Home » News » Karthika Deepam 2 February 18th 2026 Wednesday Episode Highlights
News

Karthika Deepam 2 February 18th 2026 Episode: కార్తీక దీపం 2 ఫిబ్రవరి 18 2026 ఎపిసోడ్ : గుడిలో బయటపడనున్న నిజం? దశరథ చేతికి జ్యోత్స్న రిపోర్ట్స్.. కార్తీక్ సంచలన నిర్ణయం!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: February 18, 2026 8:10 am
Advertisement

Karthika Deepam 2 February 18th 2026 Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ సీరియల్ ‘కార్తీక దీపం 2’ Karthika Deepam 2 రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠభరితంగా సాగుతోంది. సుమిత్ర ఆపరేషన్, దీప త్యాగం, జ్యోత్స్న కుట్రల మధ్య కథ రసవత్తరంగా మారింది. ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం ఎపిసోడ్‌లో ఎలాంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Karthika Deepam 2 February 18th 2026 Episode: కార్తీక దీపం 2 ఫిబ్రవరి 18 2026 ఎపిసోడ్ : గుడిలో బయటపడనున్న నిజం? దశరథ చేతికి జ్యోత్స్న రిపోర్ట్స్.. కార్తీక్ సంచలన నిర్ణయం!

Karthika Deepam 2 February 18th 2026 Episode: జ్యోత్స్నపై దాస్ హెచ్చరిక

కార్తీక్‌తో దాస్ మాట్లాడుతూ జ్యోత్స్న ఎంతకైనా తెగిస్తుందని హెచ్చరిస్తాడు. తన గుట్టు బయటపడకుండా ఉండేందుకు అవసరమైతే సుమిత్రను కూడా చంపేస్తుందని, కడుపుతో ఉన్న దీపనే చంపాలనుకున్నదానికి పెంచిన తల్లి ప్రాణం తీయడం పెద్ద లెక్క కాదని భయపెడతాడు. ఈ మాటలతో కార్తీక్ ఆలోచనలో పడతాడు. ఇంతలో డాక్టర్ హారిక కార్తీక్‌కు ఫోన్ చేసి, దశరథ హాస్పిటల్‌కు వచ్చాడని, జ్యోత్స్న రిపోర్ట్స్ అడుగుతున్నాడని కంగారుగా చెబుతుంది.

Advertisement

Karthika Deepam 2 February 18th 2026 Episode: దశరథ చేతికి రిపోర్ట్స్.. కార్తీక్ ప్లాన్

డాక్టర్ హారిక భయపడుతుండటంతో, కార్తీక్ ఆమెకు ధైర్యం చెబుతాడు. “పర్లేదు డాక్టర్.. మామయ్య అడిగినట్టుగానే జ్యోత్స్న రిపోర్ట్స్ ఆయనకు మెయిల్ చేయండి” అని చెబుతాడు. కార్తీక్ మాటతో డాక్టర్ హారిక రిపోర్ట్స్ పంపిస్తుంది. ఇదిలా ఉండగా, కార్తీక్ దీపతో రేపు ఉదయం మనం గుడికి వెళ్తున్నాం అని చెబుతాడు. అనసూయ, కాంచన కూడా వస్తామనడంతో అందరూ కలిసి గుడికి బయలుదేరుతారు. “రేపు ఉదయం సూర్యుడు ఆకాశంలోనే కాదు.. మన జీవితంలోనూ ఉదయించబోతున్నాడు” అని కార్తీక్ దీపకు హింట్ ఇస్తాడు.

సుమిత్ర అనుమానం.. జ్యోత్స్న భయం

మరోవైపు సుమిత్ర, జ్యోత్స్నతో ఎమోషనల్‌గా మాట్లాడుతుంది. “నువ్వు పుట్టినప్పుడు నేను స్పృహలో లేను.. కళ్లు తెరిచి చూసేసరికి ఊయలలో ఉన్న నిన్ను చూపించారు. అప్పుడే దాస్ అన్నయ్యకు పాప పుట్టి చనిపోయిందని చెప్పారు” అని గతం గుర్తు చేసుకుంటుంది. “నువ్వు ఎంత ఏడ్చినా ఆగలేదు.. కానీ పారిజాతం అత్తయ్య ఎత్తుకోగానే ఏడుపు ఆపేశావు” అని సుమిత్ర అనడంతో.. “నేను పారిజాతం మనవరాలిని కాబట్టి ఏడుపు ఆపేశాను” అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. వీరి మాటలను దశరథ గమనిస్తూ ఉంటాడు.

Advertisement

గుడిలో అసలు నిజం బయటపడుతుందా?

డాక్టర్ హారిక పంపిన మెయిల్ చూసిన దశరథ షాక్ అవుతాడు. రిపోర్ట్స్ చూసి జ్యోత్స్న తన కూతురు కాదేమోనని లేదా రిపోర్ట్స్ ఎందుకు మ్యాచ్ కాలేదని అనుమానపడతాడు. వెంటనే కార్తీక్‌కు ఫోన్ చేయగా, కార్తీక్ అతన్ని గుడికి రమ్మని పిలుస్తాడు. ఉదయాన్నే గుడిలో కలుసుకున్న దశరథ, కార్తీక్‌ను నిలదీస్తాడు.

“దాస్ బాబాయ్‌ని జ్యోత్స్న ఎందుకు చంపాలనుకుంది? నాటి నుంచి జ్యోత్స్నపై నాకు అనుమానం ఉంది. ఇప్పుడు ఈ రిపోర్ట్స్ చూస్తుంటే జ్యోత్స్న మా కూతురు కాదనిపిస్తోంది. శాంపిల్స్ మ్యాచ్ కానప్పుడు.. అత్తను నీ కూతురే కాపాడుతుందని నువ్వు ఏ ధైర్యంతో చెప్పావు?” అని దశరథ కార్తీక్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. “నిజం తెలిసి కూడా నా దగ్గర ఎందుకు దాచావు.. నేను వివరాలు తెలియకుండా ఆపరేషన్‌కు వెళ్లి ఉంటే నా భార్యను చంపేసేవాళ్లని” దశరథ ఆవేదన వ్యక్తం చేస్తాడు.

దీంతో కార్తీక్ ఇక నిజం చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరి గుడిలో దీపనే సుమిత్ర అసలైన కూతురని కార్తీక్ బయటపెడతాడా? దశరథ ఎలా రియాక్ట్ అవుతాడు? అనేది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ చూడాల్సిందే.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి