Intinti Gruhalakshmi 7 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 7 నవంబర్ 2023, మంగళవారం ఎపిసోడ్ 1095 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కంపెనీలోకి అసలు నీకు రావడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు. బయటికి వాళ్లు వచ్చి బోర్డు మీటింగ్ లో గొడవ పెట్టడం ఏంటి.. అసలు మేనేజర్ నువ్వు ఏం చేస్తున్నావు. ముందు ఈ ఇద్దరిని బయటికి గెంటేయ్ అని మేనేజర్ పై సీరియస్ అవుతుంది లాస్య. అసలు మీరు ఏమనుకుంటున్నారు మీ గురించి మీరు అంటూ సీరియస్ అవుతుంది తులసి. ఎవరు పడితే వాళ్లు కూర్చోవడానికి ఇదేమీ పనికిమాలిన చైర్ కాదు. కంపెనీ సీఈవో చైర్. నీలాంటి బఫూన్ కు కూర్చొనే అర్హత అయితే అస్సలు లేదు అంటుంది తులసి. గెటప్ అంటుంది తులసి. లేవండి ముందు అంటుంది తులసి. దీంతో ధనంజయ్ షాక్ అవుతాడు. ఏంటి నీ దౌర్జన్యం అంటుంది లాస్య. ఎవరిది దౌర్జన్యం. ఇప్పటికే కంపెనీకి సీఈవో ఉండగా ఇంకో సీఈవో కోసం రిజల్యూషన్ పాస్ చేసే హక్కు నీకెవరు ఇచ్చారు అని అడుగుతుంది తులసి. దీంతో ఈ కంపెనీ సీఈవో సామ్రాట్. ఆయన చనిపోవడంతో ఆ కంపెనీ సీఈవో పోస్ట్ ఖాళీ అయింది అంటుంది లాస్య. దీంతో ఒక్కసారి ఈ ఫైల్ లో ఏముందో అందరూ చదువుకోండి అని అందరికీ ఆ ఫైల్ ఇస్తుంది తులసి.
దీంతో అందరూ ఆ ఫైల్ చదువుతారు. ఇప్పుడు అర్థం అయిందా. ఏ హక్కుతో నేను బోర్డ్ మీటింగ్ కు వచ్చానో అంటుంది తులసి. ఏ హోదాతో నేను ప్రశ్నిస్తున్నానో.. బెదిరిస్తున్నానో అని. మాట్లాడరు ఏంటి అంటుంది తులసి. ఇంతకుముందు వరకు కోతిలా ఎగిరావు కదా. ఇప్పుడు ఏమైంది అని అడుగుతుంది తులసి. డియర్ ఫ్రెండ్స్.. మీకు ఇచ్చిన ఫైల్స్ అన్నీ చదివారు కదా అంటాడు నందు. హనీ కూతురు బాధ్యతను, తన ఆస్తి బాధ్యతను, కంపెనీ బాధ్యతను తులసి గారికి చెందేలా సామ్రాట్ గారు సైన్ చేసి పవర్ ఆఫ్ అటార్నీ అని చెబుతాడు నందు. ఆయన బతికి ఉంటే దీని అవసరం వచ్చి ఉండేది కాదు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయారు కాబట్టి ఇప్పుడు దాని అవసరం వచ్చింది అని అంటాడు నందు. సామ్రాట్ తర్వాత ఈ కంపెనీ బాధ్యతలు మోయగల సత్తా కేవలం తులసి గారికి మాత్రమే ఉంది. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి సందేహం లేదు అంటారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. కంపెనీ సీఈవోగా తులసి గారు మాత్రమే ఉండాలని మేమంతా ఏకగ్రీవంగా రెజల్యూషన్ పాస్ చేస్తున్నాం అంటారు. దీంతో అందరూ ఒప్పుకుంటారు. మేనేజర్ గారు ఈ కంపెనీతో సంబంధం లేని వాళ్లను బయటికి పంపించేయండి అంటుంది తులసి. దీంతో మేడమ్ మీరు వెళ్తారా? మమ్మల్ని పంపించమంటారా? అంటాడు మేనేజర్. దీంతో లాస్య, ధనంజయ్, రత్నప్రభ ముగ్గురూ అక్కడి నుంచి కోపంతో వెళ్లిపోతారు.
అనుకున్నది అనుకున్నట్టు జరగడానికి మీరు చేసిన సాయానికి థాంక్స్ అని రావుతో అంటుంది తులసి. మీరు ఎప్పుడు ఈ కంపెనీకి సీఈవో అవుతారా అందరం ఎదురు చూస్తున్నాం. సామ్రాట్ గారి తర్వాత ఈ కంపెనీని నడిపించే అర్హత మీకు మాత్రమే ఉంది. కంపెనీకి మీరు సీఈవో అయితేనే ఈ కంపెనీ ముందుకెళ్తుంది అని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తులసితో అంటారు.
బయటికి వచ్చి లాస్య, రత్నప్రభ, ధనుంజయ్ చాలా కోపంగా ఉంటారు. కనీసం తన దగ్గర పవర్ ఆఫ్ అటార్నీ ఉందనే విషయం మీరు ముందు తెలుసుకోకూడదా అని సీరియస్ అవుతుంది లాస్య. దీంతో నాకు ఎలా తెలుస్తుంది అని అంటుంది రత్నప్రభ. ఇంతలో అక్కడికి వచ్చిన తులసి.. ఎందుకు అంతలా అరుచుకుంటున్నారు అంటుంది తులసి. నాకు సహనం ఎక్కువ. శ్రీకృష్ణుడు శిశుపాలుడికి 100 తప్పుల వరకే అవకాశం ఇచ్చాడు. నాకు ఆయనకంటే సహనం ఎక్కువ కాబట్టి నీకు 1000 తప్పుల వరకు అవకాశం ఇచ్చాను. మారుతావని అవకాశం ఇచ్చాను కానీ.. నువ్వు రోజురోజుకు రెచ్చిపోతున్నావు. అందుకే నేను దాచుకున్న ఆ పవర్ ఆఫ్ అటార్నీని బయటపెట్టాను అంటుంది తులసి.
ఈ ఆస్తి అనుభవించడానికే కదా ఇదంతా చేస్తున్నావు అంటుంది రత్నప్రభ. నోర్మూయ్.. నేను ఆస్తి కోసం ఏనాడూ ఆలోచించలేదు అంటుంది తులసి. తనకు ఏదైనా జరిగితే హనీ ఒంటరిది కాకూడదు అని ఆయన పవర్ ఆఫ్ అటార్నీ రాశారు. నేను వద్దన్నా వినలేదు. దేవుడు ఆయనకు పవర్ ఆఫ్ అటార్నీ ఎందుకు రాసేలా చేశాడో నాకు ఇప్పుడు అర్థం అవుతోంది. ఈ లాస్య మిమ్మల్ని వదిలిపెట్టదు. ఈ లాస్య తను ప్రశాంతంగా ఉండదు. ఎదుటివాళ్లను ప్రశాంతంగా ఉండనివ్వదు. లాస్య గుప్పిట్లో నుంచి బయటికి వచ్చి హనీ మీద వేసిన కేసును వెనక్కి తీసుకోండి. లేదంటే మీరే కటకటాల్లోకి వెళ్తారు. ఈ తులసి పవర్ ఏంటో మీకు ఈపాటికే తెలిసి ఉంటుంది. బీకేర్ ఫుట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి.
ఇంతలో నందు వస్తాడు. లాస్యకి తులసికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని మరోసారి రుజువు అయింది. బుద్ధిగా నీ బతుకు నువ్వు బతుకు. తులసి మీద పడి ఏడ్వడం మానేయ్. బాగుపడతావు అంటాడు నందు. మా సంగతి సరే.. మీరు ఎలా బాగుపడతారో నేనూ చూస్తా అంటుంది లాస్య.మరోవైపు దివ్య, విక్రమ్.. ఇద్దరూ రిసార్ట్ కు వెళ్తారు. నాకు వేరే ప్రపంచంలోకి వచ్చినట్టు ఉంది విక్రమ్ అంటుంది. వాళ్ల వెనుకే ఫాలో అవుతూ ఉంటారు బసవయ్య, జాను. అయితే.. జాను కూడా ఇక్కడికి వచ్చినట్టు నాకు డౌట్ వస్తోంది అంటుంది దివ్య. నువ్వు జాను గురించి ఇక్కడ కూడా టెన్షన్ పడుతున్నావా? అన్నీ వదిలేయ్.. ప్రశాంతంగా గడుపుదాం అంటాడు విక్రమ్. మరోవైపు దివ్య, విక్రమ్ ఇద్దరూ రూమ్ తీసుకొని లోపలికి వెళ్తారు.
మరోవైపు తులసి, నందు ఇద్దరూ ఇంటికి వస్తారు. కంపెనీ బాధ్యతల్లో నేను కూడా తులసికి తోడుంటాను అంటాడు నందు. మనం కలిసి కాపురం చేసిన పాతిక ఏళ్లు ఏరోజూ నీకు సపోర్ట్ గా లేను. ఆ తర్వాత కూడా నా సమస్యల్లో నువ్వు సపోర్ట్ గా నిలిచావు తప్పితే నేను ఏనాడూ నీకు సపోర్ట్ గా లేను. చాలా సార్లు బాధపడ్డాను అంటాడు నందు. నీరుణం తీర్చుకునే అవకాశం ఇప్పుడు దొరికింది. కాదనకు తులసి ప్లీజ్ అంటాడు నందు. ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయ్యారు. మీ లైఫ్ ను డిస్టర్బ్ చేసుకున్నట్టు అవుతుందేమో అని భయం అంటుంది తులసి. ఏది ఏమైనా నాకు తోడుగా నిలబడాలి అనే మాట మొదటి సారి మీ నోటి నుంచి వచ్చింది. సంతోషంగా అనిపించింది అంటుంది తులసి. ప్రస్తుతం నేను ఉన్న పరిస్థితుల్లో మీరు తోడుగా ఉండటం నేను ఇష్టపడే పరిణామం. కొన్నిసార్లు నమ్మకమైన వ్యక్తి పక్కన ఉండటం ధైర్యాన్ని ఇస్తుంది. కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎంత పెద్ద సమస్య అయినా చిన్నగా కనిపించేలా చేస్తుంది. అలాంటి అవకాశం ఇస్తుంటే ఎందుకు వద్దంటాను అంటుంది తులసి.
కెఫే కు సంబంధించిన అన్ని విషయాలు ప్రాపర్ గా సెటిల్ చేయండి. నమ్మి అవకాశం ఇచ్చిన వాళ్లకు పరిస్థితి అర్థం అయ్యేలా చెప్పండి అని చెబుతుంది తులసి. దీంతో నందు సంతోషిస్తాడు. పరందామయ్య, అనసూయ కూడా సంతోషిస్తారు.మరోవైపు రూమ్ లో దివ్య, విక్రమ్ ఇద్దరూ ఒంటరిగా ఉంటారు. విక్రమ్ టీవీ చూస్తూ ఉంటాడు. దీంతో టీవీ కట్టేస్తుంది. నువ్వు టీవీ చూడటానికి వచ్చావా అంటుంది దివ్య. మరోవైపు ముస్లిం అవతారంలో దర్శనం ఇస్తుంది జాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.