Intinti Gruhalakshmi 5 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 5 డిసెంబర్ 2023, మంగళవారం ఎపిసోడ్ 1119 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది నా గురించి, మీ అబ్బాయి గురించి కాదు. మా కథ ఎప్పుడో ముగిసిపోయింది. దివ్య గురించి ఆలోచించండి. రేపు సారె పెట్టడానికి వెళ్లాలో వద్దో చెప్పండి సారె పెట్టడానికి వెళ్లాలంటే మీ అబ్బాయి గురించి మరిచిపోండి. మీ అబ్బాయి రావడమే ముఖ్యం అనుకుంటే సారె గురించి మరిచిపోండి అని అంటుంది తులసి. మా కడుపున పుట్టడమే మా పిల్లలు చేసిన పాపం అంటుంది తులసి. మా బంధాలు, పట్టింపులు గొడవల వల్ల వాళ్ల జీవితాల్లో సంతోషం లేకుండా పోయింది. మా మధ్యలో వాళ్లే నలిగిపోయారు. అమ్మ కోసం నాన్నను వదులుకోలేరు. నాన్న కోసం అమ్మను వదులుకోలేరు. ఒక విధంగా చెప్పాలంటే అమ్మానాన్నలు ఉన్న అనాథలుగా బతుకుతున్నారు అంటుంది తులసి. అమ్మ.. తులసి అలా అనకు అమ్మ అంటే.. అప్పుడప్పుడు అయినా గతాన్ని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకోకపోతే గుండె బరువు తగ్గదు మామయ్య అంటుంది తులసి. నీ పిల్లలు అనాథలుగా ఎలా మారుతారు. వాళ్ల జీవితాలను సరైన మార్గంలో పెట్టావు. నువ్వు వాళ్ల అమ్మవు అని చెప్పుకోవడానికి గర్వ పడుతున్నాం అంటారు పరందామయ్య. దివ్య వాళ్ల నాన్న ఎందుకు రాలేదు అంటే ఏం సమాధానం చెప్పాలి అంటుంది తులసి.
మరోవైపు నందు.. హనీ దగ్గరికి వెళ్లి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. దీంతో ఆడుకుంటున్నా అంటుంది. ఆవిడ ఎక్కడ అంటే.. టిప్ టాప్ గా రెడీ అయి ఆఫీసుకు వెళ్తుంది కదా ఆవిడ అంటే.. బయట తాతయ్యతో మాట్లాడుతోంది అంటే.. రేపు దివ్య దగ్గరికి అంకుల్ కూడా వస్తారు అని వెళ్లి చెప్పు అంటాడు నందు. దీంతో సరే అంకుల్ అని చెప్పి తులసి దగ్గరికి వెళ్తుంది. ఆంటి రేపు దివ్యక్క వాళ్ల ఇంటికి నందు అంకుల్ కూడా వస్తారంట అని అంకుల్ చెప్పమన్నారు అంటుంది హనీ. దీంతో తులసి, పరందామయ్య, అనసూయ సంతోషిస్తారు. మరోవైపు దివ్య తనకు పుట్టబోయే పిల్లాడి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో పై నుంచి పాట వినిపిస్తుంది. దీంతో పైకి వెళ్తుంది దివ్య. పైన రూమ్ డెకరేషన్ చేయడం చూసి ఆశ్చర్యపోతుంది దివ్య. ఎక్కడి నుంచి పాట వస్తోంది అని చూస్తుంది. చూస్తూ అక్కడ ఒక గిఫ్ట్ ఉంటుంది. పక్కనే ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ లో పాటను ఆపేస్తుంది. గిఫ్ట్ ఏంటి అని చూస్తుంది. ఓపెన్ చేస్తుంది. ఒక నెక్లెస్ ఉంటుంది అందులో. ఆ నెక్లెస్ చూసి తెగ సంతోషిస్తుంది దివ్య. నా ప్రియమైన అందమైన దేవతకు చిన్న చిరు కానుక ప్రేమతో అని పేపర్ లో రాసి ఉంటుంది. దాన్ని చదివి.. ఆ పేపర్ కు ముద్దు ఇవ్వబోతుంది దివ్య. దీంతో ఆ ముద్దు నాది అంటాడు విక్రమ్. దీంతో విక్రమ్ ను గట్టిగా హత్తుకుంటుంది దివ్య.
గిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్స్ అంటే నువ్వు ఇవ్వబోయే గిఫ్ట్ కంటే ఇది పెద్దదేమీ కాదు అంటాడు విక్రమ్. నెక్లెస్ ఎవ్వరూ చేతికి ఇవ్వరు అని అంటుంది దివ్య. దీంతో ముద్దు ఎవ్వరూ పేపర్ మీద ఇవ్వరు అంటాడు విక్రమ్. ఆ తర్వాత విక్రమ్ తనకు నెక్లెస్ వేస్తాడు. ఆ పిల్ల రాక్షసి దివ్య మమ్మల్ని పనోళ్లుగా చేసింది అని రాజ్యలక్ష్మి ముందు వాపోతాడు. నీ అసలు కొడుకు సంజయ్ ని దాదాపు జైలుకు పంపించినంత పని చేసింది. ఏం చేశావు. ఆవిడ కారు కర్ర కాల్చి వాతలు పెట్టే స్టేజీలో ఉంది. మనం పెట్టించుకునే స్టేజీలో ఉన్నాం అంటాడు బసవయ్య.
మరోవైపు తులసి, నందు, అనసూయ, పరందామయ్య అందరూ సారె పట్టుకొని వస్తారు. అమ్మా దివ్య అంటుంది తులసి. బాగున్నారా అంటే అంతా మీ అమ్మాయి దయ అంటుంది బసవయ్య భార్య. మా అమ్మాయి ఏం చేసింది అంటాడు నందు. దీంతో తులసి నందు వైపు చూస్తుంది. దీంతో నోర్మూసుకొని ఉంటాడు. దివ్య అని పిలుస్తుంది అనసూయ. దీంతో వాళ్ల దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది దివ్య.
తనకు కూర్చోబెట్టి సారె పెడతారు అందరూ కలిసి. తులసి జెడలో పూలు పెడుతుంది. ఆ తర్వాత చీరను వాయినంగా ఇస్తుంది. పండ్లు, స్వీట్లు పెడుతుంది. మీ అల్లుడికి ఏం లేవా అంటుంది బసవయ్య భార్య. దీంతో కడుపుతో ఉంది దివ్య.. నేను కాదు అంటాడు విక్రమ్. నాన్న అమ్మ పక్కన వచ్చి నిలబడు.. దండం పెట్టుకుంటాను అంటుంది దివ్య. దీంతో నందుకు ఏం చేయాలో అర్థం కాదు. పర్లేదమ్మా.. నువ్వు వెళ్లి మీ నాన్న కాళ్లకు దండం పెట్టు అంటుంది తులసి.
దీంతో అది పద్దతి కాదమ్మా అంటాడు బసవయ్య. దీంతో రండి అంటుంది తులసి. దీంతో తులసి పక్కన వెళ్లి నిలబడతాడు నందు. దివ్యను ఇద్దరూ ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత ఆడపిల్ల కావాలని అనుకుంటున్నారా.. మగపిల్లాడా అని అడుగుతాడు పరందామయ్య. దీంతో పుట్టేది ఆడపిల్లే అంటుంది తులసి. మా అమ్మ గారే మళ్లీ పుట్టబోతున్నారు అంటుంది తులసి.
దీంతో ఓ మొన్న పోయిన మీ అమ్మ గారే దివ్య కడుపులో పడ్డారా.. అయితే మీ అమ్మ గారిని జాగ్రత్తగా చూసుకుంటా అంటుంది రాజ్యలక్ష్మి. పెళ్లి అప్పుడు అంటే మీ దగ్గర డబ్బులు లేవు. కానీ.. ఇప్పుడు సామ్రాట్ కంపెనీకి సీఈవో అయ్యావు కదా. అలా చీప్ చీర పెట్టావేంటి అంటే.. ఆ కంపెనీకి నేను గార్డియన్ మాత్రమే. ఆస్తికి వారసురాలిని కాదు అంటుంది తులసి.
మరోవైపు రాజ్యలక్ష్మికి ఫోన్ చేస్తుంది లాస్య. నీ చేతికి ఒక పాశుపత్రాన్ని అందించేందుకు ఫోన్ చేశాను. అక్కడికి మందు తాగి వచ్చాడు నందు అని చెబుతుంది లాస్య. దీంతో ఓకే.. నేను చూసుకుంటా అని ఫోన్ పెట్టేస్తుంది. భోజనాలు రెడీ అయ్యాయి అంటుంది దివ్య. అందరూ వెళ్తుండగా నందు కాలు జారి కింద పడతాడు. నిజానికి బసవయ్య కావాలని ముందుకు నందును నెట్టేస్తాడు. నువ్వు కాలు అడ్డం పెట్టావు అంటాడు నందు. వియ్యాల వారి ఇంటికి తాగి వచ్చావా అంటూ బసవయ్య అంటాడు. వదినను అడిగితే ఏం చెబుతుంది.. దివ్యను అడగండి పద్ధతులు బాగా తెలిసిన వ్యక్తి కదా అంటుంది బసవయ్య భార్య. ఇక చచ్చినా ఈ ఇంట్లో ఉండను అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు నందు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.