intinti gruhalakshmi 15 december 2023 friday full episode
Intinti Gruhalakshmi 15 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 15 డిసెంబర్ 2023, శుక్రవారం ఎపిసోడ్ 1128 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పరందామయ్య కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ కు వెళ్లి తులసి, నందు ఫిర్యాదు ఇస్తారు. ఆయన అల్జీమర్స్ పేషెంట్ అని జాగ్రత్తగా ఉండాలి కదా. ఆయన దగ్గర ఫోన్ అయినా లేదా అడ్రస్ అయినా పెట్టాలి కదా అంటాడు పోలీస్. ఇప్పుడు ఆయన దగ్గర ఏం లేవు. ఆయన కనిపించక 2 గంటలు అవుతోంది. వెంటనే వెతికి పెట్టండి అంటుంది తులసి. చూడండి మీ తప్పు వల్ల మీ భార్య ఎంత బాధపడుతుందో అంటాడు ఎస్ఐ. దీంతో నేను ఆయన భార్య అని ఎవరు చెప్పారు అంటూ సీరియస్ అవుతుంది తులసి. వామ్మో అంత కోపం ఎందుకు అని చెప్పి వెంటనే డిటెయిల్స్ తీసుకొని వెతకడం ప్రారంభిస్తాం అంటారు. ఆ తర్వాత చీకటి అవుతుంది. పరందామయ్య ఇల్లు కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంతలో ఓ వ్యక్తి కనిపిస్తాడు. నీకు తులసి ఇల్లు తెలుసా అని అడుగుతాడు పరందామయ్య. దీంతో తెలుసు అంటాడు ఆ వ్యక్తి. పరందామయ్య కూడా ఆ వ్యక్తిని నమ్ముతాడు.
తులసి ఇంటికి తీసుకెళ్లు అంటాడు. కానీ.. ఆ వ్యక్తి పరందామయ్య మెడలో ఉన్న గోల్డ్ చైన్ చూస్తాడు. ఆ గోల్డ్ చైన్ చూసి అది నిజమైన గోల్డ్ చైనేనా అని అడుగుతాడు. దీంతో అవును అంటాడు. ఇక్కడ దొంగలు ఎక్కువగా ఉంటారు. ఆ గోల్డ్ చైన్ తీసి నాకు ఇవ్వు అంటాడు ఆ వ్యక్తి. వద్దు ఇవ్వను అంటాడు. దీంతో దాన్ని లాక్కునే ప్రయత్నం చేస్తాడు. ఇంతలో కారులో వెళ్తూ నందు, తులసి పరందామయ్యను చూస్తారు. వెంటనే ఆ వ్యక్తి పారిపోతాడు. ఇంటికి తీసుకొస్తారు. పరందామయ్యను ఇంటికి తీసుకురాగానే అనసూయ షాక్ అవుతుంది. నాకు అస్సలు మన ఇల్లు గుర్తుకురావడం లేదు. నాకు ఏమైనా అవుతోందా? నేను ఒక్కడినే ఎందుకు రోడ్డు మీద తిరుగుతున్నానో అర్థం కావడం లేదు అంటాడు పరందామయ్య. దీంతో పొరపాటు జరిగిపోయింది నాన్న. డాక్టర్ దగ్గరికి వెళ్లినప్పుడు మిమ్మల్ని ఒక్కరినే వదిలేసి డాక్టర్ దగ్గరికి వెళ్లాను అంటాడు నందు. దీంతో నాకు ఏమైంది. అసలు నన్ను ఎందుకు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లావు అంటాడు పరందామయ్య. ఏం లేదు మామయ్య. జనరల్ చెకప్ అంటుంది తులసి.
మరోవైపు రాత్రి అవుతుంది. దివ్య పడుకుంటుంది. మధ్యలో నీళ్ల కోసం కిందికి వస్తుంది. కానీ.. కింద చూస్తే రాజ్యలక్ష్మి పడిపోయి ఉంటుంది. తనను చూసి భయపడుతుంది దివ్య. వెంటనే విక్రమ్ విక్రమ్ అంటూ అరుస్తుంది. ఏమైంది దివ్య. ఎందుకు అంత కంగారు పడుతున్నావు అంటే.. అత్తయ్య అక్కడ పడిపోయింది అని చెబుతుంది. దీంతో వెంటనే విక్రమ్ కిందికి వస్తాడు. చూస్తే అక్కడ రాజ్యలక్ష్మి ఉండదు. వెంటనే అందరూ బయటికి వస్తారు. ఏమైంది అని అడుగుతారు. దీంతో నేను మంచినీళ్ల కోసం వచ్చాను. అత్తయ్య కింద పడిపోయింది ఉంది అంటుంది. ఇంతలో రాజ్యలక్ష్మి వస్తుంది. ఏమైంది అందరూ అర్ధరాత్రి ఇక్కడ ఉన్నారేంటి అంటే.. నీ పెద్ద కోడలు మళ్లీ సినిమా మొదలు పెట్టింది అంటాడు బసవయ్య. నువ్వు కింద పడిపోయావని చెప్పింది అంటాడు బసవయ్య. దీంతో విక్రమ్ కు ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే దివ్యను పైకి తీసుకెళ్తాడు విక్రమ్.
మరోవైపు పరందామయ్య పరిస్థితి గురించి తెలుసుకొని అనసూయ భయపడుతుంది. నందుతో తన బాధను చెప్పుకుంటుంది. ముసలితనం శరీరాన్ని బలహీనం చేస్తుంది. ముసలితనం పసితనంలా అందంగా ఉండాలంటే ఖచ్చితంగా మనోబలంతో ఉండాలి అని చెబుతుంది తులసి. ఇంతకంటే ఎక్కువ ఆశించకూడదు అని సర్దిచెప్పుకోవాలి. అది కష్టం అని నాకు తెలుసు. కానీ.. కష్టం అంటుంది తులసి. రాత్రి నాన్న గారు ఇబ్బంది పెట్టకుండా పడుకున్నారా అంటే.. ఆయన నన్ను ఇబ్బంది పెట్టడం కాదు.. ఆయన ఇబ్బంది పడటం చూడలేకపోతున్నాను అంటుంది అనసూయ.
మరోవైపు నందు అని పిలుస్తాడు. తనకు ఏ డ్రెస్ వేసుకోవాలో తెలియదు. లుంగీ బదులు వేరేది వేసుకుంటాడు నందు. తులసి నీకు ఈ మధ్య బద్దకం ఎక్కువైంది. రాత్రి తలుపులు వేయడం మరిచిపోయావు అంటాడు పరందామయ్య. దీంతో వేశాను అంటుంది. దీంతో దొంగ ఎలా దూరుతాడు అంటాడు పరందామయ్య. ఒళ్లంతా నొప్పులుగా ఉన్నాయి అంటాడు పరందామయ్య. నడవడం కష్టంగా ఉంది అంటాడు. ఆ తర్వాత పరందామయ్య కాలికి దెబ్బ తాకడంతో ఆయనకు ఆయింట్ మెంట్ రాస్తుంది అనసూయ. ఈ మధ్య మీ అమ్మకు నా మీద ప్రేమ తగ్గిపోయిందిరా. నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు అంటాడు పరందామయ్య. మరోవైపు టైమ్ కు రెగ్యులర్ గా ట్యాబ్లెట్లు వేసుకోవాలని చెప్పి బీపీ ట్యాబ్లెట్ ఇస్తుంది అనసూయ. ఆ తర్వాత మరిచిపోయి మళ్లీ వేసుకుంటాడు పరందామయ్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో తెలియాల్సిందే.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.