intinti gruhalakshmi 25 december 2023 monday full episode
Intinti Gruhalakshmi 25 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 25 డిసెంబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 1136 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పరందామయ్యను హాస్పిటల్ కు తీసుకెళ్తారు. వాళ్లతో పాటు తులసి కూడా వెళ్తుంది. డాక్టర్ గారు ఎక్కడ నేను మాట్లాడుతాను అంటే.. నందు ఇప్పటికే మాట్లాడారు కదా మళ్లీ నువ్వు మాట్లాడేదేంటి అంటే.. ఏమో నాకు తెలియదు. నేను ఒకసారి మాట్లాడుతా అంటుంది తులసి. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి నాకు సంబంధం లేదు అంటుంది లాస్య. దీంతో మొదటి నుంచి తులసికే ఈ విషయంలో క్లారిటీ ఉంది. ఒకసారి తనను వెళ్లనివ్వు. నువ్వే దగ్గర ఉండి తీసుకెళ్లు అని లాస్యతో అంటాడు నందు. దీంతో లాస్య, తులసి ఇద్దరూ కలిసి డాక్టర్ ను కలిసేందుకు వెళ్తారు. మీ మామయ్యకు ఉన్న జబ్బును నేను తగ్గిస్తాను. నాకు సొంత మెథడాలజీ ఉంది అంటాడు డాక్టర్. నేను దీని మీద రీసెర్చ్ చేయబోతున్నాను. మీ మామయ్య మీదనే నేను ఆ రీసెర్చ్ ను వాడబోతున్నాను మీకేమైనా అభ్యంతరమా అని అడుగుతాడు డాక్టర్. దీంతో అభ్యంతరం ఏం ఉంటుంది అని అంటుంది తులసి. ఆ తర్వాత పరందామయ్యను తీసుకొని నందు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. హాయ్ సర్.. హవ్ ఆర్ యు అని డాక్టర్ అడుగుతాడు. దీంతో పరందామయ్య ఏం మాట్లాడడు. టెన్షన్ అవసరం లేదు. కాసేపు మనం లోపల మాట్లాడుకుందాం. ట్రీట్ మెంట్ స్టార్ట్ చేస్తాను అంటాడు. డాక్టర్ నేను కూడా పేషంట్ పక్కన ఉండొచ్చా అంటే వద్దు అంటాడు డాక్టర్. మీరంతా బయట వెయిట్ చేయండి అంటాడు.
పరందామయ్యకు టెస్ట్ చేస్తాడు డాక్టర్. ఇంతలో రిసెప్షనిస్ట్ కు ఫోన్ చేసి బయట నందు, లాస్య ఉంటారు.. వాళ్లను లోపలికి పంపించండి అంటే.. అందరూ వెళ్తారు. ఎలా ఉంది మామయ్య అంటే.. ఈయన ఎవరో కానీ భలే సరదాగా కబుర్లు చెబుతారు నాకు నచ్చారు అంటాడు పరందామయ్య. నా మనసు అంతా తేలికగా ఉన్నట్టు అనిపిస్తోంది అంటాడు. ఆ తర్వాత లాస్య ఫోన్ చేసి నేను ఆ ఇంట్లో కోడలుగా ఉన్నంత వరకు మాత్రమే పరందామయ్యకు గుర్తుకు రావాలి అని చెబుతుంది. అది మాత్రమే తెలియాలి. తులసి కోడలుగా ఉన్న విషయం తెలియకూడదు అని గుర్తు చేస్తుంది లాస్య. దీంతో సరే అంటాడు. పరందామయ్యకు ట్రీట్ మెంట్ స్టార్ట్ చేస్తాడు. ట్రీట్ మెంట్ పని చేస్తున్నట్టే అని అనుకుంటాడు డాక్టర్. మీరు ఎప్పుడూ యాక్టివ్ గా, హుషారుగా ఉండాలి అని అంటాడు డాక్టర్. నేను చెప్పినవి ఏవీ మరిచిపోకూడదు అంటాడు డాక్టర్. ట్యాబ్లెట్లు రెగ్యులర్ గా వేయండి అంటాడు డాక్టర్. ఆ తర్వాత వెళ్ళేముందు లాస్య.. డాక్టర్ వైపు నవ్వు చూస్తుంది. దీంతో అంతా ఓకే అన్నట్టుగా చెబుతాడు డాక్టర్. దీంతో నవ్వుకుంటూ వెళ్తుంది లాస్య.
ఇంతలో నందు, తులసి, పరందామయ్య ముగ్గురూ కలిసి వెళ్తుంటారు. ఇంతలో పరందామయ్య ఆగి.. ఎంత మంది వచ్చాం.. ఎంత మంది వెళ్తున్నాం అని అంటాడు పరందామయ్య. నువ్వు కట్టుకున్న పెళ్లాన్నే మరిచిపోయావా? అంటాడు పరందామయ్య. దీంతో నందు, తులసికి ఏం అర్థం కాదు. ఓ కోడలా అని లాస్యను చూసి పిలుస్తాడు పరందామయ్య. నన్నేనా అని ఏం తెలియనట్టుగా అడుగుతుంది. దీంతో అవునమ్మా నిన్నే.. నువ్వేగా మా ఇంటి కోడలువి. అలా అడుగుతావేంటి. మతిమరుపు వచ్చిందా నీకు అంటాడు పరందామయ్య. నువ్వు ఇలా అమాయకంగా ఉండబట్టే నీ మొగుడు నిన్ను ఆడిస్తున్నాడు. ఇలా రా అమ్మా అంటాడు పరందామయ్య. నువ్వు నీ మొగుడిని వదిలేశావా.. లేక నీ మొగుడు నిన్ను వదిలేశాడా అంటాడు పరందామయ్య. దీంతో మీరు ఏదో పొరపాటు పడ్డారు మామయ్య అంటుంది లాస్య. దీంతో నేను ఏం పొరపాటు పడలేదు. మీరిద్దరూ చిలకా గోరింకల్లా కలిసి ఉన్నారు నాకు తెలుసు అంటాడు. ముందు ఇంటికి వెళ్దాం పదా అంటాడు పరందామయ్య.
నేను ఆయన భార్యను కాదు మామయ్య అంటుంది లాస్య. మేము విడాకులు తీసుకున్నాం అంటుంది లాస్య. ఇంతలో డాక్టర్ వస్తాడు. మీ వాళ్లు మీ మీద ప్రాక్టికల్ జోక్ చేస్తున్నారు. కావాలని ఏడిపించేందుకు అలా చేస్తున్నారు. వాళ్లిద్దరూ భార్యాభర్తలేనండి అంటాడు డాక్టర్. ఆ తర్వాత ముగ్గురిని తన రూమ్ లోకి తీసుకెళ్తాడు డాక్టర్. ఆయన ఎలా మాట్లాడినా మీరు అడ్డు చెప్పకూడదు. ఆయన ముందు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు అంటాడు డాక్టర్. మీ నాన్న గారికి సంబంధించినంత వరకు మీరిద్దరూ ప్రస్తుతానికి భార్యాభర్తలు అంటాడు. ఆయన మెంటల్ కండిషన్ ఇప్పుడు అవేవీ ఒప్పుకోవు. కొన్ని రోజులు నటించండి.. తప్పదు. ఆయన ఆలోచనలకు మనం భిన్నంగా మాట్లాడితే ఆయన తట్టుకోలేరు. ప్రాణాలకే ప్రమాదం కావచ్చు అంటాడు డాక్టర్.
మరోవైపు రాజ్యలక్ష్మిని పొగుడుతూ ఉంటాడు బసవయ్య. ఇంతలో కర్టెన్ పక్కన ఎవరో ఉన్నట్టు చూసి భయపడతాడు. అక్కడ దెయ్యం ఉంది అంటాడు. దీంతో అక్కడ ఏముంటుంది అని ఆయన భార్య వెళ్లి కర్టెన్ తీస్తుంది. దీంతో అక్కడ ఒక దెయ్యంలా వేషం వేసుకున్న ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని రాజ్యలక్ష్మి సెట్ చేస్తుంది. రాత్రి పూట దివ్యకు మాత్రమే కనబడేలా చేస్తుంది. రాత్రి వాటర్ కోసం బయటికి వచ్చిన దివ్య ఆ దెయ్యాన్ని చూసి భయపడుతుంది. ఆ తర్వాత బయటికి వెళ్తుంది. పోలీసులు తనను అరెస్ట్ చేసి విక్రమ్ కు ఫోన్ చేసి చెబుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.