుతాడు. నాకేం కాలేదు ధరణి. నేను బాగానే ఉన్నాను. నువ్వు అలా కన్నీళ్లు పెట్టుకుంటే నాకు చాలా బాధగా ఉంది. ప్లీజ్ ఊరుకో అంటాడు శైలేంద్ర. నా వల్లే ఇదంతా జరిగింది అంటుంది ధరణి. దీంతో అదేం లేదు ధరణి అంటాడు. నా కోసం నా ప్రేమను గుర్తించి నా సంతోషం కోసం మీరు ఇలా మంచిగా మారిపోయి నన్ను హ్యాపీగా చూసుకుంటున్న సందర్భంలో ఇలా జరిగింది. మామయ్య గారు బయటికి వెళ్లమని చెప్పినప్పుడు నేను ఒప్పుకోకుండా ఉండాల్సింది. అలా చేస్తే మీకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటే.. ధరణి నువ్వే నా ఆయుధం. ఇక నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర.

Advertisement

నువ్వు అన్నమాట నిజమే ధరణి. నేను అందరినీ చాలా మోసం చేశాను. బాధపెట్టాను. ఎండీ సీటు మీద ఉన్న ఆశతో రిషిని కాలేజీకి, మన ఇంటికి దూరం చేశాను. ఆ పాపం ఊరికే పోతుందా అంటాడు. ఏ జన్మలో చేసిన పాపానికి ఆ జన్మలోనే అనుభవించాలని నా నుదుటన రాసి ఉంది కావచ్చు. అందుకే నేను మంచివాడిలా మారాక అటాక్ జరిగి ఉంటుంది అంటాడు శైలేంద్ర. అసలు వీళ్లు ఎవరు వాళ్లు మన ఫ్యామిలీలో ఎవ్వరినీ వదలము అని అన్నారు అంటుంది.

ఎంత ఆలోచించినా వాళ్లు ఎవరు అనేది తెలియడం లేదు. వాళ్లు చివర్లో అన్న మాటలను బట్టి చూస్తే నాకు తెలిసి వాళ్లు ఎవరో మన ఫ్యామిలీకి సంబంధించిన శత్రువులేమో అనిపిస్తోంది అని అంటాడు శైలేంద్ర. కాలేజీకి సంబంధించిన శత్రువులు అయి ఉంటారు అని ధరణి మైండ్ ను డైవర్ట్ చేస్తాడు శైలేంద్ర. కాలేజీకి సంబంధించి ఇంకెవరు ఉన్నారు మీరే కదా అంటుంది ధరణి.

Advertisement

అంటే.. నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అంటాడు శైలేంద్ర. నాకు నేనే ఇలా రక్తం వచ్చేలాగా పొడుచుకున్నాను అనుకుంటున్నావా చెప్పు ధరణి అంటే.. అది కాదండి నేను మిమ్మల్ని నమ్ముతున్నాను కానీ.. వాళ్లు ఎవరో ఏంటో అని అంటుంది ధరణి. వాళ్లు ఎవరు అయినా ఖచ్చితంగా వదిలిపెట్టను. నేను కోలుకున్నాక వాళ్లను పట్టుకొని నీ కళ్ల ముందు నిలబెడతాను. నువ్వే వాళ్లకు తగిన శిక్ష వేయాలి. నాకు రక్తం పోతున్న సమయంలో కూడా నా బాధ అంతా నీ గురించే. నీకు ఏమౌతుందో అని టెన్షన్ పడ్డా. కానీ.. ఆ దేవుడి దయ వల్ల నీకు ఏం కాలేదు అంటాడు శైలేంద్ర.

మరోవైపు కాలేజీ వాళ్లకు ఫోన్ చేసి రిషి గురించి ఆరా తీస్తుంది వసుధార. మరోవైపు రిషి ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు అని అనుపమతో చెబుతుంది వసుధార. ఆ మెసేజ్ రిషి చేశాడని అనుకోలేం కదా అంటుంది అనుపమ. దీంతో వసుధార ఇంకా టెన్షన్ పడుతుంది. తను చేసి ఉండొచ్చు.. లేదా ఇంకెవరైనా చేసి ఉండొచ్చు కదా.. అంటే నువ్వు ఇంకా వసుధారను టెన్షన్ పెట్టకు అనుపమ అంటాడు మహీంద్రా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి